25, అక్టోబర్ 2014, శనివారం

ఆశకు హద్దుండాలి దేనికైనా...!


ఏదోలా ఎంతో ఎత్తుకి ఎదగాలని నీకున్నా..
సమయం నీకు అనుకూలించాలిరా కన్నా..
ముందుగ అందరి సహకారం ఉండాలన్నా..
మెండుగ పెద్దవారి మన్ననలు లేకున్నా...
చివరికి నీకు మిగిలేది సున్నా..
వీటన్నిటి కంటే ముందు ఆశ నీకున్నా
నీ అర్హతలు తెలుసుకుని మసులుకోరా నాన్నా...

అందుకే నన్నునేను ఎప్పుడూ ప్రశ్నించుకుంటూ..
సుదిగుండంలో బాణాలు వేస్తూ..
తప్పులతోనే తప్పటడుగులు వేస్తూ...
అర్హతలకు మించిన ఆశలకు పోతూ..
జీవితంలో ఓడిపోతూ..
నిరంతరం ఆశాజీవిగా...
బతకడం అవసరమా నేస్తమా.. @ రాజేష్ @

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి