సరదాగా - మీతో కాసేపు...
=====================
నేనెంతో హుందాగా ఉందామనుకుంటా
నా మనసేమో అలా ఎందుకంటోంది
పదిమందికీ ఆదర్శం కావాలికదా అంటా
వాళ్లేది చెబితే అదే చేస్తావా ఏంటని ప్రశ్నిస్తోంది
అయినా నచ్చ చెప్పా అయితే నీ ఇష్టం అంటూనే
నన్నెందుకడుగుతావని మరోసారి ప్రశ్నించింది
దానిలో తప్పేముంది మంచే చెబుతున్నారుగా అన్నా
నా మనస్సు నాది కాదుగా నీ ఇష్టం అంది
అప్పుడు తెలిసింది నా మనస్సు నాది కాదని
మనసు మనది కావాలంటే ఏంచేయాలి
మన చేతిలోనుంచి జారిపోకుండా
ఎలా జాగ్రత్తపడాలనే ఆలోచనలో పడ్డా
అంతే ఇంతలో కాలు జారిపడ్డా ఇంకేముంది
ఆ తర్వాత మీకు తెలుసుగా
హాస్పటల్ వ్యవహారం కాలుకి కట్టు డబ్బులు ఫట్టు
అందుకే ఏ వయస్సులో చేయాల్సిన
ఆలోచనలు ఆ వయస్సులోనే చెయ్యాలని
క్షవరం అయిన తర్వాత గాని తెలియలేదు వివరం నాకు
మీరేమంటారు నేస్తమా..! @ రాజేష్ @

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి