20, జూన్ 2015, శనివారం

ప్రజలిచ్చిన అధికారాన్ని
ప్రజల బాగోగులకు
వినియోగించకుండా
అధికార మదంతో
తప్పులపై తప్పులు చేస్తూ...
చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే
ప్రయత్నంలో నేతలను రక్షించేందుకే
సమయాన్నంతా వృధా చేస్తూ...
ప్రజలకేదో అన్యాయం
జరిగిపోతుందని తెలుగు ప్రజలను
రెచ్చగొడుతూ విచ్చల విడిగా
అవినీతిని ప్రోత్సహిస్తూ...
మీరు చేసే అవినీతి, అక్రమాలను
ప్రశ్నించే మీడియా గొంతును
సైతం నొక్కేస్తూ...
రాజ్యాంగబద్దంగా ఎన్నికైన
గవర్నర్ లాంటి వ్యక్తులను
సైతం బ్లాక్ మెయిల్ చేస్తూ...
ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ
రాజ్యాంగాన్ని...
న్యాయవ్యవస్థను...
రాజకీయమనే కుతంత్ర చట్రంలో ఇరికించేస్తూ..
ఎటువైపుకు తీసుకెళ్తున్నారు నేస్తమా..?
ఎవరిని ఉద్దరించడానికి ఇలాంటి
పరిపాలన చేస్తున్నారు నేస్తమా...?
నాలా ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై
ఏదో ఒక ముద్రవేసి ప్రశ్నించే తత్వాన్నే
కలుపు మొక్కల మాదిరి
ఏరిపారేయాలనుకుంటే ప్రజాస్వామ్యంలో
సాధ్యం కాదు నేస్తమా..?
నేను పోతే ఇంకొకరు
ఇంకొకరు పోతే మరొకరు
పుట్టుకొస్తూనే ఉంటారు
ప్రశ్నించే వారు నేస్తమా..?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి