20, మార్చి 2015, శుక్రవారం

ధూమ,మద్య పానాలు
ఆరోగ్యానికి హానికరం..!
అంటూ హెచ్చరికలు
జారీ చేస్తుంటాయి ప్రభుత్వాలు..!
టార్గెట్లు పెట్టి మరీ
విక్రయాలు కొనసాగిస్తుంటారు..!
అందుకు అడ్డదారిన
వచ్చిన వారికే అనుమతులిచ్చేస్తుంటారు..!
కోట్లరూపాయలు కుమ్మరించిన
వారికే పెద్దపీట వేసేస్తుంటారు..!
గుట్కాలు, పాన్ పరాగ్ లు
నమలడం నిషిద్ధమంటారు..!
అవి తయారు చేసేందుకు
మాత్రం అనుమతులిచ్చేస్తుంటారు..!
అనుమతులివ్వక పోయినా
అక్రమంగా తరలిచ్చేస్తుంటారు..!
అయినా వారిపై తీసుకోరు
ఏ ఒక్కరూ చర్యలు..!
అమ్మే వాడిని, కొనే వాడినే
దోషులుగా చిత్రీకరించేస్తుంటారు..!
చట్టబద్దత లేని వాటిని
వినియోగించడం నేరమైనప్పుడు..!
వాటిని తయారు చేయడం
కూడా నేరంగా ఎందుకు పరిగణించరు..!
ప్లాస్టిక్ కవర్ల వినియోగం
విక్రయాలు నిషేధితమంటారు..!
నిషేధిత తయారీ ఫ్యాక్టరీలపై మాత్రం
ఎందుకు దాడులు చేసి సీజ్ చేయరు..!
ఏదేమైనా చట్టబద్దతలేని వాటిని తయారుచేసి
చట్టాన్నే చుట్టంగా చూసుకునే దళారులదే రాజ్యం..!
అన్ని అనుమతులున్నా ఆరుగాలం
కష్టించిన రైతుకు మాత్రం గిట్టదు గిట్టుబాటు భోజ్యం..!
ఎందుకిలా జరుగుతోంది నేస్తమా..!
ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుంది నేస్తమా..!
@ రాజేష్ /20-03.15//

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి