6, ఏప్రిల్ 2015, సోమవారం

రోడ్డు ప్రమాదకేసుల్లో స్వల్పశిక్షలను విధించడం న్యాయాన్ని అవహేళన చేయడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే రోడ్డుప్రమాద కేసులంటే చాలామందికి భయం లేకుండా పోయింది. దాని వల్ల చాలా మందిలో నిర్లక్ష్యం పెరిగిపోయింది. అంతే కాకుండా ప్రమాదం మాటున హత్యలు చేసేందుకు సైతం వెనుకాడటం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రమాదానికి కారకుడైన వ్యక్తికి ప్రధానంగా పోలీసుస్టేషన్లోనే బెయిల్ ఇచ్చేస్తుండంటంతో ఇదేమీ పెద్దకేసు కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. పైగా ఈ కేసులో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని నేరాలకు పాల్పడుతున్న వారూ లేకపోలేదు. ఇంకొంచం ముందుకు వెళితే బడా బాబులు చేసే నేరాన్ని తనపై మోపుకుని ఆ శిక్షను సైతం అనుభవించేందుకు సైతం వెనుకాడడం లేదంటే ఆ కేసుపట్ల వారికున్న అవగాహనను అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇప్పుడు కొత్తగా చాలా కేసుల్లో పోలీసులకే బెయిల్ ఇచ్చే అధికారం కట్టబెట్టేయడంతో పోలీసులు తమ ఇస్టానుసారం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనా కోర్టుద్వారానే చేస్తేనే కొంతమేర అందరికీ న్యాయం జరుగుతుందనేది అక్షర సత్యం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి