1, జులై 2015, బుధవారం

మంగళగిరి సాక్షి కార్యాలయంలోని ఎడిటోరియల్ డిపార్ట్ మెంట్లో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న కొల్లి వీర వెంకట శివప్రసాద్ రెడ్డి గారు మంగళవారం పదవీవిరమణ చేసిన సందర్భంగా ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించాము.ఈ సందర్భం గా ఆయనకు నావంతు కర్తవ్యంగా అక్షర సన్మానం చేసే అదృష్టం నాకు కల్గినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ...
=======================================
ప్రసాదరెడ్డి గారికి "అక్షర సన్మానం"
=========================================
వ్యవసాయాధారిత కుటుంబంలో పుట్టి
జీవిత లక్ష్యం కోసం అక్షరాలు సాగుచేసి
విలక్షణంగా లక్షణమైన జర్నలిస్టుగా
వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించే దిశగా
ఉదయంలో ఉదయించి,
ఆంధ్ర"భూమి"లో అక్షరాలు పండించిన నేస్తమా..!
కొల్లి వీర వెంకట శివప్రసాద్ రెడ్డి
నామధేయంలో వీరత్వం ఉట్టిపడుతున్నా
ఎవరిమీదా శివప్రతాపం చూపించకుండా
అణుకువే (వెంకన్నే)ఆరాధ్యదైవంగా
సౌమ్యమే పరమావధిగా (ప్రసాదంగా)
ఇరవై ఎనిమిదేళ్ళపాటు
నిర్విరామంగా సేవలందించిన మీకు
"సాక్షి"లో వయసుకు విరామమే వచ్చింది
తప్ప మీ మనసుకు కాదనేది వాస్తవం నేస్తమా..!
మౌనంగా ఎదగమని మొక్కనీకు చెబుతోంది అన్నట్టు
మౌనాన్నే పెట్టుబడిగా పెట్టుకున్న మీరు
అందరి మన్ననలు పొంది
సెహబాష్ అనిపించుకున్నారు కదా నేస్తమా..!
కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన
సోమిరెడ్డి, అనసూయ దంపతులకు
మణిహారంగా నిలిచిన మీకు, మీకుటుంబానికి
సాక్షి కుటుంబం తరఫున ధన్యవాదాలు
తెలియజేస్తున్నాం నేస్తమా..!
-@ కొండా రాజేశ్వరరావు @

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి