31, జులై 2014, గురువారం

ధనం ఉంటే...

ధనం ఉంటే ఏదైనా సాధించవచ్చని 
అనుకోవడం మూర్ఖత్వం
గెలుపు ఓటమిలకు కటోర సాధనతో పాటు 
అపారమైన తెలివితేటలు కూడా అవసరం
లేకపోతే కూలుతుంది ఎంతో 
అందంగా కట్టుకున్న సామ్రాజ్యం
నేను చెప్పిందే జరగాలని అనుకోవడం
ఈ ప్రజాస్వామ్యదేశంలో సాధ్యం కాదు
అప్పుడప్పుడు పట్టు విడుపులుండాలి
నిత్యం ఆలనా, పాలన కావాలి
కొన్నిసార్లు లాలింపులు, బుజ్జగింపులు అవసరం
ప్రతిసారీ గాండ్రింపులు, హూంకరింపులు పనికిరావు
ప్రధానంగా జనం ఏం చెబుతున్నారో సహనంగా వినాలి
నీకా సీటిచ్చింది ఆ ప్రజలే కదా నేస్తమా..!   @ రాజేష్ @

శ్రావణంలో భలే సందడి చేస్తున్నావే -ఆషాడం వెళ్లిందని నీకు ..! @ రాజేష్ @


28, జులై 2014, సోమవారం

27, జులై 2014, ఆదివారం

రోజుకో విమాన ప్రమాదం...

రోజుకో విమాన ప్రమాదం
మామూలై పోయింది ఈ విషాదం
అధికారులు కాలేకపోతున్నారు అప్రమత్తం
ఎంత కాలం నేస్తమా ప్రజలతో ఈ చెలగాటం..! @ రాజేష్ @ //28.07.14//

నీకు బుద్దుందా_ నన్నే ముద్దడుగుతావా..! @ రాజేష్ @


26, జులై 2014, శనివారం

దేవుడెవరైనా ఉపదేశం ఒక్కటే...


ఈశ్వర్,అల్లాహ్,యేసు
దేవుడెవరైనా ఉపదేశం ఒక్కటే...
వేషభాషలు,ఆచార వ్యవహారాలేమైనా
మనమందరం (భారతీయులం)ఒక్కటే...
చిన్నటోపీ ధరించి
ఓ హిందువు ముస్లిమైపోతున్నాడు...
మనసారా మోకరిల్లి
ఓ హిందువు క్రిస్టియన్ గా మారిపోతున్నాడు...
కాని ఏ ముస్లిం,క్రిస్టియన్ కూడా
హిందువు కాలేకపోతున్నారెందుకు నేస్తమా...!

"సంగతులు" తెలిశాయి_ నీ స్వరం విన్నాక..! @ రాజేష్ @


24, జులై 2014, గురువారం

నీవు రోజూ నాకోసం_ఇలా ఎందుకు ప్రత్యక్ష్యం..! @ రాజేష్ @


అదిరెను నీ అదరం-బెదిరెను నా హృదయం.. @ రాజేష్ @


కంటి చూపుతో నన్ను పలకరిస్తూ_ఆ కోపమెందుకే కోమలాంగి..! @ రాజేష్ @


నా కోసం అంతాశగా చూడాలా_నీకు నేనేమిస్తున్నానని..! @ రాజేష్ @


నీవు నేనేగా_నీ అంతందంగా నేలేనా ..! @ రాజేష్ @


ఆకులో ఆకునై.. పువ్వులో పువ్వునై.. నిన్నునేనల్లుకుపోతా..! @ రాజేష్ @


ఇపుడే తెలిసింది_ నీ గుండెనిండా నేనున్నానని..! @ రాజేష్ @


నీ కలలో కొచ్చే ఆ చందమామని-నే చూస్తున్నాలే..! @ రాజేష్ @


రాయబారమెందుకే_ పలకరించేందుకు నేనుండగా..! @ రాజేష్ @


ఎన్ని బాధలైనా ఓర్చుకుంటా...నీ చేయే పట్టుకుంటా.. @ రాజేష్ @


ఈ లోకం మారదు - నీకు శోకం తప్పదు...@ రాజేష్ @


దోరపాకాన ఉన్నావు- కొత్త లోకాన్ని చూడబోతున్నావా..? @ రాజేష్ @


కెరటాలను తట్టుకుంటూ.. ఓ పట్టు పడుతూ...


బంతాట ఆడుతూ.. నేనెలా దాచానో ఆ బంతులను...


మా ఆఫీసు సహచరులతో సాగరసంగమం వెళ్లినప్పుడు ఆటవిడుపుగా.. మీలో చాలా మంది ఈ ఆట ఆడేఉంటారుగా..!


సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ఏపేయుడబ్లుజే నిర్వహిస్తున్న మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి గెస్ట్గ్గ్ గా విచ్చేసిన కేంద్ర మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ ముఖ్య నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారికి ఆహ్వానం పలుకుతూ పుష్పగుచ్చం ఇస్తున్న నేను, మా రాష్ట్ర నేతలు సోమసుందర్ గారు, అంబటి ఆంజనేయులు గారిని చూడవచ్చు.

నీ సొగసుముందు_ నా చిరునవ్వు ఏపాటి..! @ రాజేష్ @


21, జులై 2014, సోమవారం

ఏ మన్మధుడు బ్రహ్మను పూని సృష్టించాడో నాకోసం ఈ బంగారాన్ని...!



నన్నిలా నీవలా పలకరిస్తే- నేనెలా ఉండేదిక్కడ ?


చూపులతో చొరబడినట్టే- నాగుండెల్లో దిగబడిపోతున్నావ్


నీ ముద్దంటే నాకిష్టం.. హద్దంటేనే కష్టం..!


అలకపానుపెందుకే- పలకరింపు చాలదా..?


వాలుజడ వయ్యారం- భలే బాగుంది నీసింగారం..!


పొద్దుతిరుగుడు పువ్వల్లే నీవు...భలే ముద్దుగ ఉన్నావే నీవు


గొంతు ఎత్తాలంటే రావాలి రాగం

గొంతు ఎత్తాలంటే రావాలి రాగం
కళ్ళుమూయాలంటే చేయాలి ధ్యానం
షాపింగ్ చేయాలంటే కావాలి ధనం
కాసేపు సరదాగా గడపాలంటే ఉండాలి జనం..!
దీనిలో దేన్ని కాదంటాము నేస్తమా..!!

మంచి కోసం...............

నిన్న కనిపించిన వారు 
నేడు కనుమరుగవుతారు..
వారు కొని పెంచిన మొక్కలు 
నేడు పది మందికి నీడనిచ్చే వృక్షాలవుతాయి..
మంచి కోసం చేసే ఏ పనైనా సఫలమే కదా నేస్తమా..!

మన తెలుగు వారే చేస్తున్నారు గబ్బు

ఎందుకో మనకే ఈ దౌర్భాగ్యం
అప్పటి వరకూ వారు 
మన తెలుగు వారే..!
అంతకు ముందు వారు
ఎక్కడికెళ్లినా మాట్లాడేది స్వచ్చమైన తెలుగే
తీరా కుర్సీలో కూసునే సరికి
మారిపోతారు ఇంగ్లిపీసు దొరలా..!
తెలుగు నాకు తెలీదు
అన్నట్టుగా ఉంటాయి వారి చేష్టలు 
ఏ రాష్టంలో లేని ఈ జబ్బు 
మన తెలుగు వారే చేస్తున్నారు గబ్బు
అసెంబ్లీ లో లేరుగా ఇంగ్లీషు దొరలు
ఉన్నవారంతా తెలుగు దొరలే కదా
మరెందుకు చుపిస్తారు నేతిబీర గాంభీర్యం
పామరుడికి కూడా అర్ధం కావాలిగా వారి తీరు
ఈ నేతలు ఎప్పుటికి మారతారో కదా నేస్తమా..!

వారినికోసారి ఉపవాసం...

ప్రతి ఒక్కరి ఆరాటం 
రోజూ ఆరోగ్యంగా ఉండాలని...
అందుకు చేస్తారు
నిత్యం పోరాటం..
కాని నిలువరించలేక
పోతున్నారు జిహ్వ చాపల్యం..
పదికాలాల పాటు పదిలంగా 
ఉండాలంటే తప్పదుగా నేస్తమా 
వారినికోసారి ఉపవాసం...

ఆలోచించి చేసేవాడు రుషి

ఆలోచించి చేసేవాడు రుషి
అదేశించే వాడు మనీషి
ఆచరించే వాడు మనిషి
ఏమంటారు నేస్తమా..!

అందంగా ఉందని అబద్ధం

అందంగా ఉందని అబద్ధం
అంటించకూడదుగా అందరికీ ఆ'బంధం'
చేదైనా చెప్పాలిగా నిజం
అప్పుడే తెలుస్తుంది నేస్తమా.. నీ నైజం..!

నీ పలకరింపు చాలు

నీ పలకరింపు చాలు
నే పులకరించిపోతా...
నీవు తలిస్తే చాలు
నీ ముందు ప్రత్యక్షమైపోతా..
నీవు కలగంటానంటే చాలు
నీ కనుసన్నలలో ఊగుతుంటా..
నీ వెక్కడుంటానంటే నేనక్కడుంటానంటా
ఇది చాలదా నేస్తమా నీకోసం..!..

చీకట్లో కనిపించనిది

చీకట్లో కనిపించనిది
వెలుగులో వికసిస్తుంది...
మనిషిలో కనిపించనది
మూర్ఖత్వంతో బయటపడుతుంది..
సేవలో కనిపించనది
మానవత్వంతో మైమరపిస్తుంది నేస్తమా..!

20, జులై 2014, ఆదివారం

చూపులు కలసిన శుభవేళా..ఎందుకు నీకాకలవరం..@ రాజేష్ @


చిట్టి చిలకమ్మ నిన్ను ఎవరు కోశారు... ఎక్కడికొచ్చావు.... @ రాజేష్ @


"అభయం" ఎక్కడున్నది? ఆ భయం ఎక్కడున్నది? నీచుట్టూనే.... కు..ను...కు...తున్నది.... @ రాజేష్ @


పయనించే ఓ చిలుకా... ఎగిరిపో.. పాడైపోయెను గూడు... @ రాజేష్ @


అమ్మకుట్టి...అమ్మకుట్టి...ఎక్కడికే...ఓ బామకుట్టీ.... ...@ రాజేష్ @


నేను పుట్టక ముందునుంచి చూస్తున్నా... అంతంత బుగ్గలున్నాయ్... ఏం తింటున్నావ్... ...@ రాజేష్ @


నీ పేరు లోనే కాదు... నీ నిలువెల్లా "ఇశ్వర్య"మే ... @ రాజేష్ @


ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.... దానమ్మ... పంచ్ పడిందా... లేదా... @ రాజేష్ @

 

మనసున ఉన్నది.... చెప్పాలనున్నది... @ రాజేష్ @


నా...క్కొంచెం... తోకుంది... దానికీ లెక్కుంది... హు..హు..హూ... @ రాజేష్ @


మా ఇంట్లో పలావ్,,, మరి మీ ఇంట్లో..


హ...ల్లో... హ...ల్లో...

ఈ రోజు మా ఇంట్లో పలావ్,,, మరి మీ ఇంట్లో... @ రాజేష్ @



భలె...ముద్దొస్తున్నారే...

అయ్యోరామ...ఈ భామలు.. భలె...ముద్దొస్తున్నారే... @ రాజేష్ @

హల్లో... మధుమతి నిన్ను చూస్తుంటే ... పోతుంది నామతి...

హల్లో... మధుమతి నిన్ను చూస్తుంటే ... పోతుంది నామతి... @ రాజేష్ @