19, ఆగస్టు 2014, మంగళవారం

అదిగో అంటే అరునెలలు...

మాకూ ఉన్నారు ఓ చంద్రన్నా
అదిగో అంటే అరునెలలు పడుతుంది దేనికైనా
గట్టిగా అడిగితే నీవు ప్రతిపక్షపార్టీ వాడివా అంటారన్నా
రైతు రుణమాఫీ అంటూ తొలిసంతకం పెట్టారన్నా
ఎవరికి మాఫీ అయ్యిందో గాని రైతులకైతే కాలేదన్నా
ఇక రాజధాని ఇదిగో అదిగో అంటున్నారన్నా
రోజుకో ఊరుపేరు చెప్పి రియల్ దందాను పెంచుతున్నారన్నా
అదేమని అడిగితే కావాలంటూన్నారు ఒకే చోట 35వేల ఎకరాలన్నా
దొనకొండ మేలని ఒకరంటే అన్నా
కాదు కర్నూలే బెటరంటున్నారు మరొకరన్నా
ఇవన్నీ కాదయ్యా అన్నింటికీ బెజవాడే బెస్ట్ అంటూ తేల్చేశారు మన అయ్యవారొకరన్నా
ఇదే కదన్నా ప్రస్తుతం నవ్యాంధ్ర నేతల పనితీరన్నా
మా చంద్రన్నకన్నా అంతా అధోరకం భయమన్నా
పథకాలెక్కడ అమలు చేస్తే పేదలెక్కడ బాగుపడిపోతారోనన్నా
అదే పెద్దల కోసమైతే నన్నా ఏ పథకమైనా చెప్పన్నా
అవి చిటికెలో అమలులోకి వచ్చేస్తాయన్నా
అవసరమైతే అర్ధరాత్రైనా ఆ జీవోలు
ఆఘమేఘాల మీద సిద్ధమైపోతాయన్నా
అందుకే మా చంద్రన్న రూటే సపరేటనా...! @ రాజేష్ @

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి