చందనాల నలుగు రాసిన మేనిచాయతో..
పాలల్లో అభ్యంగనం చేసిన పరువాలతో...
వెన్నెల విరిసిన తెల్లని చీరతో..
బిడియమనే నగతురుమిన నయనాలతో..
సిగ్గు పెదవులపై చిరునవ్వులా వికసించగా
వరుడు కట్టే పసుపు తాడుకై ఆనందంతో మెడను వంచీ..
తాళికట్టు వేళా తన మునివేళ్ళస్పర్శ తో మది పులకరించగా..
ముడి ముడికీ...మనసు మనసు..మమేకమౌతూ..
మూడు ముళ్ళ ఈ బంధం పదికాలాలు పదిలంగా ఉండాలని..
వధువు కోరుకునే సమయాన తన మదిలో మెదిలే కన్నీటి భాష్పాలు ఎందరికి తెల్సు??
ఒకరినొకరు చూసుకున్న తొలిక్షణాన ఇంత అందం నాదేనా అని వరుడి మదిలో...
ఇంత ఉన్నత వ్యక్తి సాన్నిత్యం కలకాలం నాదే కదా అని వధువు మదిలో...! ... @ Subha Mantrala

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి