4, జూన్ 2015, గురువారం

కళ్ళముందు కనబడే
సాక్షాన్నే కాదంటున్నారంటే..
ఇంతకాన్నా
ఘోరం ఏముంటుంది నేస్తమా..!
ఏసీబీకి అడ్డంగా దొరికినప్పటికీ
అడ్డదిడ్డమైన మాటలతో దాడికి
దిగే నేతలనేమనాలి నేస్తమా..!
మీరంటున్నదే నిజమని నమ్మేద్దాం
కాని దేశంలో ఏసీబీ చేస్తున్న
దాడులలో దొరికిన వారందరూ
రేవంత్ లాంటి వారేనా నేస్తమా..!
"దేశం"లో ఎంతటి ఘోరాలు చేసినా
నేరాలకు పాల్పడినా
మీ పార్టీ వారు తప్ప
దేశంలో మిగతావారందరూ
దొంగలేనంటారు మీరు అవునా నేస్తమా..!
పక్కా ఆధారాలతో
బయటపడిన వీడియో చిత్రాలను
చూసి ప్రపంచమంతా విస్తుపోయినా
రేవంత్ ఎపిసోడ్ పై
ఇంత వరకు నోరు విప్పని
బాస్ లో నైతికత ఎంత ఉందో
అర్ధమవుతోంది కదా నేస్తమా..!
ఇన్ని రోజులుగా ప్రజలను
మోసం చేస్తూనే ఉన్నారు
ఉపన్యాసాలపై ఉపన్యాసాలు దంచి
తను, తన వర్గమంతా
సాధువులమని చెబుతునే ఉన్నారు
పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ
ఎవరూ చూడడం లేదనే విధంగా నేస్తమా..!
ప్రజలను మభ్య పెట్టి, మాయమాటలు చెప్పి..
కులాలుగా విభజించి, మీ వ్యాపారాల కోసం
మొత్తం తెలుగువారి మధ్యే చిచ్చుపెట్టి
సఖ్యత లేకుండా చేస్తున్నారు కదా నేస్తమా..!
నేను నిద్రపోను.. ఎవరినీ నిద్రపోనివ్వనని
అనేక సందర్భాల్లో ప్రస్తావించిన బాసుకి
ఇప్పుడు నిద్రపట్టడం లేదని బాధపడితే ఎలా నేస్తమా..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి