27, మార్చి 2015, శుక్రవారం

మనిషిని మనిషిగానే చూడు
మృగంలా చూడకు ఏనాడూ..!
అహంకారంతో తూలనాడకు
అధికారంతో అణిచివేసేందుకు..!
మనసు గాయపడుతుందిని తెలుసుకో
మానవత్వాన్ని పెంచుకో..!
నీవు ఎదిగిన ప్రతి మెట్టూ
కాకూడదు నీఅహంకారినికి తొలిమెట్టు..!
ఎదిగి ఒదిగితేనే నిలబడుతుంది అధికారం
లేదంటే ఉండదు దానికి నీపై మమకారం..!
అధికారంతో అహం పెంచుకోవద్దు
ఆత్మీయులకు దూరం కావొద్దు..!
మీరేమంటారు నేస్తమా @ రాజేష్ /27-03-15/
మీకు మీ కుటుంబ సబ్యులకు..
మన్మధనామ సంవత్సరం...
వసంతఋతువు..చైత్రమాసం..
.శ్రీరాముడు జన్మించిన పుణ్యధినం...
శుభ శనివారం.........
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. ..
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ @ రాజేష్//

23, మార్చి 2015, సోమవారం

అందాన్ని చూసి ఆనందిస్తాం
ఆనందాన్ని స్వాగతిస్తాం..!
సమస్యను శాసిస్తాం
శాసనాన్ని అనుసరిస్తాం..!
జీవితాన్ని ప్రేమిస్తాం
ప్రేమసాధనకు మరణిస్తారెందుకో నేస్తమా..? @ రాజేష్ /24.03.15/
నేతలు ఓటుకు నోటిచ్చారు
విద్యావంతులను మరోసారి ఎగతాళి చేశారు
ప్రలోభాలు మాకు కొత్తకావన్నారు
అధికారమే మాకు పరమావధని నిరూపించుకున్నారు..! @ రాజేష్ /24.03.15/
అడుగులు తడబడుతున్నాయ్_గమ్యం అగమ్యగోచరమైందని..! @ రాజేష్ /24.03.15/
పదవుల పంపకంలో బెడిసికొట్టింది భేటీ
అందుకే తప్పలేదు "మా"లో పోటీ..!..! @ రాజేష్ /24.03.15/

22, మార్చి 2015, ఆదివారం

ఎవరినైనా హర్ట్ చేయడం ఈజీనే_హార్ట్ ని టచ్ చేయడమే కష్టం..!

20, మార్చి 2015, శుక్రవారం

aadhar... aadhar..aadhar
ధూమ,మద్య పానాలు
ఆరోగ్యానికి హానికరం..!
అంటూ హెచ్చరికలు
జారీ చేస్తుంటాయి ప్రభుత్వాలు..!
టార్గెట్లు పెట్టి మరీ
విక్రయాలు కొనసాగిస్తుంటారు..!
అందుకు అడ్డదారిన
వచ్చిన వారికే అనుమతులిచ్చేస్తుంటారు..!
కోట్లరూపాయలు కుమ్మరించిన
వారికే పెద్దపీట వేసేస్తుంటారు..!
గుట్కాలు, పాన్ పరాగ్ లు
నమలడం నిషిద్ధమంటారు..!
అవి తయారు చేసేందుకు
మాత్రం అనుమతులిచ్చేస్తుంటారు..!
అనుమతులివ్వక పోయినా
అక్రమంగా తరలిచ్చేస్తుంటారు..!
అయినా వారిపై తీసుకోరు
ఏ ఒక్కరూ చర్యలు..!
అమ్మే వాడిని, కొనే వాడినే
దోషులుగా చిత్రీకరించేస్తుంటారు..!
చట్టబద్దత లేని వాటిని
వినియోగించడం నేరమైనప్పుడు..!
వాటిని తయారు చేయడం
కూడా నేరంగా ఎందుకు పరిగణించరు..!
ప్లాస్టిక్ కవర్ల వినియోగం
విక్రయాలు నిషేధితమంటారు..!
నిషేధిత తయారీ ఫ్యాక్టరీలపై మాత్రం
ఎందుకు దాడులు చేసి సీజ్ చేయరు..!
ఏదేమైనా చట్టబద్దతలేని వాటిని తయారుచేసి
చట్టాన్నే చుట్టంగా చూసుకునే దళారులదే రాజ్యం..!
అన్ని అనుమతులున్నా ఆరుగాలం
కష్టించిన రైతుకు మాత్రం గిట్టదు గిట్టుబాటు భోజ్యం..!
ఎందుకిలా జరుగుతోంది నేస్తమా..!
ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుంది నేస్తమా..!
@ రాజేష్ /20-03.15//

ప్రతి సుమం సుగంధభరితం
ప్రతి క్షణం ఆనందభరితం
ప్రతిఒక్కరిలో నిలవాలి జీవితాంతం
శ్రీ మన్మధనామ వత్సరం...! @ రాజేష్/21.03.15/

18, మార్చి 2015, బుధవారం

భేషజాలతో ఎందుకు
అసెంబ్లీ ముందుకు..!
ఒకరిపై మరొకరు ఆరోపణలు
లేదంటే చేసుకుంటున్నారు ధూషణలు..!
తిట్లపురాణానికిదేనా వేదిక
ప్రజలకు లేదా విముక్తి ఇక..!
ఎవరెందుకు తిడుతున్నారో తెలియక
ప్రజలు పడుతున్నారు తికమక..!
చర్చించేందుకు లేవా ఇక ఏ సమస్యలు
సభలో అవసరమా వ్యక్తిగత ధూషణలు..!
ఇందుకేనా మిమ్మల్ని ఎన్నుకున్నారు
సభామర్యాదలు అందరూ వదిలేస్తున్నారు..!
దీనిలో ఏ ఒక్కరికీ లేదు మినహాయింపు
ఎందుకుమళ్ళీ మీడియా సాక్షిగా క్షమాపణల ముక్తాయింపు..! @ రాజేష్ /18-03-15/

16, మార్చి 2015, సోమవారం

చెట్టు కొమ్మకు చెదపడితే
చెట్టుకు వచ్చే నష్టం ఉండదు
చెట్టు వేరుకే ఆ చెద పడితే
చెట్టు మొత్తం కుళ్లిపోతుంది కదా నేస్తమా..! @ రాజేష్
సామాన్యుడికి తప్పని ప్రయాణం
నిత్యం నెత్తిన పెట్రో భారం
కార్పొరేట్ రంగానికే ఇస్తారు అవకాశం
ఎవరొచ్చినా ఆపరు ఈ ఘోరం..! @ రాజేష్/
తుళ్ళిపడుతోంది తుళ్ళూరు ప్రజానీకం
=======================
ప్రజలెన్నుకున్న వారేమో
పక్కాగా ఏసీల్లో నిద్రోతున్నరు
ప్రజలకోసం పాడుబడాల్సిన
ప్రజాప్రతినిధులు రాజకీయం చేస్తున్నరు
రైతులు రోధిస్తున్నా భూసేకరణ పేరుతో
భూములు లాగేసుకుంటున్నరు
అధికార ప్రతినిధులది ఓ మాట
ప్రతిపక్షాలది మరోబాట
ఎందుకిలా జరుగుతోంది
ఎవరికోసం జరుగుతోంది
ఇది న్యాయమో.. అన్యాయమో
తెలియకున్నది ఆంధ్ర "సింగపూరు"లో
ఎవరి మాట వినాలన్నా అంతా గందరగోళం
తుళ్ళిపడుతోంది తుళ్ళూరు ప్రజానీకం
రాయబారం చేస్తున్నరా ..?
రాయ"భేరం" చేస్తున్నరా ..!
ముందు మీరో నిర్ణయానికి
రండి ఓ నేతలారా...! @ రాజేష్
స్వప్రయోజనముంటేనే
ఎవరినైనా పొగుడ్తుంటరు..
నిష్ర్పయోజమని తెలిస్తే
ఆ నోటితోనే తెగుడ్తుంటరు..
ఎందుకిలా నేస్తమా..! @ రాజేష్
మహిళా దినోత్సవం సందర్బంగా
మహిళలపై జరుగుతున్న అరాచకాలను నిరసిస్తూ...
ఓ యువతి పడే ఆవేదన
======================================
అమ్మా... ఓ అమ్మా...
ఏడనున్నవే అమ్మా
అమ్మా... ఓ అమ్మా...
ఏడనున్నవే అమ్మా
ఆడపిల్లనైన నన్ను
ఏల విడిచిపోయావమ్మా...
అందానికే అందమైన
రూపాన్నిచ్చిన ఓ అమ్మా..
ఎందుకిచ్చావు నాకు
ఈ పాడు జన్మ..
ఏడకెళ్ళినా తప్పడం లేదే
నాకు ఈసడింపులు..
ఎవరినడిగినా నాకు
అగుపించడంలేదే ఆదరణ అమ్మా..
చేయని తప్పులకు లోకులు
లోకులు కాకులై పొడుస్తుంటే...
నేనేమీ చేయలేని
నిస్సహాయ స్థితిలో అమ్మా..
న్యాయం కోసమని
పోలీసోళ్లని ఆశ్రయిస్తే
నన్నే అవహేళన చేసినారే అమ్మా..
ఆఘోరాన్ని ఎవరికీ చెప్పుకోలేక
కాసింత నీడ కరువైన నేను
బోరుబోరున ఏడుస్తుంటే అమ్మా..
ఓ రోజున కాసింత
నీడనిస్తనని నమ్మించి
నన్ను అంగట్లో
అమ్మేసినాడే అమ్మా.. ఓ అమ్మా...
ఏడనున్నవే అమ్మా...! @ రాజేష్ /8-3-15/
నిద్రలేచినప్పుడల్లా
పవన్ లో ఉన్న "బాబు"
జూలు విధిలిస్తుంటరు...
దాన్ని చూసి ఆహా...ఓహో
అనే అభిమానులే
తుళ్ళూరు సంఘటనతో
తలపట్టుకుని కూర్చున్నరు...
ఎప్పుడు ఏది
మాట్లాడతారో తెలియదు
ఆ తర్వాత ఏమౌతదోగాని
తూచ్ తూచ్ అంటరు...
బయటకొచ్చినప్పుడల్లా
పేద ప్రజలే నాప్రాణం అంటరు
ఆ "గుట్టు" ఏమోగాని
ఆవలికెళ్ళిన తర్వాత వారెవరంటరు...
ఇదేమి చోధ్యమో జననేతకు
ప్రజలెన్నుకున్న అన్నేమో అలా మారిపోయారు
జననేతగా వచ్చీరాగానే
పిట్టలదొరలా మిగిలిపోతున్నరు...
ఏదేదో సాధిస్తానంటరు
సాధన లేకుండానే సతికిలపడతరు
మిమ్మల్ని "ఆ రకంగా"
ఎవరైనా బెదిరిస్తున్నరా నేస్తమా..! @ రాజేష్/08-03-15/

అబద్దాన్ని నిజం చేయగలమేమో గాని_నిజాన్ని అబద్దంగా మార్చలేము కదా నేస్తమా..! @ రాజేష్
గురివిందగింజ తన నలుపెరగదన్నట్లుగా...
ఉంటుంది కొందరి వ్యవహారతీరు
స్వీయ తప్పిదాలను సమర్ధించుకుంటూ
ఎదుటి వారు ఘోరమైన తప్పిదాలు
చేసేస్తున్నారంటూ తెగ బాధపడుతూ
వాళ్లని హెచ్చరించే ప్రయత్నం
చేసేస్తుంటారు ఎందుకలా నేస్తమా..? @ రాజేష్

భయపడుతూ రాత్రిపూట
తప్పు చేసేవాడ్ని దొంగ
అని ముద్రవేస్తున్నాం...!
పక్కాప్రణాళిక ప్రకారం
పట్టపగలే అందరికీ తెలిసేలా
తప్పు చేసేవాడ్ని మాత్రం నాయకుడని
అందరూ అంటున్నారెందుకు నేస్తమా..! @ రాజేష్ /17.03.15/
మల్లెపూవుకెపుడూ
సువాసనతో కూడిన
సుగంధాలు వెదజల్లడమే తెలుసు..!
నాగుపాముకెపుడూ
నరునిపై ప్రమాదకరమైన
విషాన్ని కక్కడమే తెలుసు కదా నేస్తమా..!  @ రాజేష్ /17.03.15/

2, మార్చి 2015, సోమవారం

ఆనందం కోసం
అనుబంధాలను పెంచుకుంటారు..
పోరాటం కోసం
ఉన్న బంధాలనే తెంచుకుంటారు
ఇదేమి విచిత్రమో కదా నేస్తమా..! @ రాజేష్ /

1, మార్చి 2015, ఆదివారం

బ్యాంకు బుక్ కాదిది
డబ్బులు దాచుకోడానికి
లుక్ లో టేస్టుండే "ఫేస్ బుక్కిది"
అందుకే పెట్టారు పేరు దీనికది
వరద కాని మాటలవరదలు దొర్లుతాయి
సరదాలకు భలేసరదాలు పండుతాయి
మంచి మసాల బొమ్మల కొలువు
వళ్లు దగ్గర పెట్టుకోపోతే పోతుంది పరువు
అక్షర మాలలకు తక్షణమే లైకులు
లేదంటే మంటల్లేని కామెంట్లు
ఇష్టమైన వారిని ఇష్టపడొచ్చు కష్టమనుకుంటే కట్ చేయొచ్చు
కాని అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవుతుంది "ఫేస్" బుక్
   ----- @ రాజేష్ //
పుట్టిన ప్రతివాడు ఏదోఒకరోజు గిట్టక తప్పదు
అలా అని ప్రతిరోజూ చనిపోయేందుకు యత్నించకూడదు కదా..!
మృత్యుఫు ఎవరిని ఏ రూపంలో ఎప్పుడు ఆవహిస్తుందో ఎవరికీ తెలియదు
కొందరు కావాలని చాఫుని వెతుక్కుని వెళ్ళినా చివరిటంచుల వరకూ వెళ్ళినా ఏదో ఒక చిత్ర విచిత్ర సంఘటనతో బతికి బట్టకట్టేస్తారు
కొందరు అమ్మో చావంటే నాకు భయం ప్రతి సంఘటన పై స్పందిస్తూ చిన్ని ప్రమాదసంఘటనలోనే మృత్యు కౌగిట్లో వదిగిపోతారు
విధి ఎంత బలీయమైనదో కదా నేస్తమా..!
పుట్టి ఏం సాధించామని కొందరు
ఎందుకు పుట్టాకో తెలియడం లేదని మరికొందరు
బతికేమి సాధించాలని ఇంకొందరు వాదులాడతారు
జీవితంలో ఎదురయ్యే ప్రతి ఘటనా ఓ అనుభవమే
ఆ అనుభవాన్ని గుణపాటంగా తీసుకుని స్థితి గతులను మార్చుకోవాలని ఏ ఒక్కరూ ఆలోచించరెందుకని..?
పుట్టిన ప్రతివారూ అందగా ఉండరు
అలాగని అందరూ అందవిహీంగానూ ఉండరు
ఎవరి అందం వారిదే ఒకరి అందం మరొకరికి రాదు
అలానే ఒకరి జీవితం మరొకరికి రాదు
అందరూ ధనవంతులే ఉండరుగా..
పేద మధ్యతరగతి వారూ ఉంటారు
ఎవరి కష్టాలు వారివే
ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకుంటారేమోగాని
కష్టాలను మాత్రం ఎవరూ పంచుకోలేరు
అందుకే ఎవరి పరిధిలో వారు సుఖంగా జీవించడం మేలు కదా నేస్తమా..! @ రాజేష్ //

ఇక రాజధాని పరిసరాల్లో కనుమరుగయ్యే
కమనీయదృశ్యలు ఇలాంటివెన్నెన్నో...  
@ రాజేష్
ఆంధ్రా సింగపూర్ కి
(తుళ్ళూరు)త్వరలో వస్తుందట
హైటెక్కులతో ఫైవ్ డక్కర్ బస్సు
రోడ్లు ఎలా ఉన్న పరవాలేదంట
రయ్ రయ్ మంటూ అలా ముందుకెళ్ళిపోతుందట నేస్తమా ...!
@ రాజేష్

ఎప్పుడూ నీలో తప్పులు వెతికే
యజమానికి నిత్యం సేవచేయలేమట
పాము పడగనీడలో కప్ప ఉండినట్లే
అది క్షణక్షణమూ ప్రాణాపాయమే కదా నేస్తమా..! @ రాజేష్ @
గాలిలో నీవు పంపిన సందేశమేమిటి...?
పూలతో నువ్వు నింపుతున్న తీపి తలపేమిటి నేస్తమా..!
@ రాజేష్
ఎంత కమ్మగా ఆస్వాదిస్తాయో... నీకురులు_ ఆ మల్లెల సుగంధ పరిమళాల్ని..
.@ రాజేష్
భలే బాగుంది ఆ నవ్వు_పులకరింతకు గురిచేస్తుంది నీ కవ్వింపు..!
@ రాజేష్ /
నేను తప్ప మరొకడెవరూ
ఎదగకూడదనుకునే స్వభావం
నీలో ఉంటే వెంటనే తొలగించుకో
లేకపోతే నీవు తాత్కాలికంగా
ఎదుగుతావేమోగాని భవిష్యత్ లో
నీకంటూ ఆ...నలుగురు మిత్రులు
కూడా కరువవుతారు నేస్తమా..!
నలుగురు పనివాళ్లను నాలుగు
కాసులిచ్చి కొనుక్కోవచ్చునేమో గాని
ఆ నలుగురు మిత్రులను
పైసలిచ్చి సంపాదించడం
చాలా దుర్లభమే కదా నేస్తమా..!
నీ కంటూ ఉన్న
ఆ నలుగురినీ నమ్ము కాని..
నమ్ముతూ అనుమానించకు
చివరికి నీ అనుమానమే
పెనుభూతం అవుతుంది జాగ్రత్త నేస్తమా..! @ రాజేష్ @
మోసపూరిత మాటలను మట్టుపెట్టాలనుకున్నారు
పవర్ పాలిట్రిక్స్ ను పాలదోలానుకున్నారు
సామాన్యుడిని అసమాన్యుడుగా మార్చేశారు
సామాన్యుల సత్తా ఏంటో ఢిల్లీ నేతలకు చూపించేశారు
జనరంజక పాలనకే పట్టం కట్టేశారు
దేశంలో మాకు తిరుగులేదని ఢిల్లీ గల్లీలో
తిరిగే అమిత్.. "షాకు" కొట్టించారు
ఆమ్ ఆద్మి పార్టీకి ఆధ్బుతమైన విజయం సాధించిపెట్టారు
ప్రపంచంలోని దేశాధినేతలను సైతం ఆకట్టుకున్నమోది
దేశరాజధాని లోని సామాన్యులనే ఆకట్టుకోలేక పోయారు
ఓటమిపాలైన పార్టీలు తప్పును ఒప్పుకోపోయినా
సామాన్యులను పక్కన పెడుతున్నారనేది వాస్తవం
మద్యం,డబ్బుకి బానిసలం కాదని చాటి చెప్పిన
సామాన్యుడి విజయం ఇది కాదంటారా నేస్తమా..!                            @ రాజేశ్వరరావు కొండా
హాట్ హాట్ సీట్ ని
క్రేజ్ క్రేజీ గా
కేజ్రీవాల్ కొట్టేశారు
సామాన్యులనే
నమ్ముకున్నారు
అసమాన్యుడిగా
మారిపోయారు
బీజేపీ పాలనకిది
చెంపపెట్టు అని చెప్పొచ్చు
విజయం అంటే రోజుకు మూడు
డ్రస్సులు మార్చడం
క్రేజ్ అనుకున్నారేమో మోదీ
స్వచ్చభారత్ తో కూడా
సాధించలేకపోయారేంది
ఇప్పటికైనా తెలుసుకోలేకపోతే
ఎవరికైనా ఇదేగతి
సామాన్యుడిని పట్టించుకోపోతే
చెబుతారు ఇలానే బుద్ది                                                  - రాజేశ్వరరావు కొండా
ఏది సాధించాలన్నా
వయస్సున్నప్పుడే
శోధించి సాధించాలి
వయస్సు మళ్ళిన
తర్వాత అది అసాధ్యమే..!
అవకాశాలు
అన్నివేళలా రావు
అవి వచ్చినప్పుడు
అందిపుచ్చుకున్న వాడే
అసలైన తెలివిగలవాడు..!
అతి తెలివికి పోయి
ఇంకేదో సాధించాలని
ఉన్న అవకాశాన్ని
వదిలేసి రానిదాని కోసం
ఆశగా ఎదురు చూస్తూ
కాలాన్ని వృధా చేసేవాడు
తెలివితక్కువ వాడికిందేలెక్క
మీరేమంటారు నేస్తమా..! @ రాజేష్ @
అధికారం ఎప్పుడూ ఏ ఒక్కరి సొత్తుకాదు కదా నేస్తమా..!
@ రాజేష్ @

గన్నవరం నుండి విజయవాడ వరకూ
చేస్తారట హైవేకి నిండుగా పచ్చదనం
అలా చేయకపోతే ఎలా వస్తుంది
విమానాల్లో ఎగిరి వచ్చే పెద్దలకు ఆహ్లాదం..!

రాజధాని పేరుతో హైటెక్కు హంగులు
ఖర్చు పెట్టేందుకు లేవంటారు ఖజానాలో టింగుటింగులు
అయినా ఆపేది లేదంటారు బస్తీలో సేవలు
బడా బాబులకు ఎంతైనా ఖర్చు పెట్టేస్తుంటారు..!

మురికివాడలో జనం
మురుగుతో మునిగిపోతే మనకేం
వారి ఆకలి కేకలు మనకెందుకు
మనవాళ్ళు అనేది మునిగి పోకూడదంతే
ఎవరెంత మొత్తుకున్నా
నాకేమీ తెలియదనట్టు పట్టించుకోరన్నా
ఓటేసిన పాపానికి అనుభవించాలిగా ఐదేళ్ళు
కాదంటే లోపలికి వెళ్ళవుగా నాలుగేళ్లు కదా నేస్తమా...!
@ రాజేష్ /
బెజవాడ పోలీసులు
ఎప్పుడూ బిజీబిజీ
రాజధాని తాకిడితో
వీరికి మరింత పెరిగింది గజిబిజి
నేతలొచ్చినా-మాతలొచ్చినా
తారలొచ్చినా-ధృవతారలొచ్చినా
బాంబులొచ్చినా-డాంబులొచ్చినా
ఎక్కడేమైనా-వీరిదే హడావుడి

ట్రాఫిక్ - కంట్రోల్ చేయడం
ఫైన్లు రాయడం- కేసులు కట్టడం
దొంగల్ని పట్టడం- అరెస్ట్ లు చేయడం
ఇలా..ఇలా..చెప్పుకుంటూ పోతే చాంతాండంత
అయినా తప్పడం లేదు నగరానికి చింత
అందుకే బాసూ మీరు జర ఆలోచించాలి ఒకింత
రోజురోజుకీ అవుతున్నాయి
సమస్యలు జఠిలం
పోలీసులు పాటించలేక
పోతున్నారు కఠినం
ఎందుకోసమో ఈ ఉదారం
బతికేందుకు కావాలిగా వారికీ ఈ ఉద్యోగం నేస్తమా.  ! @ రాజేష్ /
బాసూ జర చూడరాదే..!
=================
నిత్యం ట్రాఫిక్ తో సతమతం
కంట్రోల్ రూం దగ్గరే ఈ బాగోతం
ఐనా పట్టదు ఎవరికీ ఈ తతంగం
ఎన్నాళ్ళు చేస్తారు ఈ ట్రాఫిక్ జపం
నేస్తమా..!
తెలుగు వారిని తెలుగులోనే పలకరిద్దాం
మన తెలుగును మనమే గౌరవిద్దాం
మీరేమంటారు నేస్తమా..! @ రాజేష్
చెట్టు కొమ్మకు చెదపడితే
చెట్టుకు వచ్చే నష్టం ఉండదు
చెట్టు వేరుకే ఆ చెద పడితే
చెట్టు మొత్తం కుళ్లిపోతుంది కదా నేస్తమా..! @ రాజేష్
సామాన్యుడికి తప్పని ప్రయాణం
నిత్యం నెత్తిన పెట్రో భారం
కార్పొరేట్ రంగానికే ఇస్తారు అవకాశం
ఎవరొచ్చినా ఆపరు ఈ ఘోరం..! @ రాజేష్/