17, జులై 2014, గురువారం

వార్ధక్యం తప్పదు నాకైనా.. నీకైనా..

వార్ధక్యం తప్పదు 
నాకైనా.. నీకైనా..
నిన్నొకరు కావొచ్చు
నేడొకరికి రావొచ్చు..
భయపడ కూడదు
వార్ధక్యం వస్తుందని..
వార్ధక్యం శరీరానికే
మనసుకి కాదుకదా..
మరెందుకలా భయపడతావు
అదేమీ భూతం కాదు
భయపడి చచ్చేందుకు..
ఏదైనా సాధించేందుకు 
సంకల్పసిద్ధి ఉండాలి..
ఎవరైనా ఏదైనా 
సాధించి శోధించేందుకు
అణుకువతో పాటు విజ్ఞత,
సంస్కారమనే సుగుణాలూ అవసరం..
కన్నతల్లికి పిడికెడు అన్నం
పెట్టలేని కుసంస్కారానికి చరమగీతం పాడాలి..
సిరి సంపదలు తిని తొంగుంటేరావు కదా
కష్టపడే మనస్తత్వం ఉండాలి ఎవరికైనా... నేస్తమా..!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి