ఇంటర్ నెట్ ఇక ఆగిపోతుందా?
Sakshi | Updated: May 04, 2015 16:28 (IST)
లండన్ :
ప్రతివారికీ ఇప్పుడు చేతిలో ఇంటర్ నెట్ లేకుండా క్షణం కూడా గడవని
పరిస్థితి. సినిమా టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా,
చివరకు క్రికెట్ స్కోరు ఎంతో తెలుసుకోవాలన్నా కూడా అరిచేతిలో ఇంటర్ నెట్
ఉండాల్సిందే. కానీ, అలాంటి ఇంటర్ నెట్ సామర్థ్యం కేవలం ఎనిమిదేళ్లలో
నిండిపోయి, అది కుప్పకూలే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మన కంప్యూటర్లు,
ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు.. అన్నింటికీ నెట్ ను అందించే
కేబుళ్లు, ఆప్టికల్ ఫైబర్ల సామర్థ్యం ఎనిమిదేళ్లలో పూర్తిగా అయిపోతుందట. ఆ
తర్వాత ఇక వాటినుంచి సమాచార ప్రసారం సాధ్యం కాదని చెబుతున్నారు. ఈ విషయం
మీద లండన్ లోని రాయల్ సొసైటీ ఈ నెలాఖరులో ప్రముఖ ఇంజనీర్లు, భౌతిక
శాస్త్రవేత్తలు, టెలికం నిపుణులు, సంస్థలతో ఓ సమావేశం ఏర్పాటుచేసింది.
అందులో పాల్గొన్న ప్రొఫెసర్ ఆండ్రూ ఎలిస్ ఈ బాంబు పేల్చారు. రోజురోజుకూ
డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోందని, దాన్ని తట్టుకోవడం అస్సలు సాధ్యం
ఆకవట్లేదని ఎలిస్ చెప్పారు. రోజురోజుకూ టెక్నాలజీ విస్తరించడం, ఎక్కువ
మందికి, ఎక్కువ సామర్థ్యంతో నెట్ వాడుకోవడం వల్ల ఈ పరిస్థితి
ఏర్పడుతోందన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి