“మాంగల్య ధారణ ముహూర్తః సుముహూర్తః అస్తు”
అని పురోహితులు పలికే శుభ ఘడియల కోసం,
మధురమైన ఊహలతో వేచిన యువతీ యువకుల,
మానసోల్లాసము ఉప్పొంగు మాంగళ సూత్రధారణ వేళ,
తొమ్మిది సూత్రముల పసుపుల కలయికల ప్రేమ చిహ్నం,
ధర్మ, అర్థ, కామ పురుషార్థముల సమయించు సంకేతమై,
గత, ప్రస్తుత, ముందు రాబోవు జన్మల అన్యోన్య బంధమై,
మనసా. వాచా, కర్మణా సౌమనస్యం కలిగి చరించుటకై,
శుభప్రదమగు మంత్రోచ్చారణ విధితో భజంత్రీలు మ్రోగ,
వివాహ మండపమున అక్షింతల జల్లు కురియుచుండగ,
‘కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం’ అనుచు వరుడు
శోభాయమానముగా వధువు మెడలో తాళి కట్టు వేడుక. .@ Kanaka Sai Kumar Malladi
అని పురోహితులు పలికే శుభ ఘడియల కోసం,
మధురమైన ఊహలతో వేచిన యువతీ యువకుల,
మానసోల్లాసము ఉప్పొంగు మాంగళ సూత్రధారణ వేళ,
తొమ్మిది సూత్రముల పసుపుల కలయికల ప్రేమ చిహ్నం,
ధర్మ, అర్థ, కామ పురుషార్థముల సమయించు సంకేతమై,
గత, ప్రస్తుత, ముందు రాబోవు జన్మల అన్యోన్య బంధమై,
మనసా. వాచా, కర్మణా సౌమనస్యం కలిగి చరించుటకై,
శుభప్రదమగు మంత్రోచ్చారణ విధితో భజంత్రీలు మ్రోగ,
వివాహ మండపమున అక్షింతల జల్లు కురియుచుండగ,
‘కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం’ అనుచు వరుడు
శోభాయమానముగా వధువు మెడలో తాళి కట్టు వేడుక. .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి