13, ఏప్రిల్ 2015, సోమవారం

మీరిలా కొట్టుకుంటూ ఉంటే
మీ ఉద్యోగాలు ఊడిపోతాయ్..
జాగ్రత్త.. ఏమనుకుంటున్నారో ఖబడ్దార్..
అంటూ హెచ్చరించారు ఓ పెద్దాయన..
దాంతో ఒక్కసారిగా వెన్నులో వణుకుపుట్టింది వారికి
పెద్దాయన అన్నంత పని చేస్తారా ఏంటి..?
అనుకుంటూ భయంతో చెమటలు పట్టిన ఖద్దర్ పెద్దలు
ఏసీ గదుల్లో దూరి చెమటలు తుడుచుకునే పనిలో పడ్డారు
ఐదేళ్ళ ఉద్యోగానికి కాంట్రాక్టు కుదుర్చుకున్న వారు ఇంత భయపడిపోతే..
30 ఏళ్ళ సర్వీసు చేయాల్సిన వారు ఇంకెంత హడలెత్తిపోవాలో.. ఏంటో.. అంటూ వారిద్దరూ సెల్ ఫోన్లో రహస్యంగా సంభాషించుకుంటుండగా
అకస్మాత్తుగా ఓ సీనియర్ ఉద్యోగి ఏసి గదిలోకి ప్రవేశించాడు.
ఏంటి సార్ ఎప్పుడూ లేనిది ఇంతగా భయపడుతున్నారు
అని అడిగాడు ఆ సీనియర్ ఉద్యోగి
ఏమి లేదయ్యా నీవు నిన్న సెలవు పెట్టిన రోజు
నా ఇజ్జత్ చూపిద్దాం అనుకుని... మేం ఇద్దరం కలిసి
నేను నా సహచర ఐదేళ్ల కాంట్రాక్టు ఉద్యోగితో పెద్దాయన సాక్షిగా పోట్లాడా... దాంతో పెద్దాయన మీ ఇద్దరినీ ఉద్యోగం లోనుంచి పీకేస్తా అన్నాడయ్యా.. అందుకే ఇలా భయపడి పోతున్నాం
ఊరుకోండి సార్..
మీ ఐదేళ్ళ ఉద్యోగానికి ఎటువంటి ఢోకా లేదు
నా ఎక్స్ పీరియన్స్ మీద చెబుతున్నా..
పెద్దాయన చెప్పినవి ఏమీ చెయ్యరు సార్
చేసేది ఎవరకీ చెప్పరు సార్..
మీకు తెలియదా ఏంటి సార్..
నా అనుభవంలో ఇవి సరికొత్త మచ్చుతునకలు
మీకు కూడా తెలుసు కదా.. చూడండి
రైతుల రుణమాఫీ చేస్తా..
ఇంటికో ఉద్యోగం ఇస్తా..
డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తా..
నిరుద్యోగులకు నెలకు భృతిగా రెండు వేల రూపాయలిస్తా..
ఇవన్నీ ఎవరన్న మాటలో గుర్తున్నాయా..!
వాటిలో ఏ ఒక్కటైనా అమలు చేశారా..
అవుతాయి అప్పుడే తొందరి పడితే ఎలా అంటారు వారి నేస్తాలు..
ఆంధ్రా రాజధాని నిర్మించే పనిలో భాగంగా..
వారానికి రెండురోజులు విజయవాడలో నిద్రిస్తా అన్నారు నిద్రిస్తున్నారా..!
చెప్పినవన్నీ చేస్తే ఆయన ప్రత్యేకత ఏముంటుంది సార్..!
కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదంటూ సీనియర్ ఉద్యోగి భరోసాతో హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు కానీ వారికి భయం.. భయంగానే ఉండటంతో..
ఆయన చెప్పిన పనులన్నీ చేసుకుని మీ పని చేసే సరికి మీ కిచ్చిన ఐదేళ్ల కాంట్రాక్ట్ పిరియడ్ ఐపోతుంది సార్ కాబట్టి మీరేమీ బెంగపడవద్దు సార్ బీ హాపీ సార్ అంటూ ఉచిత సలహా పడేశాడు సీనియర్... హ..హా...హా...!
                                                                                                                                           @ రాజేష్ @

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి