6, ఏప్రిల్ 2015, సోమవారం

మా సాక్షి సబ్ ఎడిటర్ బండారు సురేష్ (బసు) జర్నలిస్టుగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా మంగళగిరి ఆఫీసులో ఆయనకు జరిగిన సన్మాన ఏర్పాటు కార్యక్రమంలో నేనూ ఓ కవితను రాసి చదివే అదృష్టం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
వందనాలు.. అభివందనాలు...
======================
సమాజంలో రుగ్మతలను ఎత్తిచూపేందుకు
విలేకరిగా అవతారమెత్తిన నీవు
తండ్రి చాటుబిడ్డగా నీ సహకారాన్ని అందిస్తూ
జర్నలిస్టుగా జీవితానికి స్వాగతం పలికిన క్షణాలు అవి..
నీచేత అక్షరాలు రాయించిన "ఉదయం"తో నీవు మొదలై
వాస్తవాలను వార్తలుగా "వార్త"లో మలిచేందుకు
నీవు చేసిన ప్రయత్నాలు అన్నీ సఫలమై
జర్నలిస్టుగా నీకు గుర్తింపు నిచ్చిన క్షణాలు అవి..
హృదయాలను కదిలించే శీర్షికలతో
"జ్యోతి"లో ఓ వెలుగు వెలిగి
అందరి మన్ననలు అందుకుంటూ ఓ పైమెట్టుకోసం
"సూర్య"ప్రతాపం చూపించిన క్షణాలు అవి..
మనసున్న మనిషిగా మదిలో మెదిలో అక్షరాలను
నీదైన శైలిలో ఓ నిఘంటువును నిర్మించుకున్నావు
అక్షర సేధ్యంలో సువర్ణాక్షరాలను సాగుచేసేందుకు
మన:"సాక్షి"ని నమ్ముకుని ఆత్మవిశ్వాసాన్ని
నింపుకున్న క్షణాలను ఎలా మర్చిపోగలము ఓ (బసు)బాసూ..!
మన్మధనామ సంవత్సరానికి మూడు వసంతాలు
పూర్తి చేసుకున్న నీవు నవమిరోజే
మాకు పసందైన విందు ఏర్పాటు చేసిన నీ సత్ సంకల్పానికి
నీకివే మా వందనాలు.. అభివందన తోరణాలు తెలియజేస్తూ..
మరో ముప్పై వసంతాలు ఇలాగే
నిర్విఘ్నంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా నేస్తమా...!
@ రాజేశ్వరరావు కొండా @

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి