విశాఖను కలవర పెట్టిన హుదుద్
నిలువనీడ లేకుండా చేసిన హుదుద్
కడలి తీరాన్ని గడగడలాడించిన హుదుద్
ఉప్పెనై నగరాన్ని ముప్పుతిప్పలు పెట్టిన హుదుద్
నందనవనమైన సుందర నగరాన్నిశిథిలం చేసిన హుదుద్
సుడిగాలితో పెనవేసుకుని కల్లోలం సృష్టించిన హుదుద్
మానవ తప్పిదాలను మరోసారి హెచ్చరించిన హుదుద్
మరువలేని గాయాలతో అంధకారాన్ని నింపిన హుదుద్
ప్రకృతి ప్రకోపంతో ప్రతాపం చూపిన హుదుద్
పచ్చదనాన్ని మైమరిచిన పైశాచికాన్ని హెచ్చరించిన హుదుద్
అందుకే ప్రకృతికి ప్రతిఒక్కరం ప్రణమిల్లుదాం
భావితరాలకు మనమందరం బాటలు వేద్దాం.. నేస్తమా..!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి