2, ఆగస్టు 2015, ఆదివారం

"ఫేస్" బుక్


అమ్మా..! నేనే మీకు భారమయ్యానా అమ్మా..!
=================================
అమ్మా.. అమ్మా..
అని గట్టిగా అరిచి నేనెవరినో
నీకు తెలియజేయాలని ఉందమ్మా..!
అప్పుడే మీకంత భారమయ్యానా
ఏంటమ్మా ఇంకా నేను
కళ్లు కూడా తెరవనే లేదుకదమ్మా..!
నాకిద్దరు ఆక్కలున్నప్పుడు
నన్ను పోషించే స్తోమత లేనప్పుడు
మరి నన్నెందుకు కన్నావమ్మా..!
నేను పుట్టిన నీ పొత్తిళ్ల
వాసన కూడా పోకుండానే
నేను మీకు భారమైపోయానమ్మా..!
ఏంటమ్మా ఈ ఘోరాతి ఘోరం
ఏంటమ్మా ఈ అన్యాయం
అని ప్రశ్నిస్తానని అనుకున్నావమ్మా..!
లేదు లేదు నేను ఎంతో అదృష్టవంతురాలినే
మీరు రోడ్డు పక్కన పడేయకుండా
ఐఎస్డీ వాళ్ళకి అప్పగించినందుకు
మీకు నా ధన్యవాదాలమ్మా..!
అమ్మా.. అమ్మా...
అని పదే పదే పిలిచి మన బంధం
నీకు తెలియజేయాలని నాకున్నా
అలా పిలిచే అదృష్టం ఆ దేవుడు
నాకింకా నేర్పలేదమ్మా ..!
ఏదేమైనా నన్ను నీ కడుపులోనే
చిదిమేయకుండా తొమ్మిదినెలలు
కష్టమైనా నన్ను మోసినందుకు
నీకు ధన్యవాదాలమ్మా..!
నేను కాళ్ళతో తన్నినా భరించి మరీ
నాకు జన్మనిచ్చినా నీకు పునర్జన్మే కదా
అందుకే నిన్ను చంపాననే అపవాది
నామీద పడకుండా చేసినందుకు నీకు ధన్యవాదాలమ్మా..!
(ఆడపిల్లను కన్న వాళ్లు.. వారు భారమయ్యారని చెప్తూ పురిటిలోనే వారిని విసిరి వేస్తున్న సందర్భాలను చూసి నా హృదయం ఇలా చలించింది. జి కొండూరులో నిన్న ఇందుకు భిన్నంగా ఐఎస్డీ వాళ్లకు అప్పగించిన వైనం కొంత ఊరటే అయినా...)

1, జులై 2015, బుధవారం

నేరేడు పండు కాదండోయ్..!
కాలిఫోర్నియాలో పండే టమాటా అట
భలే బాగుంది కదా నేస్తమా..!
మంగళగిరి సాక్షి కార్యాలయంలోని ఎడిటోరియల్ డిపార్ట్ మెంట్లో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న కొల్లి వీర వెంకట శివప్రసాద్ రెడ్డి గారు మంగళవారం పదవీవిరమణ చేసిన సందర్భంగా ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించాము.ఈ సందర్భం గా ఆయనకు నావంతు కర్తవ్యంగా అక్షర సన్మానం చేసే అదృష్టం నాకు కల్గినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ...
=======================================
ప్రసాదరెడ్డి గారికి "అక్షర సన్మానం"
=========================================
వ్యవసాయాధారిత కుటుంబంలో పుట్టి
జీవిత లక్ష్యం కోసం అక్షరాలు సాగుచేసి
విలక్షణంగా లక్షణమైన జర్నలిస్టుగా
వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించే దిశగా
ఉదయంలో ఉదయించి,
ఆంధ్ర"భూమి"లో అక్షరాలు పండించిన నేస్తమా..!
కొల్లి వీర వెంకట శివప్రసాద్ రెడ్డి
నామధేయంలో వీరత్వం ఉట్టిపడుతున్నా
ఎవరిమీదా శివప్రతాపం చూపించకుండా
అణుకువే (వెంకన్నే)ఆరాధ్యదైవంగా
సౌమ్యమే పరమావధిగా (ప్రసాదంగా)
ఇరవై ఎనిమిదేళ్ళపాటు
నిర్విరామంగా సేవలందించిన మీకు
"సాక్షి"లో వయసుకు విరామమే వచ్చింది
తప్ప మీ మనసుకు కాదనేది వాస్తవం నేస్తమా..!
మౌనంగా ఎదగమని మొక్కనీకు చెబుతోంది అన్నట్టు
మౌనాన్నే పెట్టుబడిగా పెట్టుకున్న మీరు
అందరి మన్ననలు పొంది
సెహబాష్ అనిపించుకున్నారు కదా నేస్తమా..!
కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన
సోమిరెడ్డి, అనసూయ దంపతులకు
మణిహారంగా నిలిచిన మీకు, మీకుటుంబానికి
సాక్షి కుటుంబం తరఫున ధన్యవాదాలు
తెలియజేస్తున్నాం నేస్తమా..!
-@ కొండా రాజేశ్వరరావు @

హెల్మెట్ ధరించడం మంచిదే
ప్రమాదాలు నివారించవచ్చనడంలో
ఎటువంటి సందేహం లేదు నేస్తమా..!
ఎలక్షన్లలో ఆర్ధికంగా సహకరించారని
ఆ కంపెనీ వారి స్వప్రయోజనాల
కోసమైతే ప్రభుత్వం మళ్ళీమళ్ళీ
తప్పు చేస్తున్నట్లే ఉంది నేస్తమా..!
ప్రమాదం వాటిల్లకూడదంటే
ప్రమాణాలున్న హెల్మెట్ ధరించాలి
అది కొనాలంటే కనీసం ప్రతి ఒక్కరూ
వెయ్యి రూపాయిలు పైనే వెచ్చించాలి నేస్తమా..!
కేవలం పోలీసులు కేసు రాస్తారనే
భయంతో ప్రమాణాలు లేని (ఫైబర్)
హెల్మెట్లే కొంటూ నెట్టుకొచ్చేస్తున్నారు
అవి ధరించిన వారు ప్రమాదాలకు గురై
చనిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి నేస్తమా..!
ఏదైనా ప్రజా ప్రయోజనం కోసం
చేసే పని చిత్తశుద్దితో చేస్తే మంచిది
60 నుంచి 80వేలు పెట్టి బండి కొనేవారు
వెయ్యి రూపాయలుపెట్టి హెల్మెట్ కొనలేరా ఏంటి
బండితోనే హెల్మెట్ ను కూడా తప్పనిసరి చేసి
సరసమైన ధరకు నాణ్యమైన హెల్మెట్ విక్రయించేలా
చర్యలు తీసుకోవాలనేదే నాకంఠశోష నేస్తమా..!
నమస్తే.. నేస్తమా..!
ఈ రోజు వైద్యుల దినోత్సం.
వైద్యరంగం పూర్తిగా వ్యాపారం అయిపోయి,
సామాన్యునికి అందకుండాపోయింది.
వైద్యరంగ స్థితి గతులపై చర్చించుకోవడానికి
ఇంతకంటే సందర్భం ఏముంటుంది?
=============================
డాక్టర్ అనే వారు
అప్పుడూ,ఇప్పుడూ,ఎప్పుడూ
ఎవరికీ దగ్గరగా ఉండరు నేస్తమా..!
కేవలం డబ్బున్న వారికి
మాత్రమే వారు అందుబాటులో
ఉంటారు నేస్తమా..!
వైద్యం ఎప్పుడూ
ఖరీదైన వస్తువే
సామాన్యుడికి నేస్తమా..!
నాడీ వైద్యం పోయింది
అలోపతి,హోమియోపతి
పేరుతో "పరీక్షల" వైద్యం
ప్రవేశపెట్టేశారు నేస్తమా..!
ఆ ముసుగులో
కమీషన్లకు కక్కుర్తి
పడుతూ డబ్బే
పరమావదిగా వైద్యులు
పరుగులు పెడుతున్నారు నేస్తమా..!
ఈ విధానాన్ని ఎవరొచ్చినా
నిలువరించే అవకాశం గాని
ప్రశ్నించే తత్వం గాని
ధైర్యం గాని ఎవరికీ లేదు
రాబోదు కదా నేస్తమా..!
నమస్తే.. నేస్తమా..!
ఈ రోజు వైద్యుల దినోత్సం.
వైద్యరంగం పూర్తిగా వ్యాపారం అయిపోయి,
సామాన్యునికి అందకుండాపోయింది.
వైద్యరంగ స్థితి గతులపై చర్చించుకోవడానికి
ఇంతకంటే సందర్భం ఏముంటుంది?
=============================
డాక్టర్ అనే వారు
అప్పుడూ,ఇప్పుడూ,ఎప్పుడూ
ఎవరికీ దగ్గరగా ఉండరు నేస్తమా..!
కేవలం డబ్బున్న వారికి
మాత్రమే వారు అందుబాటులో
ఉంటారు నేస్తమా..!
వైద్యం ఎప్పుడూ
ఖరీదైన వస్తువే
సామాన్యుడికి నేస్తమా..!
నాడీ వైద్యం పోయింది
అలోపతి,హోమియోపతి
పేరుతో "పరీక్షల" వైద్యం
ప్రవేశపెట్టేశారు నేస్తమా..!
ఆ ముసుగులో
కమీషన్లకు కక్కుర్తి
పడుతూ డబ్బే
పరమావదిగా వైద్యులు
పరుగులు పెడుతున్నారు నేస్తమా..!
ఈ విధానాన్ని ఎవరొచ్చినా
నిలువరించే అవకాశం గాని
ప్రశ్నించే తత్వం గాని
ధైర్యం గాని ఎవరికీ లేదు
రాబోదు కదా నేస్తమా..!
న్యాయస్థానాలను బాబు
ప్రభావితం చేసినంతగా
ఎవరూ చేయలేరు
అని ఇండియా టుడే చెప్పింది
- లాయర్ రంగారావు
======================
ఏం జరిగింది..?
వేదిక ఢిల్లీనా..?
గల్లీనా..?
ఇద్దరు చంద్రులు ఒకటై పోయారా..?
కళ్ళ ముందు తప్పు జరిగిందన్నారు..?
చేసింది ఎవరు..?
చేయించింది ఎవరు..?
ఈ ప్రశ్నలకు సమాధానాలుండవు..?
కాని ఒకరి పై మరొకరు
అరోపణలు చేసేసుకున్నారు...
మనకు మాత్రం ప్రశ్నలనే మిగిల్చేస్తారు నేస్తమా..!
ఎంతగా అంటే...
బ్రహ్మ హరిహరాదులు వచ్చినా
బాబును ఎవరూ రక్షించలేరని
ఉత్తర ప్రగల్భాలు పలికిన
కేసీఆర్ అండ్ కోకు ఇప్పుడేమయ్యింది..?
కనీసం నోరు కూడా మెదపడం లేదేంటి..?
బాబుతో రాజీకుదిరిందా..?
కేసీఆర్ తో రాజీకుదిరిందా..?
అందుకే రేవంత్ కు బెయిల్ వచ్చిందా..?
ఓటుకు నోటు కేసే ఇక జైలుకి వెళ్ళనుందా..?
డబ్బుతీసుకున్న స్టేఫెన్ సన్ పైనే కేసు పెట్టనున్నారా..?
స్టింగ్ ఆపరేషన్ పేరుతో రింగు తిప్పిన ఏసీబీ బాస్ బలై పోతున్నారా..?
అసలు ఆ ఐదుకోట్లు ఎవరిచ్చారు..?
50 లక్షలు రేవంత్ కు ఎలా వచ్చాయి..?
అసలు వీడియోలో ఉంది రేవంతేనా..?
ఫోన్ వాయిస్ బిగ్ బాస్ దే అయితే ఆయన పై
ఇంతవరకూ కేసు ఎందుకు నమోదు చేయలేదు..?
ఈ కేసులో ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నారు..?
మోసపోయింది ఎవరు..?
మోసగించింది ఎవరు..?
ఇలా చేసి కోర్టుకున్న అమూల్యమైన
సమయాన్ని వృధా చేస్తుందెవరు..?
ఈ విషయంలో సామాన్యుడనైన నాకే
ఇన్ని ప్రశ్నలు ఉద్భవిస్తే మరి మేధావులకు ఇంకెన్ని
ప్రశ్నలు వస్తాయో ఏమో..?
ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానందన్న
చందంగా ఉందితెలంగాణా ఏసీబీ తీరు..
హై కోర్టులో చూపించలేని సాక్ష్యాలు
సుప్రీంలో ఏం చూపిస్తారు..?
మీ ప్రయత్నం మీరు చేయండి
చూసేందుకు మేమున్నాంగా..
వినేందుకు కోర్టులున్నాయిగా..
మాతో ఆటలాండేందుకు
మీరున్నారు కదా నేస్తమా..!
రేవంత్ బెయిల్ పై
విడుదలయ్యాడు
కాదు...కాదయ్యా బాబు
మీకేమైనా మైండ్ బ్లాంక్
అయ్యిందా ఏంటి
ఆయన నిర్ధోషిగా
విడుదలయ్యాడని చెబుతుంటే
ఇక కేసూ లేదు
బొంగూ లేదని నేతలు అంటుంటే
నిజమే కదా...
ఎందుకుంటుందయ్యా..
మీ పిచ్చిగాని
న్యాయస్థానాల్నే మేనేజ్ చేసే
నేతలున్నప్పుడు సాక్షాలే
తారుమారైపోతాయి
ఇక కేసులెందుకుంటాయి నేస్తమా..?
కేసు పెట్టిన వారిపైనే
కేసు నమోదు చేయమని
కోర్టులే చెబుతుంటే
ఇక ఫిర్యాదులెందుకుంటాయి నేస్తమా..?
ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్ లను
పరిశీలిస్తే అద్వాని గారు చెప్పినట్టుగా
అప్రకటిత (ఎమర్జెన్సీ) అత్యవసర పరిస్థితి
అమలులో ఉన్నట్టు కనిపించడం లేదా నేస్తమా..?
ఇకపై పొలిటికల్
మర్డర్లు జరిగినా
కేసులుండవేమో
జర జాగ్రత్త నేస్తమా..!
మర్డరు చేసిన
వారు బెయిల్ పై
విడుదలైనప్పుడు
ఇక ఊరేగింపులే
ఊరేగింపులు
కొత్త సంప్రదాయం
భలే బాగుంది కదా నేస్తమా..!
ఇప్పటి వరకూ మనిషిగా ఉన్న
రేవంత్ కు బెయిల్ రాగానే
తెలంగాణ టైగర్ గా మారిపోయాడట
అయ్యో పాపం రేపటినుంచి
ఏమి తింటాడో ఏమో
ఎవరు ఎప్పుడు బలైపోతారో
కార్యకర్తలూ జర జాగ్రత్త..!

26, జూన్ 2015, శుక్రవారం

అరేయ్...బాబూ...
మమ్మల్ని పట్టించుకోండిరా...
మాకు "యోగా"లు భోగాలు వద్దు..
స్వచ్చ భారత్ పేరుతో మమ్మల్ని వేధించ వద్దు
స్వచ్చమైన నాలుగు పుస్తకాలు ఉండేలా చేయండిరా బాబు
ఆ గాడిదకు మాకు తేడా ఏముందిరా బాబూ
మాకు వెన్నులో నొప్పి వచ్చేస్తుందన్నా
ఎవడూ పట్టించుకోవడం లేదేంటిరా బాబూ...
ఎంత సేపూ ఓటుకు నోటని
సెక్షన్ 8ని అంటారే గాని మా గురించి ఎవడూ
ఆలోచించరేంటిరా బాబూ...

20, జూన్ 2015, శనివారం

ప్రజలిచ్చిన అధికారాన్ని
ప్రజల బాగోగులకు
వినియోగించకుండా
అధికార మదంతో
తప్పులపై తప్పులు చేస్తూ...
చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే
ప్రయత్నంలో నేతలను రక్షించేందుకే
సమయాన్నంతా వృధా చేస్తూ...
ప్రజలకేదో అన్యాయం
జరిగిపోతుందని తెలుగు ప్రజలను
రెచ్చగొడుతూ విచ్చల విడిగా
అవినీతిని ప్రోత్సహిస్తూ...
మీరు చేసే అవినీతి, అక్రమాలను
ప్రశ్నించే మీడియా గొంతును
సైతం నొక్కేస్తూ...
రాజ్యాంగబద్దంగా ఎన్నికైన
గవర్నర్ లాంటి వ్యక్తులను
సైతం బ్లాక్ మెయిల్ చేస్తూ...
ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ
రాజ్యాంగాన్ని...
న్యాయవ్యవస్థను...
రాజకీయమనే కుతంత్ర చట్రంలో ఇరికించేస్తూ..
ఎటువైపుకు తీసుకెళ్తున్నారు నేస్తమా..?
ఎవరిని ఉద్దరించడానికి ఇలాంటి
పరిపాలన చేస్తున్నారు నేస్తమా...?
నాలా ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై
ఏదో ఒక ముద్రవేసి ప్రశ్నించే తత్వాన్నే
కలుపు మొక్కల మాదిరి
ఏరిపారేయాలనుకుంటే ప్రజాస్వామ్యంలో
సాధ్యం కాదు నేస్తమా..?
నేను పోతే ఇంకొకరు
ఇంకొకరు పోతే మరొకరు
పుట్టుకొస్తూనే ఉంటారు
ప్రశ్నించే వారు నేస్తమా..?
ఓటు నోటుపై
దేశమంతా గగ్గోల పెడుతుంటే
తనకేమీ తెలీయదన్నట్లు
మేము సచ్చీలలము
అన్నట్టున్నారు బీజేపీ నేతలు...
తీరా సొంతపార్టీలోని
మహిళా మణులిద్దరు లలిత్ మోదీ
ఉచ్చులో చిక్కుకున్న తరుణంలో
సెల్ఫ్ డిఫెన్స్ లో పడిన
మోదీ సర్కారు చిక్కుల్లో
పడకుండా సమర్ధించుకునే
పనిలో పడ్డారు...
పనిలో పనిగా
అంధ్రాలో ఓటుకు నోటు
కేసులో చిక్కుకుని
ఉక్కిరిబిక్కిరి అవుతూ
అలవాటులో పొరపాటుగా
గవర్నర్ ని సైతం
రాజకీయ రొచ్చులోకి
దించే పనిలో పడ్డ నేపధ్యంలో
అయన ఆగ్రహానికి
బలై పోకుండా ఉండాలని
రంగంలోకి దిగిన వెంకన్న
లాలూచే మార్గాలను ఉద్భోదిస్తూ
ఇద్దరు సీయం లూ చక్కనైన
పాలన అందించాలే తప్ప
ఇలా గిల్లికజ్జాలు కూడదని
హితవు చేశారట నేస్తమా..!
పార్టీ ఫండ్ కోసమని
లక్ష రూపాయలు తీసుకుంటూ
స్ట్రింగ్ ఆపరేషన్ కి చిక్కిన
దళితుడైన బంగారు లక్ష్మణ్ ను
తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించి
బలి పశువును చేసిన
అప్పటి పెద్దలకు
ఇప్పుడు అడ్డంగా దొరికిన సొంత పార్టీ వారిని
ఎందుకు రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టు
అప్పుడు అమలు చేసిన నైతికత
ఇప్పుడేమైంది..?
======================
ఆ రోజుల్లో ..
బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి ..
రాజీనామా చేయించిన
బీజేపీ వెంకన్న గ్యాంగ్
పీకల్లోతు మునిగిపోయిన
ఆ మహిళా మణులను ఎందుకు రక్షిస్తున్నారో...
===============================
ఆంధ్రాని మనిద్దరం
పంచుకుందామని కూడబలుక్కుని
ప్రత్యేక హోదాను పక్కన పెట్టి
"హోదా" మనకెందుకంటూ
ప్రకటనలు ఇప్పించ్చి
మోదీ వద్ద మార్కులు కొట్టేసిన వెంకన్న
చెప్పింది చెప్పినట్టు చేసిన మన బాసు
రుణం తీర్చుకునే పనిలో పడ్డారట
ఓటుకు నోటు కేసులో పోకల్లోతు
ఇరుక్కుపోయిన "బాబు అండ్ కో" ను
రక్షించే పనిలో పడ్డారట నిజమేనా నేస్తమా..!
=============================
సాక్షి టీవీ లో చర్చలకు వెళ్ళకండి -బాబు ఆదేశాలు
అంతేలే మీ కులస్థుల కు చెందిన TV9 , ABN , ETV, NTV ,TV5, ExpressTV , మహా టీవీ, CVR .. టీవీ లకే వెల్లాలన్నమాట
[Telugu TV Channels own and run by Kammas
1) TV9 - Velicheti Ravi Prakash
2) ABN Andhra Jyothi - Radhakrishna Vemuri
3) ETV and Eenadu- Cherukuri Ramoji Rao
4) TV 5 - Bollineni Rajagopala Naidu
5) NTV - Tummala Narendranath chowdary.
6) Express TV - Chigurupati Jairam
7) TV6 - Nara Lokesh
8) Mahaa TV - Inaganti Venkatarao now taken over by Sujana Chowdary.
9) CVR News - Chalasani Venkateswara Rao
10) CVR Health - Chalasani Venkateswara Rao
11) YTV - Yalamanchili Venkateswara Rao (Aired from Vizag)
12) Bhakti - Tummala Narendranath Chowdary
13) Vanitha - Tummala Narendranath Chowdary
14) ATV - Anil Sunkara
15) Om TV - Chalasani Venkateswara Rao
16) Captain TV (Tamil) - Lingutla Kannaiah Sudhish (LK Sudhish)
17) Gemini - Akkineni Manohara Prasad (Founder and stake holder)
18) MAA - (MAA - Music, MAA Movies) Nimmagadda Prasad, Akkineni Nagarjuna (Majority stake holders)

14, జూన్ 2015, ఆదివారం

ప్రజల్లో మమేకమై
ప్రజల కోసమే
పనిచేస్తున్నామని
పదేపదే చెప్పుకునే వారు
పరువు కోసం కాకపోయినా
సామాజిక భాద్యతతో మెలగాల్సిన
అవసరం ఉందని గుర్తెరిగితే
ముందుతరాలకు మంచిదనేది నా భావన
మరి మీరేమంటారు నేస్తమా..!
నిజంగా నీతికి.. నిజాయితీకి
నిలువ నీడలేకుండా చేసేస్తున్నారుగా...
తప్పును కూడా ఒప్పుగా
చూపించే మార్గాన్ని అన్వేషిస్తున్నారుగా..
చరిత్రలను సైతం
తిరగ రాసేస్తున్నారుగా..
రాబోయే తరానికి
చాలా చక్కని బాట వేస్తున్నారుగా..
రాబోయే రోజుల్లో
ఇవే పాఠ్యాంశాలుగా చేసేటట్టున్నారుగా..
ఇలాంటి కమ్మనైన పదాలు
మీ డిక్టనరీలోనే ఉన్నాయని తెలియదుగా...
==============================
లోపలేస్తే తెలుస్తుంది ...
ఎవరు కొజ్జాల్లో..
ఎవరు జఫాగాళ్ళో..
ఎవరు లఫూట్ గాళ్ళో..
త్వరలో నోటీసులొస్తాయిగా..
కంగారు పడకండిరా బాబులు...
=======================
మీ బాస్ ని లోపలేసే వరకూ
మీరు నిద్రపోయేటట్టు లేరు..
అదేగా మీకూ కావల్సింది
అందుకేగా మీరందరూ
ఇలా అందర్ని రెచ్చ గొడుతున్నారు...
========================
సరే ముందుందిగా
ముసళ్ళ పండగ..
తననెవరో రక్షిస్తారని
మీసాలు మెలిసాడు
ఏమయ్యాడు...
చెంచెల గూడా జైలు
తప్పలేదు...
==============
ఒకప్పుడు నేను నిప్పుని
కమ్మని పప్పుని అని...
మీడియా ముందు
తెగ రెచ్చిపోయాడు...
ఇప్పుడెక్కడికి వెళ్ళాడు
ఆ నిప్పు ఏమయ్యింది
బొగ్గుగా ఎందుకు మారింది...??????
ఇప్పుడు ఆ బొగ్గు
మసిని మీ బాసుకీ
రాశాడుగా...
ఆ నల్ల గీతల్ని
చెరిపేసే మార్గం లో
మసి బొగ్గుల్ని
మిగిలిన వారికీ రాయకండి ప్లీజ్....!!!!!!
========================

9, జూన్ 2015, మంగళవారం

ప్రజాస్వామ్య వ్యవస్థే
తలదించుకునేలా చేసి..
ఇప్పుడేమో
నేనొల్ల..నేనొల్ల అంటే
నిన్నెవరూ ఆదుకోరు నేస్తమా..!
చట్టం అంటే సరదాకాదుగా
ప్రధాని అయినా..
హోం మంత్రి అయినా..
నెల్లూరు నాయుడైనా
నిన్ను రక్షించే ప్రయత్నం చేస్తే
వాళ్ళూ ఇరుక్కుంటారు నేస్తమా..!


ధనంతో ఏదైన చేయొచ్చు..
అనుకున్నా..!
ఇప్పటి వరకూ చేసుకుంటూ వచ్చా..
నేను చెప్పిందే వేదం అనిపించుకున్నా..
కేంద్రాన్ని సైతం నేనే శాసించా..
కాని ఇదేంటిరా బాబు..
ఎన్ని కోట్లు లంచాలుగా ఇచ్చినా..
పట్టుబడని నేను
చిన్న డీల్ చేయమని అప్పచెబితే
అడ్డంగ దొరికిపోయి
నన్ను కూడా ఇరికించేశాడేంటిరా బాబు..
డబ్బు ఇంతపని చేస్తుందా ప్చ్...ప్చ్...
డబ్బుతోనే అందరిని ఆడించా
ఆడించాలి అనుకున్నా...
ఆడిస్తున్నా...
అందుకే నేను ఇప్పుడు కూడా
కేంద్రంలో రింగ్ తిప్పేందుకు వెళ్తున్నా...
నేను అవసరమైన వారందరికీ లంచాలు ఇస్తూ
నీతివంతమైన పాలన అందిస్తున్నా...
నన్నెవడూ ఆపలేడు..
నేను అన్నాహజారేకు అన్నను..
గాంధీకి వారసుడను..
నాకూ ప్రత్యేక ఏసీబీ ఉంది..
కాదంటే ఇంటిలిజెన్సీ ఫెయిల్ అయ్యింది అంతే..
అదే నాకు ప్రత్యక సైన్యం
అవసరమైతే ఇదే డబ్బును ఇప్పుడు కూడా
అవసరమైన వారికిచ్చి...
నాపై కేసులు లేకుండా చేసుకునే దమ్ము ధైర్యం నాకుంది
కాదంటే అనవసరంగా ఇరికించేశాడనే నాకు బాధగా ఉంది
అందుకే నాకు నిద్రపట్టడంలేదు అంతే..
నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం వారికెవరిచ్చారు..
నేను నీతివంతమైన పాలన చేసేందుకు..
నేను ఏదైనా మాట్లాడతా..
దాన్ని ట్యాప్ చేయడంవంటి పిచ్చి చేష్టలు
చేయడం ఏంటి నాన్సెస్...

నీతికి నీవు నిప్పయితే..
ఆ నిప్పును సృష్టించే మంటను నేను
నాతో పెట్టుకోకు మడ్తడిపోద్ది.. @ రాజేష్ @ 10.6.15
బి అలర్ట్..!
నోటుకి ఓటు కేసులో..
దేశంలో "హవాలా రాజకీయ"
దొంగలు చిక్కారోచ్...! @ rajesh@
ఓటుకి నోటులొల్లి
దేశంలో హల్ చల్ చేస్తుంటే
పవనిజం ఇంకా నిద్ర
లేవలేదేంటి నేస్తమా..!

8, జూన్ 2015, సోమవారం

కళ్ళముందు కనబడే
సాక్షాన్నే కాదంటున్నారంటే..
ఇంతకాన్నా
ఘోరం ఏముంటుంది నేస్తమా..!
ఏసీబీకి అడ్డంగా దొరికినప్పటికీ
అడ్డదిడ్డమైన మాటలతో దాడికి
దిగే నేతలనేమనాలి నేస్తమా..!
మీరంటున్నదే నిజమని నమ్మేద్దాం
కాని దేశంలో ఏసీబీ చేస్తున్న
దాడులలో దొరికిన వారందరూ
రేవంత్ లాంటి వారేనా నేస్తమా..!
"దేశం"లో ఎంతటి ఘోరాలు చేసినా
నేరాలకు పాల్పడినా
మీ పార్టీ వారు తప్ప
దేశంలో మిగతావారందరూ
దొంగలేనంటారు మీరు అవునా నేస్తమా..!
పక్కా ఆధారాలతో
బయటపడిన వీడియో చిత్రాలను
చూసి ప్రపంచమంతా విస్తుపోయినా
రేవంత్ ఎపిసోడ్ పై
ఇంత వరకు నోరు విప్పని
బాస్ లో నైతికత ఎంత ఉందో
అర్ధమవుతోంది కదా నేస్తమా..!
ఇన్ని రోజులుగా ప్రజలను
మోసం చేస్తూనే ఉన్నారు
ఉపన్యాసాలపై ఉపన్యాసాలు దంచి
తను, తన వర్గమంతా
సాధువులమని చెబుతునే ఉన్నారు
పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ
ఎవరూ చూడడం లేదనే విధంగా నేస్తమా..!
ప్రజలను మభ్య పెట్టి, మాయమాటలు చెప్పి..
కులాలుగా విభజించి, మీ వ్యాపారాల కోసం
మొత్తం తెలుగువారి మధ్యే చిచ్చుపెట్టి
సఖ్యత లేకుండా చేస్తున్నారు కదా నేస్తమా..!
నేను నిద్రపోను.. ఎవరినీ నిద్రపోనివ్వనని
అనేక సందర్భాల్లో ప్రస్తావించిన బాసుకి
ఇప్పుడు నిద్రపట్టడం లేదని బాధపడితే ఎలా నేస్తమా..!
నేను, నా పార్టీ
నిప్పన్నారు మీరు ...
ఎవరు పట్టుకున్నా
కాలిపోతారన్నారు మీ నేతలు..
మొన్నటి రేవంత్ ఎపిసోడ్ తో
తేటతెల్లమయ్యింది నిప్పుకాదు
నివురుగప్పిన నిప్పేనని...
ఆ విషయం తెలియని రేవంత్
అమాయకంగా పట్టుకుని
చేతులు కాల్చుకున్నాడు కదా నేస్తమా..!

దీక్ష,దక్షత గల నేతనన్నారు
సీఎం గా తొమ్మిదేళ్ళ సుదీర్ఘ
అనుభవం గల నేతను నేకొక్కడినే అన్నారు
నేను తప్ప ఎవరూ ఈ కొత్త రాష్ట్రానికి
దిశానిర్ధేశం చేయలేరని నమ్మించారు
రాష్ట్రం అభివృద్ది చెందాలంటే
నాలాంటి నిజాయితీ పరుడే కావాలని
నేను ఆంధ్రా అన్నా హజారే నన్నారు కదా నేస్తమా..!
గెలవననే నమ్మకంతో
అమలుకాని హామీలిచ్చారు
తీరా ప్రజలు మిమ్మల్నే
గెలిపించే సరికి ఉచ్చి తబ్బిబ్బయ్యారు
ఏదేమైనా నేనిచ్చిన హమీలన్నీ
నెరవేరుస్తానని రోజుకో మాట చెప్పుకొచ్చారు
నిన్నటి మీ మాటతో మీ మాటల్లో
నిజాయితీ లేదని తేటతెల్లమయ్యింది కదా
ఇంకా ఎంతకాలం ఇలానే
తెలుగు ప్రజలను మోసం చేస్తారు నేస్తమా..!
హల్లో టీడీపీ అధినేతలూ
మీరు చెప్పీదే నిజమే...
ప్రజలు నమ్ముతున్నారు
మీ బాబు తప్పు చేయలేదు
మీరు బల్లగుద్ది చెచుతున్నారుగా...
ఓటుకు నోటు కొనలేదు
ఎస్ కరక్టే...
కాని నైతకత ఉందిగా..
ఇంత తీవ్రమైన ఆరోపణలు
వచ్చినప్పుడు పదవికి రాజీనామా చేయాలి
అది మీ నైతికత...
మీలో నైతికత ఉంటే
మీరు చేసింది కరక్టే అని
మీరు నమ్ముతున్నప్పుడు
మీ పదవులకు రాజీనామా చేయండి..
ప్రజలకు అవకాశం ఇవ్వండి
ప్రజలే తీర్పుచెబుతారుగా...
మీకు దమ్ము ధైర్యం ఉంటే
ఆ పని చేయొచ్చుగా..
దేశంలో అందరూ దొంగలే మీరు తప్ప
మీరు చెప్పేదే వేదం అని అనుకుంటున్నారు
అది చాలా తప్పు
అది తెలుసుకుని మెలిగితే మంచిది నేస్తమా..!
మీరు డబ్బు విచ్చల విడిగా ఖర్చుపెట్టి
ఏదైనా సాధించవచ్చని మీరు అనుకుంటున్నారు
అదే విధానాన్ని అవలంభిస్తున్నారు
మీలో నుండి వెళ్ళిన వారే మీ వీక్ పాయింట్స్
క్యాష్ చేసుకుంటున్నారని మీరు గమనించడం లేదు
మీరు నిజంగా ప్రజలకు కావాల్సిన
ప్రజారంజక పాలన చేస్తున్నామనే ధీమా మీలో ఉంటే
మీరు ఆ పదవికి రాజీనామా చేసి
మీ నిజస్వరూపాన్ని మీరు నిరూపించుకోండి నేస్తమా..!
తెలంగాణ వాళ్ళు కాదు
బాబు వెనుక ఉన్నవారే
అయనను బజారుకీడ్చాలని
చూస్తున్నట్టున్నారు..
పరకాల ప్రభాకర్,
జూపూడి ప్రభాకర్,
వైబి రాజేంద్రప్రసాద్,
పయ్యావుల కేశవ్..
తదితర నేతల బుకాయింపులను
వారి బెదిరింపులను చూస్తుంటే
రాజకీయాలంటే ఇంత నీతి బాహ్యంగా
ఉంటాయనేది ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది..
స్టీఫెన్సన్నే.. రేవంత్ కు
ఐదు కోట్లు ఇచ్చారంట
పార్టీలోకి చేర్చుకోమని..
అందుకు గాను ఐదుకోట్లు
ఇవ్వజూపారంటూ..
తెలుగుదేశం నేతలు
కొత్తవాదన లేవనెత్తారంట
నీతి నిజాయితీగల
రేవంత్ ఏసీబీ అధికారులకు
ఫిర్యాదు చేస్తే రేవంత్నే
అరెస్ట్ చేసి కుట్ర చేశారంట
కదా నిజమేనా నేస్తమా..!
రైతన్నలను ఉసురు
పెడితే ఏం జరుగుద్దో
ఇప్పుడైనా అర్ధమయిందా...
ఏడాదికి మూడు పంటలు
పండించే భూములను
బలవంతంగా లాక్కుని
అన్నదాతను ఉసురు పెట్టారు..
దాని ప్రతిఫలమే
ఇప్పుడిలా మూటకట్టుకుంటున్నారు నేస్తమా..!

రైతుల పక్షపాతిని
అని చెప్పుకునే మనబాసు
రైతులకు మేలు చేయాలి
కాని రైతుల భూములు
లాక్కుని "రియల్" వ్యాపారం చేస్తూ
కొత్త నిర్వచనం చెప్పారు
మన బాబుగారు కదా నేస్తమా..!
ప్రజలకేదో ప్రయోజనం చేస్తారని
ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని
నేను మారానని చెప్పిన బాబుగారి
మాటలను నమ్మి గెలిపిస్తే
ఓటుకి నోటిచ్చే కేసులో అడ్డంగా
ఇరుక్కుపోయి తన నైజాన్ని
సైన్యంతో తిప్పికొట్టాలని చూస్తున్నారు
ఇదిలా ఉంటే తెలుగు తమ్ముళ్ళకు
మరో షాక్ ఇస్తున్నారు
బాబుగారు చూసుకోండి తమ్ముళ్ళూ
బైక్ ఉండే తెల్లరేషన్ కార్డు కట్ అట
నిత్యావసర వస్తువుగా మారిన ఈ రోజుల్లో
ఇలా చేయడం సబబే కదా నేస్తమా..!

7, జూన్ 2015, ఆదివారం

ఓటుకి నోటిచ్చింది
తెలంగాణలో..
బాస్ ఫోన్ మాట్లాడింది
తెలంగాణలో..
ఆంధ్రాలో కేసుల పెడుతూ
లొల్లి చేస్తారేమిటి నేస్తమా..!

4, జూన్ 2015, గురువారం

ఓటుకి నోటు ఇస్తావా...
ఓటంటే నీకు తమాషాగా ఉందా..
ప్రజలని మోసం చేస్తున్నావ్.. క్షమించా..
అధికారులను బెదిరిస్తున్నావ్.. క్షమించా..
కోర్టులను మభ్యపెడుతున్నావ్.. క్షమించా..
నన్నెంత(ఓటు)కాలం అవహేళన చేస్తావు...
వదల బొమ్మాళి... నిన్ను వదలా..?
సిగ్గుమాలిన పనిచేసినందుకు
తలదించుకోవాల్సిందిపోయి..
బుకాయింపులు, సమర్ధింపులు
అడ్డగోలు వాదనలు, అనవసర రాద్దాంతాలు..
అందుకే అన్నారు పెద్దలు
రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని...
రేవంత్ ఎపిసోడ్ కర్మ,కర్త,క్రియ
అంతా మౌనం వహిస్తూ..
ఎత్తుకు పైఎత్తులు, వ్యూహప్రతివ్యూహాలలో
కేసు నుంచి బయటపడేలా పన్నాగాలు..
నిజాలను నిగ్గుతేల్చాలని
డిమాండ్ చేయాల్సిన నేతలు..
తూతూ మంత్రంగా
మొక్కుబడి ప్రకటనలు..
అవినీతి పనులకు ఉసుగొల్పిన సూత్రదారే
నీతిపై ప్రజలతో ప్రమాణాలు చేయించడం...
ప్రజా స్వామ్య విలువల
వలువలను ఊడదీసినట్టు కాదా నేస్తమా..!
కళ్ళముందు కనబడే
సాక్షాన్నే కాదంటున్నారంటే..
ఇంతకాన్నా
ఘోరం ఏముంటుంది నేస్తమా..!
ఏసీబీకి అడ్డంగా దొరికినప్పటికీ
అడ్డదిడ్డమైన మాటలతో దాడికి
దిగే నేతలనేమనాలి నేస్తమా..!
మీరంటున్నదే నిజమని నమ్మేద్దాం
కాని దేశంలో ఏసీబీ చేస్తున్న
దాడులలో దొరికిన వారందరూ
రేవంత్ లాంటి వారేనా నేస్తమా..!
"దేశం"లో ఎంతటి ఘోరాలు చేసినా
నేరాలకు పాల్పడినా
మీ పార్టీ వారు తప్ప
దేశంలో మిగతావారందరూ
దొంగలేనంటారు మీరు అవునా నేస్తమా..!
పక్కా ఆధారాలతో
బయటపడిన వీడియో చిత్రాలను
చూసి ప్రపంచమంతా విస్తుపోయినా
రేవంత్ ఎపిసోడ్ పై
ఇంత వరకు నోరు విప్పని
బాస్ లో నైతికత ఎంత ఉందో
అర్ధమవుతోంది కదా నేస్తమా..!
ఇన్ని రోజులుగా ప్రజలను
మోసం చేస్తూనే ఉన్నారు
ఉపన్యాసాలపై ఉపన్యాసాలు దంచి
తను, తన వర్గమంతా
సాధువులమని చెబుతునే ఉన్నారు
పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ
ఎవరూ చూడడం లేదనే విధంగా నేస్తమా..!
ప్రజలను మభ్య పెట్టి, మాయమాటలు చెప్పి..
కులాలుగా విభజించి, మీ వ్యాపారాల కోసం
మొత్తం తెలుగువారి మధ్యే చిచ్చుపెట్టి
సఖ్యత లేకుండా చేస్తున్నారు కదా నేస్తమా..!
నేను నిద్రపోను.. ఎవరినీ నిద్రపోనివ్వనని
అనేక సందర్భాల్లో ప్రస్తావించిన బాసుకి
ఇప్పుడు నిద్రపట్టడం లేదని బాధపడితే ఎలా నేస్తమా..!
యనమలే కాబోయే ముఖ్యమంత్రిగా
ప్రమాణానికి రంగం సిద్దం చేస్తున్నారట
ఏ 1 అయినా ఏ 2 అయినా
పదవికి రాజీనామా చేయాల్సిందేనటగా..
బాస్ కి విధేయుడెవరని వలవేసి
గాలిస్తే యనమలే సమర్ధుడని తేలాడట నిజమేనా నేస్తమా..!

6, మే 2015, బుధవారం

మౌనం, నవ్వు రెండూ శక్తిమంతమైన ఆయుదాలట
నవ్వు ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ
మౌనం చాలా సమస్యలను నిరోధిస్తుందట తెలుసా నేస్తమా..!
సింగపూరు,చైనా తలదన్నే విధంగా
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి
కొత్త కొత్త హంగులు అద్దేస్తున్నారందరూ
మాస్టర్ ప్లాన్ తో బూస్టప్ చేసేస్తున్నారు కొందరు
రాష్ట్ర రాజధాని అమరావతి స్వరూపం
ఎలా ఉంటుందో తెలియదు ఎవరికీ కాని
రాజధాని హంగులనే ప్రతిఒక్కరూ ఎరగావేస్తూ
రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిపోయారు...
ఆకాశంలో చుక్కలేమోగాని
మబ్బుల్లో విహరించేలా చేసేస్తున్నారు
పట్టపగలు మనకు కనపడకపోయినా
కళ్ళముందే కనికట్టు చేసేస్తూ
భవంతుల మీద భవంతులు కట్టేస్తున్నారు
ఇందుకు పత్రికలూ ఏమీ తీసిపోలేదు
ప్రతిరోజూ ఒకరికొకరు పోటీ పడుతూ
ప్రజల్ని మాత్రం ఏమార్చేస్తున్నారు
ఇదేమి వింతో.. ఇదేమి మాయో..
కనుమరుగు కాబోతుంది విజయవాడ వైభోగం
రాజ్యమేలబోతోంది అందచందాల అమరావతి సుందరరూపం...!
@ రాజేష్ @
శ్వాస,ధ్యాస ఒకటైనప్పుడు_లక్ష్యసాధన సునాయాసమే కదా నేస్తమా..! @ రాజేష్ @
నటనే ధ్యేయంగా..
స్వార్ధమే పరమార్ధంగా..
అసూయే ఆస్తిగా..
కుతంత్రమే పెట్టుబడిగా..
వెటకారమే వినయంగా..
కొందరు మురిసిపోతూ
ఎదుటి వారిని ఏమార్చేస్తుంటారు..
జరబద్రం నేస్తమా..! @ రాజేష్ //07.05.15//
నన్ను ఎప్పుడూ ఓడిస్తావు_స్వచ్చమైన నీ ప్రేమతో..! @ రాజేష్ //07.05.15//

ఇంటర్ నెట్ ఇక ఆగిపోతుందా?

Sakshi | Updated: May 04, 2015 16:28 (IST)
ఇంటర్ నెట్ ఇక ఆగిపోతుందా?
లండన్ : ప్రతివారికీ ఇప్పుడు చేతిలో ఇంటర్ నెట్ లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి. సినిమా టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా, చివరకు క్రికెట్ స్కోరు ఎంతో తెలుసుకోవాలన్నా కూడా అరిచేతిలో ఇంటర్ నెట్ ఉండాల్సిందే. కానీ, అలాంటి ఇంటర్ నెట్ సామర్థ్యం కేవలం ఎనిమిదేళ్లలో నిండిపోయి, అది కుప్పకూలే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మన కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు.. అన్నింటికీ నెట్ ను అందించే కేబుళ్లు, ఆప్టికల్ ఫైబర్ల సామర్థ్యం ఎనిమిదేళ్లలో పూర్తిగా అయిపోతుందట. ఆ తర్వాత ఇక వాటినుంచి సమాచార ప్రసారం సాధ్యం కాదని చెబుతున్నారు.  ఈ విషయం మీద లండన్ లోని రాయల్ సొసైటీ ఈ నెలాఖరులో ప్రముఖ ఇంజనీర్లు, భౌతిక శాస్త్రవేత్తలు, టెలికం నిపుణులు, సంస్థలతో ఓ సమావేశం ఏర్పాటుచేసింది.

అందులో పాల్గొన్న ప్రొఫెసర్ ఆండ్రూ ఎలిస్ ఈ బాంబు పేల్చారు. రోజురోజుకూ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోందని, దాన్ని తట్టుకోవడం అస్సలు సాధ్యం ఆకవట్లేదని ఎలిస్ చెప్పారు. రోజురోజుకూ టెక్నాలజీ విస్తరించడం, ఎక్కువ మందికి, ఎక్కువ సామర్థ్యంతో నెట్ వాడుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

25, ఏప్రిల్ 2015, శనివారం

నదుల్లో ఇసుక గల్లంతవుతోంది
కొండల్లో బండలు మాయమవుతున్నాయి
అడవులు అడవులే దారిమల్లుతున్నాయి
వెరసి స్వార్ధం ఎంతో పెరిగిపోయింది
ప్రకృతితో ఆటలాడితే తప్పదు అంతం..!
పండుతున్న పాపాలకు
ఈ భూప్రకంపనలే సాక్ష్యం
హృదయవిదారక దృశ్యాలే
ఇందుకు నిదర్శనం
ప్రకృతిని కాపాడేందుకు
కావాలి ప్రతి ఒక్కరూ ఆదర్శం
ఇప్పుడే ఎందుకొస్తున్నాయో
గుర్తించండి ఇలాంటి విధ్వంశాలు
వందేళ్లలో ఎప్పుడూ
రాని ప్రకృతి ప్రకోపాలు..!

మదినిండా నీ నవ్వులపువ్వులే గుచ్చుకుంటున్నాయ్..! @ రాజేష్//


16, ఏప్రిల్ 2015, గురువారం

తప్పును తప్పుగా ...

తప్పును తప్పుగా ...
ఒప్పుకునేవాడు ఆదర్శవంతుడు
తప్పును ఒప్పుగా
వాదించేవాడు మూర్ఖుడు
తప్పును వేలెత్తి
చూపించడం మానేసి
ఒప్పును అనుసరించే
మార్గం చూపిస్తే మంచిది
మంచి మనుసుతో
చూపించే మార్గం ఏదైనా
ముళ్ళతోనే ముడిపడి
ఉంటుందని తెలుసుకో
తెలుసుకుని ఆ మార్గాన్ని
నీకు ఆదర్శంగా మలుచుకో..! @ రాజేష్ @
"షి"కార్లు
=======
నాకు తెలిసినవన్నీ
నిజాలు కావు
నీకు తెలిసినదాంట్లో
వాస్తవాలూ లేవు
లేనివి ఉన్నట్లుగా
ఉన్నవి లేనట్లుగా
పుకార్లు వస్తుంటయి
మదిలో మెదిలే
మూలమొకటుంటది కాని
అది వెతికే పనిలో
మరొకటుంటది
నాకొకటి తెలిసేలోగా
నీకు మరొకటి తెలుస్తది
వాస్తవమొకటైతే
విషయమొకటుంటది
అదే కార్లలో "షి"కార్లు చేసేస్తుంటది...! @ రాజేష్ @

మల్లెలకే మత్తెక్కిస్తోంది నీ సొగసైన సౌందర్యం నేస్తమా..! @ raajesh @

మల్లెలకే మత్తెక్కిస్తోంది నీ సొగసైన సౌందర్యం నేస్తమా..! @ raajesh @

రసరమ్యరమణీయం_నీ ముఖారవిందం ..! @ రాజేష్


సొగసైన ధగధగలు నీ సొంతం..@ రాజేష్ /17.04.15/


నీ నవ్వుల వరదకు నేనెటుకొట్టుకుపోతానో..! @ rajesh @


13, ఏప్రిల్ 2015, సోమవారం

"షి"కార్లు
=======
నాకు తెలిసినవన్నీ
నిజాలు కావు
నీకు తెలిసినదాంట్లో
వాస్తవాలూ లేవు
లేనివి ఉన్నట్లుగా
ఉన్నవి లేనట్లుగా
పుకార్లు వస్తుంటయి
మదిలో మెదిలే
మూలమొకటుంటది కాని
అది వెతికే పనిలో
మరొకటుంటది
నాకొకటి తెలిసేలోగా
నీకు మరొకటి తెలుస్తది
వాస్తవమొకటైతే
విషయమొకటుంటది
అదే కార్లలో "షి"కార్లు చేసేస్తుంటది...! @ రాజేష్ @

నటించే నీ నేత్రాలకూ నవ్వులు నేర్పావుగా భలే @ రాజేష్@


మాయా..మాయా.. అంతా మాయా...!


మీరిలా కొట్టుకుంటూ ఉంటే
మీ ఉద్యోగాలు ఊడిపోతాయ్..
జాగ్రత్త.. ఏమనుకుంటున్నారో ఖబడ్దార్..
అంటూ హెచ్చరించారు ఓ పెద్దాయన..
దాంతో ఒక్కసారిగా వెన్నులో వణుకుపుట్టింది వారికి
పెద్దాయన అన్నంత పని చేస్తారా ఏంటి..?
అనుకుంటూ భయంతో చెమటలు పట్టిన ఖద్దర్ పెద్దలు
ఏసీ గదుల్లో దూరి చెమటలు తుడుచుకునే పనిలో పడ్డారు
ఐదేళ్ళ ఉద్యోగానికి కాంట్రాక్టు కుదుర్చుకున్న వారు ఇంత భయపడిపోతే..
30 ఏళ్ళ సర్వీసు చేయాల్సిన వారు ఇంకెంత హడలెత్తిపోవాలో.. ఏంటో.. అంటూ వారిద్దరూ సెల్ ఫోన్లో రహస్యంగా సంభాషించుకుంటుండగా
అకస్మాత్తుగా ఓ సీనియర్ ఉద్యోగి ఏసి గదిలోకి ప్రవేశించాడు.
ఏంటి సార్ ఎప్పుడూ లేనిది ఇంతగా భయపడుతున్నారు
అని అడిగాడు ఆ సీనియర్ ఉద్యోగి
ఏమి లేదయ్యా నీవు నిన్న సెలవు పెట్టిన రోజు
నా ఇజ్జత్ చూపిద్దాం అనుకుని... మేం ఇద్దరం కలిసి
నేను నా సహచర ఐదేళ్ల కాంట్రాక్టు ఉద్యోగితో పెద్దాయన సాక్షిగా పోట్లాడా... దాంతో పెద్దాయన మీ ఇద్దరినీ ఉద్యోగం లోనుంచి పీకేస్తా అన్నాడయ్యా.. అందుకే ఇలా భయపడి పోతున్నాం
ఊరుకోండి సార్..
మీ ఐదేళ్ళ ఉద్యోగానికి ఎటువంటి ఢోకా లేదు
నా ఎక్స్ పీరియన్స్ మీద చెబుతున్నా..
పెద్దాయన చెప్పినవి ఏమీ చెయ్యరు సార్
చేసేది ఎవరకీ చెప్పరు సార్..
మీకు తెలియదా ఏంటి సార్..
నా అనుభవంలో ఇవి సరికొత్త మచ్చుతునకలు
మీకు కూడా తెలుసు కదా.. చూడండి
రైతుల రుణమాఫీ చేస్తా..
ఇంటికో ఉద్యోగం ఇస్తా..
డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తా..
నిరుద్యోగులకు నెలకు భృతిగా రెండు వేల రూపాయలిస్తా..
ఇవన్నీ ఎవరన్న మాటలో గుర్తున్నాయా..!
వాటిలో ఏ ఒక్కటైనా అమలు చేశారా..
అవుతాయి అప్పుడే తొందరి పడితే ఎలా అంటారు వారి నేస్తాలు..
ఆంధ్రా రాజధాని నిర్మించే పనిలో భాగంగా..
వారానికి రెండురోజులు విజయవాడలో నిద్రిస్తా అన్నారు నిద్రిస్తున్నారా..!
చెప్పినవన్నీ చేస్తే ఆయన ప్రత్యేకత ఏముంటుంది సార్..!
కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదంటూ సీనియర్ ఉద్యోగి భరోసాతో హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు కానీ వారికి భయం.. భయంగానే ఉండటంతో..
ఆయన చెప్పిన పనులన్నీ చేసుకుని మీ పని చేసే సరికి మీ కిచ్చిన ఐదేళ్ల కాంట్రాక్ట్ పిరియడ్ ఐపోతుంది సార్ కాబట్టి మీరేమీ బెంగపడవద్దు సార్ బీ హాపీ సార్ అంటూ ఉచిత సలహా పడేశాడు సీనియర్... హ..హా...హా...!
                                                                                                                                           @ రాజేష్ @
చీ..చీ.. ఇదేనా.. నా జీవితం..
తలచుకుంటే నా బతుకుపై నాకే జాలేస్తుంది..
నా బతుకుపై నాకే అసహ్యం వేస్తుంది..
ఎందుకు ఈ బతుకు బతకాలి నేను...
ఎవరికోసం ఈ బతుకు బతకాలి నేను..
ఎవరిని ఉద్దరించేందుకు బతకాలి ఈ బతుకు నేను..
ఎవరినీ ఒప్పించలేని ఈ బతుకూ ఓ బతుకేనా..
ఎవరినీ మెప్పించలేని ఈ బతుకూ ఓ బతుకేనా..
హు..అసమర్ధుడినే...
నిజంగా నేను అసమర్ధుడినే..
నన్ను కన్న తల్లిదండ్రులకు
నా పేగుబంధం పంచుకున్న అన్నదమ్ములకు
నాతో జీవితాన్ని పంచుకున్న భార్యకు
మా పేగుబంధాన్ని గుర్తుచేసే బిడ్డలకు
నేనేమీ చేయలేని అసమర్ధుడనే నేను
నిజంగా అసమర్ధుడినే... నేను
ఫార్టీ ప్లస్ చివరి దశకి వచ్చేసినా
ఇంకా నాకంటూ ఓ జీవితాన్ని
ఏర్పాటుచేసుకోలేని నిస్సహాయకుడను నేను..
ఎవరినీ పోషించే సత్తాలేని వెధవని నేను
ఆకలేస్తున్నా పట్టెడన్నం పెట్టమని
గట్టిగా అడిగే ధమ్మూ, ధైర్యం లేని దద్దమ్మను నేను
కన్న కూతురుకి కూడా స్వతహాగా
చాక్లెట్ కొనిచ్చే సామర్ధ్యం లేని కసాయి తండ్రిని నేను
ఇంకా ఎంతకాలం ఇలా నన్ను..
నా అసమర్ధతను, నా చేతకాని తనాన్ని భరించాలి నా వాళ్ళు
ఈ అత్తెసర బతుకుతోనే ఇంకెంత కాలం
నా జీవితాన్ని వెళ్ళదీయాలి నేను
లేదా.. నా జీవితానికి ఇక మోక్షం...
రాదా నా జీవిత తలుపును తట్టే ఆ లక్ష్మీకటాక్షం..!
(ఎవరి మెప్పుకోసమో..నా తప్పును కప్పిపుచ్చుకునేందుకో రాయలేదు నేను.. ఎవరో నన్ను ఉద్దరిస్తారని ఇది రాయలేదు.. ఎందుకో నామనసుకి బాధకలిగి నన్ను నేను ఆవిష్కరించుకుంటే నాకు మిగిలిన ఆవేదన అలా పెల్లుబికింది నా అంతరంగం పలికించిన మాటలు అంతే.. ఎవరూ నన్ను మరోలా అనుకోవద్దని నా మనవి) 

                                                                                                                                    @ రాజేష్ @

9, ఏప్రిల్ 2015, గురువారం

నేను చెట్లు నరకడాన్ని సమర్ధించడం లేదు
వారు చేసిన పని మంచిదని అనడం లేదు
కాని వారికి వేసిన శిక్ష సరైంది కాదనేది
నా వాదన అసలు దోషులను వదిలేస్తూ
 కొసరు మనుషులను మట్టుపెట్టడం
 సరైనది కాదనేది నా వాదన అర్ధం చేసుకుంటే మంచిది...

ప్రాణాలు ఎవరివైనా ఒకటే.. జరిగిన తీరే బాగోలేదు..నేస్తమా..!

అధికారులైనా, అమాయకులైనా
ప్రాణాలు ఎవరివైనా ఒకటే
అధికారులు చనిపోతే
ఎక్స్ గ్రేషియా ఇస్తుంది ప్రభుత్వం
కూలీ చనిపోతే రోడ్డున పడుతుంది కుటుంబం
అలా అని నేను ఎవరినీ సమర్ధించలేదు మిత్రమా
అడివిలోకి అలా ఎగబడేందుకు అవకాశం ఇచ్చింది ఎవరు
కోట్లకు కోట్లు అటవీ సంపద తరలి పోవడానికి కారకులు ఎవరు
నెలకు వేలాది రూపాయల జీతమిస్తుంటే
అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులు
మొద్దునిద్రపోతూ స్మగ్లర్లతో చేతులు కలిపి
కోటానుకోట్లు వెనుకోసుకోవడాన్ని మీరు సమర్ధిస్తున్నారా నేస్తమా..!
నిజమైన స్మగ్లర్లను పట్టుకుని కాల్చమాన్నాను
కాని పూర్తిగా చదవరు ఏదీ మన మేధావులు
అర్ధాంతరంగా అందిన కాడికి పట్టుకుని విమర్శించేస్తుంటారు మన పెద్దలు
నేనేదో గొప్పవాడినని మీకెవరికీ చెప్పలేదు
వరంగల్ లో ముష్కరులను మట్టుపెట్టిన తీరు అభినందనీయమని శ్లాఘించిన సందర్భాలు మరిచిపోవద్దు నేస్తమా..!
ప్రాణాలు ఎవరివైనా ఒకటే..!
జరిగిన తీరే బాగోలేదనేది నా అభిప్రాయం నేస్తమా..!
నిజమైన ఎన్ కౌంటర్ కి ఫేక్ ఎన్ కౌంటర్ కి చాలా తేడా ఉంటుంది నేస్తమా..!

ఐస్ క్రీం తింటే కడుపు నిండదు ....

లంచం తీసుకోవడం తప్పు... అలాగే లంచం ఇవ్వడం కూడా అంతే తప్పు కాని ఈ విషయాన్ని ఎంతమంది ఒప్పుకుంటారు నేస్తమా..!
లంచం ఇవ్వడం తప్పు ఎందుకవుతుందని ఒకరు వాదిస్తే.. తీసుకుంటే తప్పేంటి వాళ్ళు ఇస్తున్నారు తీసుకుంటున్నామని సమర్ధించుకునే ప్రబుద్దులూ ఉన్నారు. మరి మీరేమంటారు నేస్తమా..! అసలు లంచం ఎందుకియ్యాలి పని చేస్తున్నందుకు ప్రభుత్వం జీతం ఇస్తుంది కదా అని అడిగే నాధుడు ఉన్నాడా..? ప్రభుత్వం ఇచ్చేజీతం సరిపోడం లేదంట అని మరొకరు సమర్ధిస్తారు.. అవునండీ పాపం ప్చ్..
అంటూ పెదవి విరుపులు వారి పనిచేసేంతవరకూ..
నా పని ముందు ఐ పోవాలి అందుకే లంచం ఇచ్చి చేయించుకుంటున్నా..
నీకు చేతనైతే చేయించుకో లేకపోతే అన్ని మూసుకుని వాళ్ళు చేసేదాకా ఉండమని ఉచిత సలహా ఇస్తుంటారు కొందరు బడాబాబులు.
నీ దగ్గర డబ్బులుంటే నీవు ఇచ్చుకో కాని అందరినీ నీ బాటలో నడవమనడం ఎంతవరకూ సబబు నేస్తమా..!
అసలు వాళ్ళకి ఉద్యోగం ఇచ్చింది ఆ పనులు చేయడానికే కదా..! మరెందుకు వారిని ప్రశ్నించరు నేస్తమా..!
దీనికి మీ సమాధానం ఏమిటి..?
లంచాలు తీసుకునేందుకే మీరు ఉద్యోగాలు పొందారా..
అది వారి జన్మహక్కా..! మీరు చెప్పండి... ఈ విధమైన వాదనలు చేయబట్టే ఇలా ఏడుస్తుంది మన దేశం...
తప్పుని తప్పుగా చెప్పేధైర్యం ఉండాలి నేస్తమా..!
ఆకలి వేస్తున్నప్పుడు చద్దన్నం తిన్నా కడుపు నిండుతుంది. అంతే కాని ఖరీదైన ఐస్ క్రీం తింటే కడుపు నిండదు పైగా జబ్బు చేస్తుంది నేస్తమా..!
అనగనగా.. ఓ అడవట
ఆ అడవిలో అన్నీ వింతలేనట
కూలీలేమో కులాసాగా
భవంతుల్లో కులుకుతున్నరట
స్మగ్లర్లేమో సొమ్ముచేసుకునేందుకు
అడవిలోకి వచ్చిండ్రట
అదేపనిగా ఆదరాబాదరాగా దొరలు
చేతికందిన తుపాకులతో పరిగెత్తిండ్రట
పరుగెత్తుతున్న దొరలకు
అడవి మృగాలు అగుపించాయట
అందునా అవి రాళ్ళతో
ఎదురు దాడికి దిగాయట
ఇంకేముంది దొరల
ప్రాణాలు పోతాయని కాల్చేశారట...!
ఎన్ కౌంటర్ చేసిన
ప్రతి దొరా చెప్పే మాటే ఇది
శరీరం కప్పుకునేందుకు
వంటిమీద సరైన వస్త్రమే లేదు
కానీ వీరేనంట అసలైన
ఎర్రచందనం స్మగ్లర్లు
కూలీలెవరో.. స్మగ్లర్లు ఎవరో
దొరలకు తెల్వదట
కొత్తగా పరిచయం చేస్తున్నట్టున్నారు
స్మగ్లర్లంటే ఇలానే ఉంటారని
నలుగురూ నవ్విపోతారని కూడా
ఆలోచించడం లేదు మన దొరబాసులు
ఇదే మనకు పట్టిన దౌర్భాగ్యం..
కోట్లకు పడగలెత్తిన "స్వాము"లేమో
చందనం స్మగ్లింగ్ చేస్తున్నా
నోరు మెదపని మనదొరలు
ఎర్ర తివాచి వేసి మరీ వారిని సత్కరిస్తారు
ఇదేమి చోధ్యమో... ఇదేమి భోజ్యమో...
పొట్టకూటి కోసం కూలికై అడవికెళ్ళిన వారినేమో
అడవి మృగాల పేరిట తూటాలతో వేటాడేస్తారు
దీనికి మళ్ళీ ఎన్ కౌంటర్ అని పేరు తగిలిస్తారు
దొరలు కాలుస్తుంటే కనీసం పక్కకైనా
పారిపోకుండా దుంగలను చేతుల్లోనే పెట్టుకుని ప్రాణాలను వదిలేస్తారు..?
శవం పక్కనే దుంగ.. దుంగ పక్కనే శవం
ఇదే దొరల మార్క్ ఎన్ కౌంటర్..!
ఇకనైనా ఫేక్ ఎన్ కౌంటర్లు మానండి
దొరలారా దొరతనంగా మంచి పేరు తెచ్చుకోండి..!
సత్తాఉంటే నిజమైన స్మగ్లర్లను పట్టుకోండి
ధైర్యముంటే వారిని ఎన్ కౌంటర్ చేయండి..!
సాదా సీదా మనుషులను పొట్టన పెట్టుకుని
మీరు ఆ ఉసురు పోసుకోకండి ప్లీజ్..!!! @ రాజేష్ @

చీ..చీ.. ఇదేనా.. నా జీవితం..
తలచుకుంటే నా బతుకుపై నాకే జాలేస్తుంది..
నా బతుకుపై నాకే అసహ్యం వేస్తుంది..
ఎందుకు ఈ బతుకు బతకాలి నేను...
ఎవరికోసం ఈ బతుకు బతకాలి నేను..
ఎవరిని ఉద్దరించేందుకు బతకాలి ఈ బతుకు నేను..
ఎవరినీ ఒప్పించలేని ఈ బతుకూ ఓ బతుకేనా..
ఎవరినీ మెప్పించలేని ఈ బతుకూ ఓ బతుకేనా..
హు..అసమర్ధుడినే...
నిజంగా నేను అసమర్ధుడినే..
నన్ను కన్న తల్లిదండ్రులకు
నా పేగుబంధం పంచుకున్న అన్నదమ్ములకు
నాతో జీవితాన్ని పంచుకున్న భార్యకు
మా పేగుబంధాన్ని గుర్తుచేసే బిడ్డలకు
నేనేమీ చేయలేని అసమర్ధుడనే నేను
నిజంగా అసమర్ధుడినే... నేను
ఫార్టీ ప్లస్ చివరి దశకి వచ్చేసినా
ఇంకా నాకంటూ ఓ జీవితాన్ని
ఏర్పాటుచేసుకోలేని నిస్సహాయకుడను నేను..
ఎవరినీ పోషించే సత్తాలేని వెధవని నేను
ఆకలేస్తున్నా పట్టెడన్నం పెట్టమని
గట్టిగా అడిగే ధమ్మూ, ధైర్యం లేని దద్దమ్మను నేను
కన్న కూతురుకి కూడా స్వతహాగా
చాక్లెట్ కొనిచ్చే సామర్ధ్యం లేని కసాయి తండ్రిని నేను
ఇంకా ఎంతకాలం ఇలా నన్ను..
నా అసమర్ధతను, నా చేతకాని తనాన్ని భరించాలి నా వాళ్ళు
ఈ అత్తెసర బతుకుతోనే ఇంకెంత కాలం
నా జీవితాన్ని వెళ్ళదీయాలి నేను
లేదా.. నా జీవితానికి ఇక మోక్షం...
రాదా నా జీవిత తలుపును తట్టే ఆ లక్ష్మీకటాక్షం..!
(ఎవరి మెప్పుకోసమో..నా తప్పును కప్పిపుచ్చుకునేందుకో రాయలేదు నేను.. ఎవరో నన్ను ఉద్దరిస్తారని ఇది రాయలేదు.. ఎందుకో నామనసుకి బాధకలిగి నన్ను నేను ఆవిష్కరించుకుంటే నాకు మిగిలిన ఆవేదన అలా పెల్లుబికింది నా అంతరంగం పలికించిన మాటలు అంతే.. ఎవరూ నన్ను మరోలా అనుకోవద్దని నా మనవి)

 @ రాజేష్ @

6, ఏప్రిల్ 2015, సోమవారం

వడివడిగా..శరవేగంతో
జరిగిన పనులను ప్రశ్నించారానాడు..
పది మందికీ పనికి వస్తుందన్న
పోలవరాన్ని ఇప్పుడు పక్కన పెట్టేశారు..
పనులు పూర్తయ్యేంతవరకూ
ప్రాజక్టువద్దే పడుకుంటాననే మీరు..
"పట్టిసీమ"తో బాగానే
పడుతున్నారు కుస్తీపట్లు ... ! @ రాజేష్@
ప్రజాప్రయోజనాలు కంటే
స్వప్రయోజనాలే వారికి ముఖ్యం..
పోలవరం పేరుతో ఢిల్లీ ఒకరు
రాజధాని పేరుతో సింగపూరు మరొకరు..
ఎవరి చక్కర్లు వారివే
ఎవరి వ్యాపకాలు వారివే నేస్తమా.. @ rajesh @
రోడ్డు ప్రమాదకేసుల్లో స్వల్పశిక్షలను విధించడం న్యాయాన్ని అవహేళన చేయడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే రోడ్డుప్రమాద కేసులంటే చాలామందికి భయం లేకుండా పోయింది. దాని వల్ల చాలా మందిలో నిర్లక్ష్యం పెరిగిపోయింది. అంతే కాకుండా ప్రమాదం మాటున హత్యలు చేసేందుకు సైతం వెనుకాడటం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రమాదానికి కారకుడైన వ్యక్తికి ప్రధానంగా పోలీసుస్టేషన్లోనే బెయిల్ ఇచ్చేస్తుండంటంతో ఇదేమీ పెద్దకేసు కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. పైగా ఈ కేసులో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని నేరాలకు పాల్పడుతున్న వారూ లేకపోలేదు. ఇంకొంచం ముందుకు వెళితే బడా బాబులు చేసే నేరాన్ని తనపై మోపుకుని ఆ శిక్షను సైతం అనుభవించేందుకు సైతం వెనుకాడడం లేదంటే ఆ కేసుపట్ల వారికున్న అవగాహనను అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇప్పుడు కొత్తగా చాలా కేసుల్లో పోలీసులకే బెయిల్ ఇచ్చే అధికారం కట్టబెట్టేయడంతో పోలీసులు తమ ఇస్టానుసారం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనా కోర్టుద్వారానే చేస్తేనే కొంతమేర అందరికీ న్యాయం జరుగుతుందనేది అక్షర సత్యం.
సింగపూర్ నుంచే ఆంధ్రాకు
రాజధాని మాస్టర్ ప్లాన్..
సింగపూర్ నుంచే ఆంధ్రాకు
పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం..
సింగపూర్ నుంచే ఆంధ్రాకు
వ్యవసాయ క్షేత్రాలు..
సింగపూర్ నుంచే
ఇక అన్నీ దిగుమతి ...
అదే సార్ ప్రజలు కూడా
అనుకుంటున్నారు
సింగపూరులో మాటలు కంటే
చేతలు చేసే సీఎంలే ఎక్కువటగా
ప్రతిదానికి మీరు సింగపూర్ వెళ్ళేకంటే
సింగపూర్ నుంచే ఓ సీఎం ను ఆంధ్రాకు
దిగుమతి చేసుకుంటే పోలా అంటున్నారు జనం...
@ రాజేష్ @

గతంలో అన్నారు విజన్"2020"
పేదలకు మాత్రం చూపించారు"420"
రాజధానికి హైటెక్తో "హంగులు"
నేస్తాలకు మాత్రమే ఇప్పించారు "టింగుటింగులు"
అభివృద్ధి పేరుతో మరో నారామంత్రం
ఇప్పుడు చేస్తున్నారు "2050" జపం
సింగపూరే అంటున్నారు నాకు ఆదర్శం
అమరావతే ఎంపికే అందుకు నిదర్శనం.. @ రాజేష్
బాధితులకు సేవచేసేందుకు
చేతులు రావు సరే బాబుకు
తన కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు
పబ్లిసిటీతో ప్రజలను ముంచేస్తారు
పరామర్శల పేరుతో చేస్తారు మీరు పబ్లిసిటీ స్టంట్
ప్రతిపక్షానికి లేదుగా ఇంతకన్నా ఇన్ స్టెంట్
ఏమయ్యింది జగన్ బాబూ నీ ఓదార్పు యాత్ర
మళ్ళీ ఎప్పుడు మొదలెడతారు ఆ జాతర..@ రాజేష్
మా సాక్షి సబ్ ఎడిటర్ బండారు సురేష్ (బసు) జర్నలిస్టుగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా మంగళగిరి ఆఫీసులో ఆయనకు జరిగిన సన్మాన ఏర్పాటు కార్యక్రమంలో నేనూ ఓ కవితను రాసి చదివే అదృష్టం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
వందనాలు.. అభివందనాలు...
======================
సమాజంలో రుగ్మతలను ఎత్తిచూపేందుకు
విలేకరిగా అవతారమెత్తిన నీవు
తండ్రి చాటుబిడ్డగా నీ సహకారాన్ని అందిస్తూ
జర్నలిస్టుగా జీవితానికి స్వాగతం పలికిన క్షణాలు అవి..
నీచేత అక్షరాలు రాయించిన "ఉదయం"తో నీవు మొదలై
వాస్తవాలను వార్తలుగా "వార్త"లో మలిచేందుకు
నీవు చేసిన ప్రయత్నాలు అన్నీ సఫలమై
జర్నలిస్టుగా నీకు గుర్తింపు నిచ్చిన క్షణాలు అవి..
హృదయాలను కదిలించే శీర్షికలతో
"జ్యోతి"లో ఓ వెలుగు వెలిగి
అందరి మన్ననలు అందుకుంటూ ఓ పైమెట్టుకోసం
"సూర్య"ప్రతాపం చూపించిన క్షణాలు అవి..
మనసున్న మనిషిగా మదిలో మెదిలో అక్షరాలను
నీదైన శైలిలో ఓ నిఘంటువును నిర్మించుకున్నావు
అక్షర సేధ్యంలో సువర్ణాక్షరాలను సాగుచేసేందుకు
మన:"సాక్షి"ని నమ్ముకుని ఆత్మవిశ్వాసాన్ని
నింపుకున్న క్షణాలను ఎలా మర్చిపోగలము ఓ (బసు)బాసూ..!
మన్మధనామ సంవత్సరానికి మూడు వసంతాలు
పూర్తి చేసుకున్న నీవు నవమిరోజే
మాకు పసందైన విందు ఏర్పాటు చేసిన నీ సత్ సంకల్పానికి
నీకివే మా వందనాలు.. అభివందన తోరణాలు తెలియజేస్తూ..
మరో ముప్పై వసంతాలు ఇలాగే
నిర్విఘ్నంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా నేస్తమా...!
@ రాజేశ్వరరావు కొండా @
ఏడాదికెన్నాళ్లు వెళతావు
"సింగపూరు" బాబూ...
ఎవరినీ చేయెద్దొంటావు
దుబారా నీవు...
పేదల సంక్షేమానికేమో
రాష్ట్రంలో డబ్బేలేదంటావు...
సింగపూరుకు వెళ్ళేందుకు అన్నిసార్లు
ఏఖజానాలో తీస్తున్నావు ఆడబ్బు నీవు... ! @ రాజేష్@
బోసినవ్వుల బాబు_భలేబాగుంది నీనవ్వు..!@రాజేష్
అద్వాని అలిగారట
కాదు కాదు అలగలేదట
మౌనవృతం పాటిస్తున్నారట
లేదు లేదు మాట్లాడితే ముప్పెనేనట
అందుకే ఆయన అలా ఉన్నారట
అదేమీ లేదు అంతా ఉత్తదేనట
పెద్దాయన నోరువిప్పితే అంతటా బాంబులేనట
అదంతా మీడియా సృష్టేనట
ఏదేమైనా పార్టీవ్యవస్థాపకుడికి ఇది అవమానమేనట..! @ రాజేష్

27, మార్చి 2015, శుక్రవారం

మనిషిని మనిషిగానే చూడు
మృగంలా చూడకు ఏనాడూ..!
అహంకారంతో తూలనాడకు
అధికారంతో అణిచివేసేందుకు..!
మనసు గాయపడుతుందిని తెలుసుకో
మానవత్వాన్ని పెంచుకో..!
నీవు ఎదిగిన ప్రతి మెట్టూ
కాకూడదు నీఅహంకారినికి తొలిమెట్టు..!
ఎదిగి ఒదిగితేనే నిలబడుతుంది అధికారం
లేదంటే ఉండదు దానికి నీపై మమకారం..!
అధికారంతో అహం పెంచుకోవద్దు
ఆత్మీయులకు దూరం కావొద్దు..!
మీరేమంటారు నేస్తమా @ రాజేష్ /27-03-15/
మీకు మీ కుటుంబ సబ్యులకు..
మన్మధనామ సంవత్సరం...
వసంతఋతువు..చైత్రమాసం..
.శ్రీరాముడు జన్మించిన పుణ్యధినం...
శుభ శనివారం.........
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. ..
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ @ రాజేష్//

23, మార్చి 2015, సోమవారం

అందాన్ని చూసి ఆనందిస్తాం
ఆనందాన్ని స్వాగతిస్తాం..!
సమస్యను శాసిస్తాం
శాసనాన్ని అనుసరిస్తాం..!
జీవితాన్ని ప్రేమిస్తాం
ప్రేమసాధనకు మరణిస్తారెందుకో నేస్తమా..? @ రాజేష్ /24.03.15/
నేతలు ఓటుకు నోటిచ్చారు
విద్యావంతులను మరోసారి ఎగతాళి చేశారు
ప్రలోభాలు మాకు కొత్తకావన్నారు
అధికారమే మాకు పరమావధని నిరూపించుకున్నారు..! @ రాజేష్ /24.03.15/
అడుగులు తడబడుతున్నాయ్_గమ్యం అగమ్యగోచరమైందని..! @ రాజేష్ /24.03.15/
పదవుల పంపకంలో బెడిసికొట్టింది భేటీ
అందుకే తప్పలేదు "మా"లో పోటీ..!..! @ రాజేష్ /24.03.15/

22, మార్చి 2015, ఆదివారం

ఎవరినైనా హర్ట్ చేయడం ఈజీనే_హార్ట్ ని టచ్ చేయడమే కష్టం..!

20, మార్చి 2015, శుక్రవారం

aadhar... aadhar..aadhar
ధూమ,మద్య పానాలు
ఆరోగ్యానికి హానికరం..!
అంటూ హెచ్చరికలు
జారీ చేస్తుంటాయి ప్రభుత్వాలు..!
టార్గెట్లు పెట్టి మరీ
విక్రయాలు కొనసాగిస్తుంటారు..!
అందుకు అడ్డదారిన
వచ్చిన వారికే అనుమతులిచ్చేస్తుంటారు..!
కోట్లరూపాయలు కుమ్మరించిన
వారికే పెద్దపీట వేసేస్తుంటారు..!
గుట్కాలు, పాన్ పరాగ్ లు
నమలడం నిషిద్ధమంటారు..!
అవి తయారు చేసేందుకు
మాత్రం అనుమతులిచ్చేస్తుంటారు..!
అనుమతులివ్వక పోయినా
అక్రమంగా తరలిచ్చేస్తుంటారు..!
అయినా వారిపై తీసుకోరు
ఏ ఒక్కరూ చర్యలు..!
అమ్మే వాడిని, కొనే వాడినే
దోషులుగా చిత్రీకరించేస్తుంటారు..!
చట్టబద్దత లేని వాటిని
వినియోగించడం నేరమైనప్పుడు..!
వాటిని తయారు చేయడం
కూడా నేరంగా ఎందుకు పరిగణించరు..!
ప్లాస్టిక్ కవర్ల వినియోగం
విక్రయాలు నిషేధితమంటారు..!
నిషేధిత తయారీ ఫ్యాక్టరీలపై మాత్రం
ఎందుకు దాడులు చేసి సీజ్ చేయరు..!
ఏదేమైనా చట్టబద్దతలేని వాటిని తయారుచేసి
చట్టాన్నే చుట్టంగా చూసుకునే దళారులదే రాజ్యం..!
అన్ని అనుమతులున్నా ఆరుగాలం
కష్టించిన రైతుకు మాత్రం గిట్టదు గిట్టుబాటు భోజ్యం..!
ఎందుకిలా జరుగుతోంది నేస్తమా..!
ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుంది నేస్తమా..!
@ రాజేష్ /20-03.15//

ప్రతి సుమం సుగంధభరితం
ప్రతి క్షణం ఆనందభరితం
ప్రతిఒక్కరిలో నిలవాలి జీవితాంతం
శ్రీ మన్మధనామ వత్సరం...! @ రాజేష్/21.03.15/

18, మార్చి 2015, బుధవారం

భేషజాలతో ఎందుకు
అసెంబ్లీ ముందుకు..!
ఒకరిపై మరొకరు ఆరోపణలు
లేదంటే చేసుకుంటున్నారు ధూషణలు..!
తిట్లపురాణానికిదేనా వేదిక
ప్రజలకు లేదా విముక్తి ఇక..!
ఎవరెందుకు తిడుతున్నారో తెలియక
ప్రజలు పడుతున్నారు తికమక..!
చర్చించేందుకు లేవా ఇక ఏ సమస్యలు
సభలో అవసరమా వ్యక్తిగత ధూషణలు..!
ఇందుకేనా మిమ్మల్ని ఎన్నుకున్నారు
సభామర్యాదలు అందరూ వదిలేస్తున్నారు..!
దీనిలో ఏ ఒక్కరికీ లేదు మినహాయింపు
ఎందుకుమళ్ళీ మీడియా సాక్షిగా క్షమాపణల ముక్తాయింపు..! @ రాజేష్ /18-03-15/

16, మార్చి 2015, సోమవారం

చెట్టు కొమ్మకు చెదపడితే
చెట్టుకు వచ్చే నష్టం ఉండదు
చెట్టు వేరుకే ఆ చెద పడితే
చెట్టు మొత్తం కుళ్లిపోతుంది కదా నేస్తమా..! @ రాజేష్
సామాన్యుడికి తప్పని ప్రయాణం
నిత్యం నెత్తిన పెట్రో భారం
కార్పొరేట్ రంగానికే ఇస్తారు అవకాశం
ఎవరొచ్చినా ఆపరు ఈ ఘోరం..! @ రాజేష్/
తుళ్ళిపడుతోంది తుళ్ళూరు ప్రజానీకం
=======================
ప్రజలెన్నుకున్న వారేమో
పక్కాగా ఏసీల్లో నిద్రోతున్నరు
ప్రజలకోసం పాడుబడాల్సిన
ప్రజాప్రతినిధులు రాజకీయం చేస్తున్నరు
రైతులు రోధిస్తున్నా భూసేకరణ పేరుతో
భూములు లాగేసుకుంటున్నరు
అధికార ప్రతినిధులది ఓ మాట
ప్రతిపక్షాలది మరోబాట
ఎందుకిలా జరుగుతోంది
ఎవరికోసం జరుగుతోంది
ఇది న్యాయమో.. అన్యాయమో
తెలియకున్నది ఆంధ్ర "సింగపూరు"లో
ఎవరి మాట వినాలన్నా అంతా గందరగోళం
తుళ్ళిపడుతోంది తుళ్ళూరు ప్రజానీకం
రాయబారం చేస్తున్నరా ..?
రాయ"భేరం" చేస్తున్నరా ..!
ముందు మీరో నిర్ణయానికి
రండి ఓ నేతలారా...! @ రాజేష్
స్వప్రయోజనముంటేనే
ఎవరినైనా పొగుడ్తుంటరు..
నిష్ర్పయోజమని తెలిస్తే
ఆ నోటితోనే తెగుడ్తుంటరు..
ఎందుకిలా నేస్తమా..! @ రాజేష్
మహిళా దినోత్సవం సందర్బంగా
మహిళలపై జరుగుతున్న అరాచకాలను నిరసిస్తూ...
ఓ యువతి పడే ఆవేదన
======================================
అమ్మా... ఓ అమ్మా...
ఏడనున్నవే అమ్మా
అమ్మా... ఓ అమ్మా...
ఏడనున్నవే అమ్మా
ఆడపిల్లనైన నన్ను
ఏల విడిచిపోయావమ్మా...
అందానికే అందమైన
రూపాన్నిచ్చిన ఓ అమ్మా..
ఎందుకిచ్చావు నాకు
ఈ పాడు జన్మ..
ఏడకెళ్ళినా తప్పడం లేదే
నాకు ఈసడింపులు..
ఎవరినడిగినా నాకు
అగుపించడంలేదే ఆదరణ అమ్మా..
చేయని తప్పులకు లోకులు
లోకులు కాకులై పొడుస్తుంటే...
నేనేమీ చేయలేని
నిస్సహాయ స్థితిలో అమ్మా..
న్యాయం కోసమని
పోలీసోళ్లని ఆశ్రయిస్తే
నన్నే అవహేళన చేసినారే అమ్మా..
ఆఘోరాన్ని ఎవరికీ చెప్పుకోలేక
కాసింత నీడ కరువైన నేను
బోరుబోరున ఏడుస్తుంటే అమ్మా..
ఓ రోజున కాసింత
నీడనిస్తనని నమ్మించి
నన్ను అంగట్లో
అమ్మేసినాడే అమ్మా.. ఓ అమ్మా...
ఏడనున్నవే అమ్మా...! @ రాజేష్ /8-3-15/
నిద్రలేచినప్పుడల్లా
పవన్ లో ఉన్న "బాబు"
జూలు విధిలిస్తుంటరు...
దాన్ని చూసి ఆహా...ఓహో
అనే అభిమానులే
తుళ్ళూరు సంఘటనతో
తలపట్టుకుని కూర్చున్నరు...
ఎప్పుడు ఏది
మాట్లాడతారో తెలియదు
ఆ తర్వాత ఏమౌతదోగాని
తూచ్ తూచ్ అంటరు...
బయటకొచ్చినప్పుడల్లా
పేద ప్రజలే నాప్రాణం అంటరు
ఆ "గుట్టు" ఏమోగాని
ఆవలికెళ్ళిన తర్వాత వారెవరంటరు...
ఇదేమి చోధ్యమో జననేతకు
ప్రజలెన్నుకున్న అన్నేమో అలా మారిపోయారు
జననేతగా వచ్చీరాగానే
పిట్టలదొరలా మిగిలిపోతున్నరు...
ఏదేదో సాధిస్తానంటరు
సాధన లేకుండానే సతికిలపడతరు
మిమ్మల్ని "ఆ రకంగా"
ఎవరైనా బెదిరిస్తున్నరా నేస్తమా..! @ రాజేష్/08-03-15/

అబద్దాన్ని నిజం చేయగలమేమో గాని_నిజాన్ని అబద్దంగా మార్చలేము కదా నేస్తమా..! @ రాజేష్
గురివిందగింజ తన నలుపెరగదన్నట్లుగా...
ఉంటుంది కొందరి వ్యవహారతీరు
స్వీయ తప్పిదాలను సమర్ధించుకుంటూ
ఎదుటి వారు ఘోరమైన తప్పిదాలు
చేసేస్తున్నారంటూ తెగ బాధపడుతూ
వాళ్లని హెచ్చరించే ప్రయత్నం
చేసేస్తుంటారు ఎందుకలా నేస్తమా..? @ రాజేష్

భయపడుతూ రాత్రిపూట
తప్పు చేసేవాడ్ని దొంగ
అని ముద్రవేస్తున్నాం...!
పక్కాప్రణాళిక ప్రకారం
పట్టపగలే అందరికీ తెలిసేలా
తప్పు చేసేవాడ్ని మాత్రం నాయకుడని
అందరూ అంటున్నారెందుకు నేస్తమా..! @ రాజేష్ /17.03.15/
మల్లెపూవుకెపుడూ
సువాసనతో కూడిన
సుగంధాలు వెదజల్లడమే తెలుసు..!
నాగుపాముకెపుడూ
నరునిపై ప్రమాదకరమైన
విషాన్ని కక్కడమే తెలుసు కదా నేస్తమా..!  @ రాజేష్ /17.03.15/

2, మార్చి 2015, సోమవారం

ఆనందం కోసం
అనుబంధాలను పెంచుకుంటారు..
పోరాటం కోసం
ఉన్న బంధాలనే తెంచుకుంటారు
ఇదేమి విచిత్రమో కదా నేస్తమా..! @ రాజేష్ /

1, మార్చి 2015, ఆదివారం

బ్యాంకు బుక్ కాదిది
డబ్బులు దాచుకోడానికి
లుక్ లో టేస్టుండే "ఫేస్ బుక్కిది"
అందుకే పెట్టారు పేరు దీనికది
వరద కాని మాటలవరదలు దొర్లుతాయి
సరదాలకు భలేసరదాలు పండుతాయి
మంచి మసాల బొమ్మల కొలువు
వళ్లు దగ్గర పెట్టుకోపోతే పోతుంది పరువు
అక్షర మాలలకు తక్షణమే లైకులు
లేదంటే మంటల్లేని కామెంట్లు
ఇష్టమైన వారిని ఇష్టపడొచ్చు కష్టమనుకుంటే కట్ చేయొచ్చు
కాని అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవుతుంది "ఫేస్" బుక్
   ----- @ రాజేష్ //
పుట్టిన ప్రతివాడు ఏదోఒకరోజు గిట్టక తప్పదు
అలా అని ప్రతిరోజూ చనిపోయేందుకు యత్నించకూడదు కదా..!
మృత్యుఫు ఎవరిని ఏ రూపంలో ఎప్పుడు ఆవహిస్తుందో ఎవరికీ తెలియదు
కొందరు కావాలని చాఫుని వెతుక్కుని వెళ్ళినా చివరిటంచుల వరకూ వెళ్ళినా ఏదో ఒక చిత్ర విచిత్ర సంఘటనతో బతికి బట్టకట్టేస్తారు
కొందరు అమ్మో చావంటే నాకు భయం ప్రతి సంఘటన పై స్పందిస్తూ చిన్ని ప్రమాదసంఘటనలోనే మృత్యు కౌగిట్లో వదిగిపోతారు
విధి ఎంత బలీయమైనదో కదా నేస్తమా..!
పుట్టి ఏం సాధించామని కొందరు
ఎందుకు పుట్టాకో తెలియడం లేదని మరికొందరు
బతికేమి సాధించాలని ఇంకొందరు వాదులాడతారు
జీవితంలో ఎదురయ్యే ప్రతి ఘటనా ఓ అనుభవమే
ఆ అనుభవాన్ని గుణపాటంగా తీసుకుని స్థితి గతులను మార్చుకోవాలని ఏ ఒక్కరూ ఆలోచించరెందుకని..?
పుట్టిన ప్రతివారూ అందగా ఉండరు
అలాగని అందరూ అందవిహీంగానూ ఉండరు
ఎవరి అందం వారిదే ఒకరి అందం మరొకరికి రాదు
అలానే ఒకరి జీవితం మరొకరికి రాదు
అందరూ ధనవంతులే ఉండరుగా..
పేద మధ్యతరగతి వారూ ఉంటారు
ఎవరి కష్టాలు వారివే
ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకుంటారేమోగాని
కష్టాలను మాత్రం ఎవరూ పంచుకోలేరు
అందుకే ఎవరి పరిధిలో వారు సుఖంగా జీవించడం మేలు కదా నేస్తమా..! @ రాజేష్ //

ఇక రాజధాని పరిసరాల్లో కనుమరుగయ్యే
కమనీయదృశ్యలు ఇలాంటివెన్నెన్నో...  
@ రాజేష్
ఆంధ్రా సింగపూర్ కి
(తుళ్ళూరు)త్వరలో వస్తుందట
హైటెక్కులతో ఫైవ్ డక్కర్ బస్సు
రోడ్లు ఎలా ఉన్న పరవాలేదంట
రయ్ రయ్ మంటూ అలా ముందుకెళ్ళిపోతుందట నేస్తమా ...!
@ రాజేష్

ఎప్పుడూ నీలో తప్పులు వెతికే
యజమానికి నిత్యం సేవచేయలేమట
పాము పడగనీడలో కప్ప ఉండినట్లే
అది క్షణక్షణమూ ప్రాణాపాయమే కదా నేస్తమా..! @ రాజేష్ @
గాలిలో నీవు పంపిన సందేశమేమిటి...?
పూలతో నువ్వు నింపుతున్న తీపి తలపేమిటి నేస్తమా..!
@ రాజేష్
ఎంత కమ్మగా ఆస్వాదిస్తాయో... నీకురులు_ ఆ మల్లెల సుగంధ పరిమళాల్ని..
.@ రాజేష్
భలే బాగుంది ఆ నవ్వు_పులకరింతకు గురిచేస్తుంది నీ కవ్వింపు..!
@ రాజేష్ /
నేను తప్ప మరొకడెవరూ
ఎదగకూడదనుకునే స్వభావం
నీలో ఉంటే వెంటనే తొలగించుకో
లేకపోతే నీవు తాత్కాలికంగా
ఎదుగుతావేమోగాని భవిష్యత్ లో
నీకంటూ ఆ...నలుగురు మిత్రులు
కూడా కరువవుతారు నేస్తమా..!
నలుగురు పనివాళ్లను నాలుగు
కాసులిచ్చి కొనుక్కోవచ్చునేమో గాని
ఆ నలుగురు మిత్రులను
పైసలిచ్చి సంపాదించడం
చాలా దుర్లభమే కదా నేస్తమా..!
నీ కంటూ ఉన్న
ఆ నలుగురినీ నమ్ము కాని..
నమ్ముతూ అనుమానించకు
చివరికి నీ అనుమానమే
పెనుభూతం అవుతుంది జాగ్రత్త నేస్తమా..! @ రాజేష్ @
మోసపూరిత మాటలను మట్టుపెట్టాలనుకున్నారు
పవర్ పాలిట్రిక్స్ ను పాలదోలానుకున్నారు
సామాన్యుడిని అసమాన్యుడుగా మార్చేశారు
సామాన్యుల సత్తా ఏంటో ఢిల్లీ నేతలకు చూపించేశారు
జనరంజక పాలనకే పట్టం కట్టేశారు
దేశంలో మాకు తిరుగులేదని ఢిల్లీ గల్లీలో
తిరిగే అమిత్.. "షాకు" కొట్టించారు
ఆమ్ ఆద్మి పార్టీకి ఆధ్బుతమైన విజయం సాధించిపెట్టారు
ప్రపంచంలోని దేశాధినేతలను సైతం ఆకట్టుకున్నమోది
దేశరాజధాని లోని సామాన్యులనే ఆకట్టుకోలేక పోయారు
ఓటమిపాలైన పార్టీలు తప్పును ఒప్పుకోపోయినా
సామాన్యులను పక్కన పెడుతున్నారనేది వాస్తవం
మద్యం,డబ్బుకి బానిసలం కాదని చాటి చెప్పిన
సామాన్యుడి విజయం ఇది కాదంటారా నేస్తమా..!                            @ రాజేశ్వరరావు కొండా
హాట్ హాట్ సీట్ ని
క్రేజ్ క్రేజీ గా
కేజ్రీవాల్ కొట్టేశారు
సామాన్యులనే
నమ్ముకున్నారు
అసమాన్యుడిగా
మారిపోయారు
బీజేపీ పాలనకిది
చెంపపెట్టు అని చెప్పొచ్చు
విజయం అంటే రోజుకు మూడు
డ్రస్సులు మార్చడం
క్రేజ్ అనుకున్నారేమో మోదీ
స్వచ్చభారత్ తో కూడా
సాధించలేకపోయారేంది
ఇప్పటికైనా తెలుసుకోలేకపోతే
ఎవరికైనా ఇదేగతి
సామాన్యుడిని పట్టించుకోపోతే
చెబుతారు ఇలానే బుద్ది                                                  - రాజేశ్వరరావు కొండా
ఏది సాధించాలన్నా
వయస్సున్నప్పుడే
శోధించి సాధించాలి
వయస్సు మళ్ళిన
తర్వాత అది అసాధ్యమే..!
అవకాశాలు
అన్నివేళలా రావు
అవి వచ్చినప్పుడు
అందిపుచ్చుకున్న వాడే
అసలైన తెలివిగలవాడు..!
అతి తెలివికి పోయి
ఇంకేదో సాధించాలని
ఉన్న అవకాశాన్ని
వదిలేసి రానిదాని కోసం
ఆశగా ఎదురు చూస్తూ
కాలాన్ని వృధా చేసేవాడు
తెలివితక్కువ వాడికిందేలెక్క
మీరేమంటారు నేస్తమా..! @ రాజేష్ @
అధికారం ఎప్పుడూ ఏ ఒక్కరి సొత్తుకాదు కదా నేస్తమా..!
@ రాజేష్ @

గన్నవరం నుండి విజయవాడ వరకూ
చేస్తారట హైవేకి నిండుగా పచ్చదనం
అలా చేయకపోతే ఎలా వస్తుంది
విమానాల్లో ఎగిరి వచ్చే పెద్దలకు ఆహ్లాదం..!

రాజధాని పేరుతో హైటెక్కు హంగులు
ఖర్చు పెట్టేందుకు లేవంటారు ఖజానాలో టింగుటింగులు
అయినా ఆపేది లేదంటారు బస్తీలో సేవలు
బడా బాబులకు ఎంతైనా ఖర్చు పెట్టేస్తుంటారు..!

మురికివాడలో జనం
మురుగుతో మునిగిపోతే మనకేం
వారి ఆకలి కేకలు మనకెందుకు
మనవాళ్ళు అనేది మునిగి పోకూడదంతే
ఎవరెంత మొత్తుకున్నా
నాకేమీ తెలియదనట్టు పట్టించుకోరన్నా
ఓటేసిన పాపానికి అనుభవించాలిగా ఐదేళ్ళు
కాదంటే లోపలికి వెళ్ళవుగా నాలుగేళ్లు కదా నేస్తమా...!
@ రాజేష్ /
బెజవాడ పోలీసులు
ఎప్పుడూ బిజీబిజీ
రాజధాని తాకిడితో
వీరికి మరింత పెరిగింది గజిబిజి
నేతలొచ్చినా-మాతలొచ్చినా
తారలొచ్చినా-ధృవతారలొచ్చినా
బాంబులొచ్చినా-డాంబులొచ్చినా
ఎక్కడేమైనా-వీరిదే హడావుడి

ట్రాఫిక్ - కంట్రోల్ చేయడం
ఫైన్లు రాయడం- కేసులు కట్టడం
దొంగల్ని పట్టడం- అరెస్ట్ లు చేయడం
ఇలా..ఇలా..చెప్పుకుంటూ పోతే చాంతాండంత
అయినా తప్పడం లేదు నగరానికి చింత
అందుకే బాసూ మీరు జర ఆలోచించాలి ఒకింత
రోజురోజుకీ అవుతున్నాయి
సమస్యలు జఠిలం
పోలీసులు పాటించలేక
పోతున్నారు కఠినం
ఎందుకోసమో ఈ ఉదారం
బతికేందుకు కావాలిగా వారికీ ఈ ఉద్యోగం నేస్తమా.  ! @ రాజేష్ /
బాసూ జర చూడరాదే..!
=================
నిత్యం ట్రాఫిక్ తో సతమతం
కంట్రోల్ రూం దగ్గరే ఈ బాగోతం
ఐనా పట్టదు ఎవరికీ ఈ తతంగం
ఎన్నాళ్ళు చేస్తారు ఈ ట్రాఫిక్ జపం
నేస్తమా..!
తెలుగు వారిని తెలుగులోనే పలకరిద్దాం
మన తెలుగును మనమే గౌరవిద్దాం
మీరేమంటారు నేస్తమా..! @ రాజేష్
చెట్టు కొమ్మకు చెదపడితే
చెట్టుకు వచ్చే నష్టం ఉండదు
చెట్టు వేరుకే ఆ చెద పడితే
చెట్టు మొత్తం కుళ్లిపోతుంది కదా నేస్తమా..! @ రాజేష్
సామాన్యుడికి తప్పని ప్రయాణం
నిత్యం నెత్తిన పెట్రో భారం
కార్పొరేట్ రంగానికే ఇస్తారు అవకాశం
ఎవరొచ్చినా ఆపరు ఈ ఘోరం..! @ రాజేష్/

6, జనవరి 2015, మంగళవారం

మన ఆంధ్ర రాష్టృంలో
ఎవరు ఏది చేసినా నేరమే..?
కానీ కొందరికే మినహాయింపులుంటాయి
అందులో మీరున్నారో లేదో
ముందుగా మీరు తెలుసుకోండి నేస్తమా..!
కమ్మనైన (ఇష్టులు) వారు
ఏమి చేసినా తప్పుండదు
వారికి వారే సాటి
ఎందుకంటే పోలీసులకు
కూడా వారు ఇష్టులే కనుక
వారిని ఇష్టులుగా చేసుకోపోతే
కమ్మనైన పోస్టింగే పోతుంది కదా నేస్తమా..!
రియల్(దందా)వ్యాపారమైనా
చెప్పుల(తోళ్ల)వ్యాపారమైనా
హోటల్(లాడ్జింగ్)వ్యాపారమైనా
చిట్స్ (మనీసర్క్య్లలేష్ న్)వ్యాపారమైనా
పేపరు (పత్రికలు) వ్యాపారమైనా
ఇలా ఏ వ్యాపారమైనా
వారే చేయాలి తప్ప వేరెవరు
వ్యాపారం చేసినా వారిపై
బనాయించేస్తారు కేసులు నేస్తమా..!
వారి సానుభూతి పరులతో
సమర్ధవంతంగా సమస్యచుట్టూ అల్లుకుపోతారు
వీలయినంత వరకు బ్లాక్ మెయిల్ చేసేస్తారు
లొంగని పక్షంలో బలవంతంగా నైనా కేసులు పెట్టేస్తారు
కాని పక్షంలో మీడియాను వాడేసుకుంటారు
అవసరమైతే పోలీసు బాసులను అడ్డం పెట్టేసి లాగేసుకుంటారు
ఇదేనండి ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న పాలన
సింగ్ పూర్ గల్లీగల్లీలో జరిగే అభివృద్ధిని
భూతద్దంలో చూసే మన నేతకు
రాష్ట్రంలో జరిగే అధికారిక అవినీతి పనులు
కనిపించవా.. వినిపించవా నేస్తమా..! @ రాజేష్

4, జనవరి 2015, ఆదివారం


ఆంధ్రా సింగపూర్ కి
(తుళ్ళూరు)త్వరలో వస్తుందట
హైటెక్కులతో ఫైవ్ డక్కర్ బస్సు
రోడ్లు ఎలా ఉన్న పరవాలేదంట
రయ్ రయ్ మంటూ అలా ముందుకెళ్ళిపోతుందట....
@ రాజేష్ /03-01-15/

పుట్టిన ప్రతివాడు ఏదోఒకరోజు గిట్టక తప్పదు
అలా అని ప్రతిరోజూ చనిపోయేందుకు యత్నించకూడదు కదా..!
మృత్యుఫు ఎవరిని ఏ రూపంలో ఎప్పుడు ఆవహిస్తుందో ఎవరికీ తెలియదు
కొందరు కావాలని చాఫుని వెతుక్కుని వెళ్ళినా చివరిటంచుల వరకూ వెళ్ళినా ఏదో ఒక చిత్ర విచిత్ర సంఘటనతో బతికి బట్టకట్టేస్తారు
కొందరు అమ్మో చావంటే నాకు భయం ప్రతి సంఘటన పై స్పందిస్తూ చిన్ని ప్రమాదసంఘటనలోనే మృత్యు కౌగిట్లో వదిగిపోతారు
విధి ఎంత బలీయమైనదో కదా నేస్తమా..!
పుట్టి ఏం సాధించామని కొందరు
ఎందుకు పుట్టామో తెలియడం లేదని మరికొందరు
బతికేమి సాధించాలని ఇంకొందరు వాదులాడతారు
జీవితంలో ఎదురయ్యే ప్రతి ఘటనా ఓ అనుభవమే
ఆ అనుభవాన్ని గుణపాటంగా తీసుకుని స్థితి గతులను మార్చుకోవాలని ఏ ఒక్కరూ ఆలోచించరెందుకని..?
పుట్టిన ప్రతివారూ అందగా ఉండరు
అలాగని అందరూ అందవిహీంగానూ ఉండరు
ఎవరి అందం వారిదే ఒకరి అందం మరొకరికి రాదు
అలానే ఒకరి జీవితం మరొకరికి రాదు
అందరూ ధనవంతులే ఉండరుగా..
పేద మధ్యతరగతి వారూ ఉంటారు
ఎవరి కష్టాలు వారివే
ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకుంటారేమోగాని
కష్టాలను మాత్రం ఎవరూ పంచుకోలేరు
అందుకే ఎవరి పరిధిలో వారు సుఖంగా జీవించడం మేలు కదా నేస్తమా..! @ రాజేష్ //