31, ఆగస్టు 2014, ఆదివారం

45 రోజుల్లో 140 పోస్టింగ్ లతో 5000 వేల మంది వీక్షకులకు దగ్గరయ్యా...నమస్తే నేస్తమా ..! @ రాజేష్ @

కేవలం 45 రోజుల్లో 140 పోస్టింగ్ లతో 5000 వేల మంది వీక్షకులకు దగ్గరయ్యానంటే అది మీ అందరి అభిమానమే కదా అందుకే మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.నమస్తే నేస్తమా ..! @ రాజేష్ @

మీ అందరికీ నా ధన్యవాదాలు

మీ అందరికీ నా ధన్యవాదాలు
నమస్తే నేస్తమా..! @ రాజేష్ @
==============================
నా బ్లాగర్ వీక్షకుల సంఖ్య నేటికి 5వేలకు చేరుకుందని తెలియజేయుటకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ విధంగా సహకరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. వీలయితే మీరూ నా బ్లాగును వీక్షించవచ్చు. ఇక్కడ నొక్కండి  http://rajeswaraokonda.blogspot.com  నా బ్లాగును చూడండి

30, ఆగస్టు 2014, శనివారం

రూపే డెబిట్ కార్డ్ @ రాజేష్ @

రూపే డెబిట్ కార్డ్
============
ప్రారంభించారు మన ప్రధాని
నరేంద్ర మోడి "జనధనయోజన"
నిజంగా నిరుపేదలకిది పండగే
ఆర్థిక అస్పృశ్యత నిర్మూలించడమే
దీని లక్ష్యమట, జీరో బ్యాలన్స్
బ్యాంక్ అకౌంటతో పాటు
వర్తిస్థాయట జీవిత బీమా,
ప్రమాద బీమా, డెబిట్ కార్ద్ సౌకర్యాలు
ఒక్క రోజే రికార్డు స్థాయిలో
దేశవ్యాప్తంగా 1.5 కోట్ల ఖాతాలకు శ్రీకారం
దాని పేరే "రూపే" డెబిట్ కార్డ్
ప్రారంభించేందుకు ప్రోత్సహించండి బ్యాంక్ ఖాతాలను
పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరినీ
దేశంలో ఆర్ధిక అస్పృశ్యత
నిర్మూలించేందుకు సహకరించండి...!
@ రాజేష్ @

"ఫేస్" బుక్ ఐపోతుంది జరభద్రం నేస్తమా..! @ రాజేష్ @

ఫేస్ బుక్ లోకి
పోలీసులందరొచ్చేశారు
ఒక్కొక్కరికీ ఒక్కో బీట్
ఇచ్చేసినట్టున్నారు
లైక్ లు కొట్టేటప్పుడు
కామెంట్లు పెట్టేటప్పుడు
షేర్లు చేసేటప్పుడు
పిచ్చిపిచ్చి వేషాలేస్తే
"ఫేస్" బుక్ ఐపోతుంది
జరభద్రం నేస్తమా..! @ రాజేష్ @

29, ఆగస్టు 2014, శుక్రవారం

చూపుల శృంగారమొలకరిస్తున్నావు_మాటల మధురిమలు చిలకరిస్తున్నావు..! @ రాజేష్ @


నేతలు పెడుతున్నారు పొలికేకలు

వద్దు వద్దంటున్నా రాజధాని
వినరేం ఈ పాలకులు
పదే పదే బెజవాడే రాజధానంటూ
ఈ నేతలు పెడుతున్నారు పొలికేకలు
తినడానికి తిండిగింజలుండవని
ఓ పక్క కమిటీ మొత్తుకుంటున్నా
అవన్నీ మాకెందుకండీ బాబు
మాకు మెట్రో నగరమే మేలంటూ
రోజుకో నేత వేస్తాడు దండోరా
రియల్ దందాకు ఇదో చేయూతరా
ఎవరేమనుకున్నా
ఆకాశం తల్లకిందులైనా
ఇచ్చేది ఇవ్వక మానరు
వచ్చేది రాక మానదు
ఇలా ఎందుకు రోజుకొకరు
పదే పదే పక్కవారిని రెచ్చగొడ్తరు
నేతలారా, మంత్రులారా
మీరు చేయాల్సిన పనులు
ప్రజలకు చాలా ఉన్నాయ్
వాటి మీద దృష్టి పెట్టి
ఎన్నికలప్పుడు మీరు చేసిన
వాగ్ధానాలను తూచా తప్పకుండా
నెరవేర్చండి చాలు
రాజధాని తెచ్చేవారు
వేరే ఉన్నారు
వారైతే ఏమీ మాట్లాడరు
మీరు మాత్రం ఎందుకు
నోరు పారేసుకుంటరు
తెలంగాణ వద్దని
మీరందరు కలసి
అందర్నీ రోడ్డెంకించారు
తెలంగాణ ఏమయ్యింది నేస్తమా..!
నేతలారా ఏదైనా రాష్ట్ర బాగు కోరండి
అందరు సుభిక్షంగా ఉంటారు
పదిమందీ మీ పేరు చెప్పుకుంటరు
కేవలం మీకోసమో మీ పక్క వారి కోసమో
పది మందికీ ఉపయోగపడే వాటిని చెడగొట్టకండి
జాతి మిమ్మల్ని క్షమించదు
రాష్ట్రాన్ని బాగు చేసుకునేందుకు
మీకో మంచి అవకాశం వచ్చింది
దీన్ని వినియోగించుకోండి
వక్రంగా కాకుండా, సక్రమంగా.
చరిత్రలో సువర్ణాక్షరాలతో నేస్తమా..! @ రాజేష్ @ 

28, ఆగస్టు 2014, గురువారం

మిత్రులందరికీ శ్రీ గణేశ నవరాత్రి శుభాకాంక్షలు!


సరదాగా - మీతో కాసేపు...

సరదాగా - మీతో కాసేపు...
=====================
నేనెంతో హుందాగా ఉందామనుకుంటా
నా మనసేమో అలా ఎందుకంటోంది
పదిమందికీ ఆదర్శం కావాలికదా అంటా
వాళ్లేది చెబితే అదే చేస్తావా ఏంటని ప్రశ్నిస్తోంది
అయినా నచ్చ చెప్పా అయితే నీ ఇష్టం అంటూనే
నన్నెందుకడుగుతావని మరోసారి ప్రశ్నించింది
దానిలో తప్పేముంది మంచే చెబుతున్నారుగా అన్నా
నా మనస్సు నాది కాదుగా నీ ఇష్టం అంది
అప్పుడు తెలిసింది నా మనస్సు నాది కాదని
మనసు మనది కావాలంటే ఏంచేయాలి
మన చేతిలోనుంచి జారిపోకుండా 
ఎలా జాగ్రత్తపడాలనే ఆలోచనలో పడ్డా
అంతే ఇంతలో కాలు జారిపడ్డా ఇంకేముంది 
ఆ తర్వాత మీకు తెలుసుగా 
హాస్పటల్ వ్యవహారం కాలుకి కట్టు డబ్బులు ఫట్టు
అందుకే ఏ వయస్సులో చేయాల్సిన
ఆలోచనలు ఆ వయస్సులోనే చెయ్యాలని
క్షవరం అయిన తర్వాత గాని తెలియలేదు వివరం నాకు
మీరేమంటారు నేస్తమా..! @ రాజేష్ @

23, ఆగస్టు 2014, శనివారం

ఏ ఒక్కరి సొంతం కాదు..

తెలివి తేటలు 
ఏ ఒక్కరి సొంతం కాదు..
ప్రతి ఒక్కరిలో 
ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది
దాన్ని వెలికి తీసేందుకు
ప్రయత్నించాలే తప్ప
వెకిలి చేష్టలతో 
విమర్శించకూడదు నేస్తమా..! @ రాజేష్ 

నిన్న లేని అందమేదో నీలో - నేడు కనువిందు చేస్తున్న దెందుకో..! @ రాజేష్ @


దృశ్యం ఏదైనా ..

కనిపించేవన్నీ ..
కావు అందాలు
మరుగునపడినవన్నీ ..
కావు కళాఖండాలు
మౌనంగా ఉంటే ..
కాలేరు మంచిమనుషులు
అల్లరి చిల్లరిగా ..
ఉంటే కారు ఆకతాయిలు
దృశ్యం ఏదైనా ...
మెరుగులు చూసి మోసపోకూడదు నేస్తమా..! @ రాజేష్ @

20, ఆగస్టు 2014, బుధవారం

పచ్చని తోటలో నులువెచ్చని నవ్వులు నీవిలా రువ్విస్తుంటే ఇక పువ్వులెందుకు...!@ రాజేష్ @


అందానికే అందమైన నీ అందానికి_ అదనంగా అంతెందుకు ఆ "బంగారం" ...! @ రాజేష్ @


"హీరొ చిరు"తో నేను

విజయవాడ ప్రెస్ క్లబ్ లో  "హీరొ చిరు"తో నేను నాతోటి జర్నలిస్టులు

19, ఆగస్టు 2014, మంగళవారం

రెప్పవాల్చలేకపోతున్నా- నిన్నిలా చూస్తుంటే... @ రాజేష్ @


నీవు చరిత్ర సృష్టించావన్నా...

అన్నా చంద్రన్నా..!నీవనుకున్నది తప్పక చేస్తావన్నా..
ఎవరేమనుకున్నా అన్నానీకు తోచిందే మంచిదనుకుంటావన్నా
సర్వే పేరుతో అన్నానీవు చరిత్ర సృష్టించావన్నా
ఎవరెక్కడ ఉన్నా అన్నా
సర్వే రోజు సొంతగూటికి చేరారన్నా
ప్రభుత్వ పథకాలేమోగానన్నా
నీ లెక్క మాత్రం తప్పలేదన్నా
నేతలైనా,నిమిత్తమాత్రులైనా అన్నా
ఆ ఒక్కరోజు కుటుంబంతోనే హాయిగా గడిపారన్నా
ఇది దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమన్నా...
@ రాజేష్ @

అదిగో అంటే అరునెలలు...

మాకూ ఉన్నారు ఓ చంద్రన్నా
అదిగో అంటే అరునెలలు పడుతుంది దేనికైనా
గట్టిగా అడిగితే నీవు ప్రతిపక్షపార్టీ వాడివా అంటారన్నా
రైతు రుణమాఫీ అంటూ తొలిసంతకం పెట్టారన్నా
ఎవరికి మాఫీ అయ్యిందో గాని రైతులకైతే కాలేదన్నా
ఇక రాజధాని ఇదిగో అదిగో అంటున్నారన్నా
రోజుకో ఊరుపేరు చెప్పి రియల్ దందాను పెంచుతున్నారన్నా
అదేమని అడిగితే కావాలంటూన్నారు ఒకే చోట 35వేల ఎకరాలన్నా
దొనకొండ మేలని ఒకరంటే అన్నా
కాదు కర్నూలే బెటరంటున్నారు మరొకరన్నా
ఇవన్నీ కాదయ్యా అన్నింటికీ బెజవాడే బెస్ట్ అంటూ తేల్చేశారు మన అయ్యవారొకరన్నా
ఇదే కదన్నా ప్రస్తుతం నవ్యాంధ్ర నేతల పనితీరన్నా
మా చంద్రన్నకన్నా అంతా అధోరకం భయమన్నా
పథకాలెక్కడ అమలు చేస్తే పేదలెక్కడ బాగుపడిపోతారోనన్నా
అదే పెద్దల కోసమైతే నన్నా ఏ పథకమైనా చెప్పన్నా
అవి చిటికెలో అమలులోకి వచ్చేస్తాయన్నా
అవసరమైతే అర్ధరాత్రైనా ఆ జీవోలు
ఆఘమేఘాల మీద సిద్ధమైపోతాయన్నా
అందుకే మా చంద్రన్న రూటే సపరేటనా...! @ రాజేష్ @

ఏపిడబ్లుజె ఆవిర్భావ దినోత్సవం

ఏపిడబ్లుజె ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన అతిధైన సీనియర్ పాత్రికేయులు ఉపేంద్ర గారికి పుష్పగుచ్చం ఇస్తున్న సందర్భంగా తీసిన ఫొటో ఇది.. ఫాగ్ హాస్టింగ్ చేస్తున్న పాత్రికేయ బృందంతో నేను...

బెజవాడకు రాజధాని హంగామా

వచ్చేసింది.. వచ్చేసింది..
బెజవాడకు రాజధాని హంగామా
ఎక్కడ చూసినా రద్దీ పెరుగుతోంది
రోజురోజుకీ తప్పడంలేదు అధికారులకు హడావుడి
రోడ్లపై వాహనాల రద్దీతో
ప్రజలకు మొదలయ్యాయి కొత్తకష్టాలు
నగరంలో ఎక్కడ చూసినా
ఇరుకు రోడ్లే తప్ప ఏముంది గర్వకారణం
వర్షం కురిస్తే నగరమంతా
మురికికూప మయం
ఎప్పుడు చేస్తారు
ఈ నగరాన్ని బంగారుమయం
నగరంలో నిరంతరం పోలీసులకు బీట్లు
ఎవరొచ్చినా తప్పడంలేదు వారికి పాట్లు
ఎంత చేసినా, ఎటు వెళ్లినా
నిఘా వ్యవస్థ లోపం
ఏదైనా జరిగితే అవాంచనీయం
నోటిమీద వేలు వేసుకోవాలి మనం
నగరంలో సీసీ కెమెరాలు అంతంత మాత్రం
వాటి పనితీరు పట్టదు ఎవరికీ ఏమాత్రం
ఏదేమైనా రాజధాని హంగులకు తగ్గట్టుగా
బెజవాడలో పెంచక తప్పదు భద్రత నేస్తమా..! @ రాజేష్ @

16, ఆగస్టు 2014, శనివారం

సాక్షి పత్రిక క్లిప్పింగ్..


స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ...

స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా రమ్యభారతి సాహితీ పత్రిక సంపాదకుడు చలపాక ప్రకాష్ విక్టోరియా మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమంలో కవులు,రచయితలు పింగళి వెంకయ్య విగ్రహం వద్ద ప్రాంతీయ,మత,కులతత్వాలకు అతీతంగా రచనలు చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అటువంటి  మంచి కార్యక్రమానికి నేను కూడా హాజరై ఒక కవిత చదివి అందరి హృదయాలను దోచుకున్నానని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. @ నమస్తే నేస్తమా..! రాజేష్ @

నేను సైతం...


14, ఆగస్టు 2014, గురువారం

జోలిపట్టి అడుక్కోకండోయ్...

దేశమంటే రాజకీయాలు కాదోయ్
దేశమంటే ప్రజలేనోయ్
ఒట్టిమాటలు కట్టిపెట్టి
ప్రజలకు గట్టి పనులు చేపట్టండోయ్
రాజధాని నిర్మాణం కోసం
కల్లబొల్లి మాటలాపి చేతలు చూపించండోయ్
రోజుకో ఊరు పేరు చెప్పి
"రియల్" దందాను పెంచకండోయ్
కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ
ప్రజా ధనం దుర్వినియోగం చేయకండోయ్
ఓ పక్క కోట్లకుకోట్లు వృధాఖర్చులుచేస్తూ
మరో పక్క జోలిపట్టి అడుక్కోకండోయ్  @ రాజేష్ @

11, ఆగస్టు 2014, సోమవారం

గుండె గదిలో నిను బంధించి_నే బందిపోటునై పోయా..! @ రాజేష్ @


విల్లుని మించిన నీ వయ్యారం - మాకెంతో మాధుర్యం.. @ రాజేష్ @


నీ నవ్వు వికసించే పువ్వు.. @ రాజేష్ @


I AM AN INDIAN


              I AM AN INDIAN

భారతీయుడిగా మనదేశంపై మనకున్న ప్రేమను ఫేస్ బుక్ లొ చూపెడదాం. ఇతర దేశాలు ఆశ్చర్యపడేలా ఆగస్టు 15 నాటి వరకు మన ప్రొఫైల్ ఇమేజ్ ని జాతీయ జెండాగా మార్చడం ద్వారా మన భారతీయుల సత్తా ఏమిటో ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన వాళ్లమవుదాం. నా ఈ ఆ కాంక్షను, భారతీయతను చాటి చెప్పేందుకు ఒక్కక్కరుగా ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారని ఆశిస్తూ...  - మీ నేస్తం కొండా రాజేశ్వరరావు

కనువిందుగా నీవలా - అందాలను ఊయలలో ఊగిస్తూ..! @ రాజేష్


6, ఆగస్టు 2014, బుధవారం

సైకిలెక్కగలవే - ఓ సొగసరి నీవు.. బైకులెక్కగలవే..!@ రాజేష్ @


నీకాలి మువ్వల సవ్వడులే_నా నిద్రలేపే గడియలు..!@ రాజేష్ @


ఆ చిరునవ్వుకే-నే చలించిపోతా..!@ రాజేష్ @


నేనొస్తాననేగా నీవలా_నిత్యం నాకోసం..! @ రాజేష్ @

100th

 pic

3, ఆగస్టు 2014, ఆదివారం

నీతో నడిచిన సప్తపదులే-నేను ఇష్టపదులుగా మార్చుకున్నా..! @ రాజేష్ @


ఆ మధురజ్ఞాపకాలు...

ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ రోజు ఆంధ్రభూమి దినపత్రికలో నేను రాసిన కవిత ప్రచురించారు. ఆ విషయాన్ని మీకు తెలియజేసేందుకు ఈక్లిప్పింగ్ ను పెడుతున్నాను. 

2, ఆగస్టు 2014, శనివారం

మనసులు తెలిసిన స్నేహం మనది


మనసులు తెలిసిన స్నేహం మనది
అందం చందం తెలియని స్నేహం మనది
ఆడుతు పాడుతు తిరిగిన స్నేహం మనది
ఒకరికోసం మరొకరం పరితపించిన స్నేహం మనది కదానేస్తమా..! @ రాజేష్ @