16, మార్చి 2015, సోమవారం

మహిళా దినోత్సవం సందర్బంగా
మహిళలపై జరుగుతున్న అరాచకాలను నిరసిస్తూ...
ఓ యువతి పడే ఆవేదన
======================================
అమ్మా... ఓ అమ్మా...
ఏడనున్నవే అమ్మా
అమ్మా... ఓ అమ్మా...
ఏడనున్నవే అమ్మా
ఆడపిల్లనైన నన్ను
ఏల విడిచిపోయావమ్మా...
అందానికే అందమైన
రూపాన్నిచ్చిన ఓ అమ్మా..
ఎందుకిచ్చావు నాకు
ఈ పాడు జన్మ..
ఏడకెళ్ళినా తప్పడం లేదే
నాకు ఈసడింపులు..
ఎవరినడిగినా నాకు
అగుపించడంలేదే ఆదరణ అమ్మా..
చేయని తప్పులకు లోకులు
లోకులు కాకులై పొడుస్తుంటే...
నేనేమీ చేయలేని
నిస్సహాయ స్థితిలో అమ్మా..
న్యాయం కోసమని
పోలీసోళ్లని ఆశ్రయిస్తే
నన్నే అవహేళన చేసినారే అమ్మా..
ఆఘోరాన్ని ఎవరికీ చెప్పుకోలేక
కాసింత నీడ కరువైన నేను
బోరుబోరున ఏడుస్తుంటే అమ్మా..
ఓ రోజున కాసింత
నీడనిస్తనని నమ్మించి
నన్ను అంగట్లో
అమ్మేసినాడే అమ్మా.. ఓ అమ్మా...
ఏడనున్నవే అమ్మా...! @ రాజేష్ /8-3-15/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి