3, అక్టోబర్ 2014, శుక్రవారం

ఎప్పుడూ ఏదీ శాశ్వతం కాదు...

ఇంతలోనే ఎంత మార్పు
అందం.. అధికారం..దర్పం..
ఎప్పుడూ ఏదీ శాశ్వతం కాదు
ఇంతలోనే వస్తాయి..
అంతలోనే మాయమౌతాయి
దీనికి ఎవరూ అతీతులు కాదని..
మరోసారి రుజువయ్యింది
చట్టం ముందు అందరూ..
అందరూ సమానులే సుమీ
దేశానికి రాజైనా..
ప్రజలకు ఇష్టదైవమైనా
తప్పు చేస్తే శిక్ష తప్పదు మరి..
కోర్టు శిక్ష వేసిన తర్వాత
ఇది అన్యాయం..
అది న్యాయం
అంటూ చెప్పడం తగదు..
న్యాయాన్యాయాలు పరిశీలించిన
మీదట వచ్చేదే తీర్పు ..
ఆ తీర్పును శిరసా వహించాలే తప్ప
దానిపై చర్చోప చర్చలు తగదు నేస్తమా..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి