29, ఆగస్టు 2014, శుక్రవారం

నేతలు పెడుతున్నారు పొలికేకలు

వద్దు వద్దంటున్నా రాజధాని
వినరేం ఈ పాలకులు
పదే పదే బెజవాడే రాజధానంటూ
ఈ నేతలు పెడుతున్నారు పొలికేకలు
తినడానికి తిండిగింజలుండవని
ఓ పక్క కమిటీ మొత్తుకుంటున్నా
అవన్నీ మాకెందుకండీ బాబు
మాకు మెట్రో నగరమే మేలంటూ
రోజుకో నేత వేస్తాడు దండోరా
రియల్ దందాకు ఇదో చేయూతరా
ఎవరేమనుకున్నా
ఆకాశం తల్లకిందులైనా
ఇచ్చేది ఇవ్వక మానరు
వచ్చేది రాక మానదు
ఇలా ఎందుకు రోజుకొకరు
పదే పదే పక్కవారిని రెచ్చగొడ్తరు
నేతలారా, మంత్రులారా
మీరు చేయాల్సిన పనులు
ప్రజలకు చాలా ఉన్నాయ్
వాటి మీద దృష్టి పెట్టి
ఎన్నికలప్పుడు మీరు చేసిన
వాగ్ధానాలను తూచా తప్పకుండా
నెరవేర్చండి చాలు
రాజధాని తెచ్చేవారు
వేరే ఉన్నారు
వారైతే ఏమీ మాట్లాడరు
మీరు మాత్రం ఎందుకు
నోరు పారేసుకుంటరు
తెలంగాణ వద్దని
మీరందరు కలసి
అందర్నీ రోడ్డెంకించారు
తెలంగాణ ఏమయ్యింది నేస్తమా..!
నేతలారా ఏదైనా రాష్ట్ర బాగు కోరండి
అందరు సుభిక్షంగా ఉంటారు
పదిమందీ మీ పేరు చెప్పుకుంటరు
కేవలం మీకోసమో మీ పక్క వారి కోసమో
పది మందికీ ఉపయోగపడే వాటిని చెడగొట్టకండి
జాతి మిమ్మల్ని క్షమించదు
రాష్ట్రాన్ని బాగు చేసుకునేందుకు
మీకో మంచి అవకాశం వచ్చింది
దీన్ని వినియోగించుకోండి
వక్రంగా కాకుండా, సక్రమంగా.
చరిత్రలో సువర్ణాక్షరాలతో నేస్తమా..! @ రాజేష్ @ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి