31, అక్టోబర్ 2014, శుక్రవారం
30, అక్టోబర్ 2014, గురువారం
“మాంగల్య ధారణ ముహూర్తః సుముహూర్తః అస్తు”
“మాంగల్య ధారణ ముహూర్తః సుముహూర్తః అస్తు”
అని పురోహితులు పలికే శుభ ఘడియల కోసం,
మధురమైన ఊహలతో వేచిన యువతీ యువకుల,
మానసోల్లాసము ఉప్పొంగు మాంగళ సూత్రధారణ వేళ,
తొమ్మిది సూత్రముల పసుపుల కలయికల ప్రేమ చిహ్నం,
ధర్మ, అర్థ, కామ పురుషార్థముల సమయించు సంకేతమై,
గత, ప్రస్తుత, ముందు రాబోవు జన్మల అన్యోన్య బంధమై,
మనసా. వాచా, కర్మణా సౌమనస్యం కలిగి చరించుటకై,
శుభప్రదమగు మంత్రోచ్చారణ విధితో భజంత్రీలు మ్రోగ,
వివాహ మండపమున అక్షింతల జల్లు కురియుచుండగ,
‘కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం’ అనుచు వరుడు
శోభాయమానముగా వధువు మెడలో తాళి కట్టు వేడుక. .@ Kanaka Sai Kumar Malladi
అని పురోహితులు పలికే శుభ ఘడియల కోసం,
మధురమైన ఊహలతో వేచిన యువతీ యువకుల,
మానసోల్లాసము ఉప్పొంగు మాంగళ సూత్రధారణ వేళ,
తొమ్మిది సూత్రముల పసుపుల కలయికల ప్రేమ చిహ్నం,
ధర్మ, అర్థ, కామ పురుషార్థముల సమయించు సంకేతమై,
గత, ప్రస్తుత, ముందు రాబోవు జన్మల అన్యోన్య బంధమై,
మనసా. వాచా, కర్మణా సౌమనస్యం కలిగి చరించుటకై,
శుభప్రదమగు మంత్రోచ్చారణ విధితో భజంత్రీలు మ్రోగ,
వివాహ మండపమున అక్షింతల జల్లు కురియుచుండగ,
‘కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం’ అనుచు వరుడు
శోభాయమానముగా వధువు మెడలో తాళి కట్టు వేడుక. .
పాలల్లో అభ్యంగనం చేసిన పరువాలతో...
చందనాల నలుగు రాసిన మేనిచాయతో..
పాలల్లో అభ్యంగనం చేసిన పరువాలతో...
వెన్నెల విరిసిన తెల్లని చీరతో..
బిడియమనే నగతురుమిన నయనాలతో..
సిగ్గు పెదవులపై చిరునవ్వులా వికసించగా
వరుడు కట్టే పసుపు తాడుకై ఆనందంతో మెడను వంచీ..
తాళికట్టు వేళా తన మునివేళ్ళస్పర్శ తో మది పులకరించగా..
ముడి ముడికీ...మనసు మనసు..మమేకమౌతూ..
మూడు ముళ్ళ ఈ బంధం పదికాలాలు పదిలంగా ఉండాలని..
వధువు కోరుకునే సమయాన తన మదిలో మెదిలే కన్నీటి భాష్పాలు ఎందరికి తెల్సు??
ఒకరినొకరు చూసుకున్న తొలిక్షణాన ఇంత అందం నాదేనా అని వరుడి మదిలో...
ఇంత ఉన్నత వ్యక్తి సాన్నిత్యం కలకాలం నాదే కదా అని వధువు మదిలో...! ... @ Subha Mantrala

మల్లెల పూతోట = మన మంచి పాట
గుండు మల్లెలు
బొగడ మల్లెలు
జడ మల్లెలు
ఝుంటు మల్లెలు
అందమైన మల్లెలు
అద్భుతమైన మల్లెలు
ఆనందాన్నిచ్చే మల్లెలు
ఆకర్షణీయమైన మల్లెలు
ప్రేమను పెంచే మల్లెలు
ప్రేమకు ప్రతిరూపం మల్లెలు
యవ్వన్నాన్ని కవ్వించే మల్లెలు
హృదయాన్ని రంజింపచేసే మల్లెలు
మదిని పులకింపచేసేవి మల్లెలు
హృధిని రంజింపచేసేవి మల్లెలు
పడతులజడలోచేరేవి మల్లెలు
పడక గదిలో హాయిని గొలిపేవి మల్లెలు
తొలి రాత్రిని రంజింపచేసే మల్లెలు
మనసున్న మనసైన మరు మల్లెలు!......@ రాజేష్ @
29, అక్టోబర్ 2014, బుధవారం
28, అక్టోబర్ 2014, మంగళవారం
26, అక్టోబర్ 2014, ఆదివారం
25, అక్టోబర్ 2014, శనివారం
ఆశకు హద్దుండాలి దేనికైనా...!
ఏదోలా ఎంతో ఎత్తుకి ఎదగాలని నీకున్నా..
సమయం నీకు అనుకూలించాలిరా కన్నా..
ముందుగ అందరి సహకారం ఉండాలన్నా..
మెండుగ పెద్దవారి మన్ననలు లేకున్నా...
చివరికి నీకు మిగిలేది సున్నా..
వీటన్నిటి కంటే ముందు ఆశ నీకున్నా
నీ అర్హతలు తెలుసుకుని మసులుకోరా నాన్నా...
అందుకే నన్నునేను ఎప్పుడూ ప్రశ్నించుకుంటూ..
సుదిగుండంలో బాణాలు వేస్తూ..
తప్పులతోనే తప్పటడుగులు వేస్తూ...
అర్హతలకు మించిన ఆశలకు పోతూ..
జీవితంలో ఓడిపోతూ..
నిరంతరం ఆశాజీవిగా...
బతకడం అవసరమా నేస్తమా.. @ రాజేష్ @
24, అక్టోబర్ 2014, శుక్రవారం
23, అక్టోబర్ 2014, గురువారం
నీకొచ్చిన కష్టమేంటి నాన్నా..?
ఎందుకొచ్చిందీ ఆ ఆవేదన..!
ఎవరికోసం ఆ నిరీక్షణ..!
దేనికోసం ఆ విలాపం..!
ఎందుకోసం ఆ ఆక్రోశం..!
నీ ఆవేదన తీరే మార్గం లేదా..?
నీ నిరీక్షణ ఫలించే సమయం రాదా..?
నీ విలాపం తీర్చే వారు రారా..?
నీ ఆక్రోశాన్ని అణిచే వారే లేరా..?
కాటిన్యమెరగని నీ కళ్ళు ఎందుకెరుపెక్కాయి..
నీలేలేత పాలబుగ్గలెందుకు కందిపోయాయి..
నిన్నెవరేమన్నారు కన్నా..?

22, అక్టోబర్ 2014, బుధవారం
21, అక్టోబర్ 2014, మంగళవారం
20, అక్టోబర్ 2014, సోమవారం
ఆదుకుందాం... ప్రతి ఒక్కరూ ముందుకు రండి..!!
19, అక్టోబర్ 2014, ఆదివారం
ప్రకృతికి ప్రతిఒక్కరం ప్రణమిల్లుదాం
విశాఖను కలవర పెట్టిన హుదుద్
నిలువనీడ లేకుండా చేసిన హుదుద్
కడలి తీరాన్ని గడగడలాడించిన హుదుద్
ఉప్పెనై నగరాన్ని ముప్పుతిప్పలు పెట్టిన హుదుద్
నందనవనమైన సుందర నగరాన్నిశిథిలం చేసిన హుదుద్
సుడిగాలితో పెనవేసుకుని కల్లోలం సృష్టించిన హుదుద్
మానవ తప్పిదాలను మరోసారి హెచ్చరించిన హుదుద్
మరువలేని గాయాలతో అంధకారాన్ని నింపిన హుదుద్
ప్రకృతి ప్రకోపంతో ప్రతాపం చూపిన హుదుద్
పచ్చదనాన్ని మైమరిచిన పైశాచికాన్ని హెచ్చరించిన హుదుద్
అందుకే ప్రకృతికి ప్రతిఒక్కరం ప్రణమిల్లుదాం
భావితరాలకు మనమందరం బాటలు వేద్దాం.. నేస్తమా..!

18, అక్టోబర్ 2014, శనివారం
అబద్దం.. అబద్దం.. అబద్దం..
అబద్దం.. అబద్దం.. అబద్దం..
లోకమంతా రాజ్యమేలేది ఆ అబద్దమే
తెల్లారితే ప్రతి ఒక్కరికీ
ఆ పదంతోనే ఎంతో అనుబంధం
అయినా ఏ ఒక్కరూ ఒప్పుకోరు ఆ బంధం
అయిన దానికీ కాని దానికి చెప్పకూడదుగా అబద్దం
అవసరమై కొందరు... అత్యవసరమై మరికొందరు
నిత్యం ఏదోక అబద్దం చెప్పకపోతే తెల్లారదు
కావాలని కాదుగా చెప్పేది అబద్దం
ఎదుట వారిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేదే అబద్దం
అర్ధం చేసుకుంటేనే దానికి ఓ అర్థం
అర్ధం చేసుకోపోతేనే ఇక అదివ్యర్ధం
మీరెమంటారు నేస్తం...!

నా బ్లాగర్ వీక్షకుల సంఖ్య కేవలం మూడునెలల వ్యవధిలో నేటికి 10,250వేలకు చేరుకుందని తెలియజేయుటకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను.
నమస్తే నేస్తమా..! @ రాజేష్ @
మీ అందరికీ నా ధన్యవాదాలు
నా బ్లాగర్ వీక్షకుల సంఖ్య కేవలం మూడునెలల వ్యవధిలో నేటికి 10,250వేలకు చేరుకుందని తెలియజేయుటకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ విధంగా సహకరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. వీలయితే మీరూ నా బ్లాగును చూడవచ్చు. ఇక్కడ నొక్కండి http://rajeswaraokonda.blogspot.in నా బ్లాగును చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి..ఓకేనా ఫెండ్ర్స్

17, అక్టోబర్ 2014, శుక్రవారం
16, అక్టోబర్ 2014, గురువారం
15, అక్టోబర్ 2014, బుధవారం
13, అక్టోబర్ 2014, సోమవారం
12, అక్టోబర్ 2014, ఆదివారం
9, అక్టోబర్ 2014, గురువారం
5, అక్టోబర్ 2014, ఆదివారం
3, అక్టోబర్ 2014, శుక్రవారం
ఎప్పడొస్తుందో అందరు మెచ్చేపాలన చంద్రన్నా..
విమర్శలకు తావులేని
పాలన చేయలేరా చంద్రన్నా..
ప్రజలు మెచ్చే పాలన
చేయలేరా చంద్రన్నా..
నేను మారానని
చెప్పారు కదా చంద్రన్నా..
ఏది మీరు మారిన
విధం చంద్రన్నా..
సీమాంధ్ర రాజధానికేమో
చందాలంటారు చంద్రన్నా..
వదిలేసే దానికి పదికోట్లు ఖర్చు
ఎందుకు పెడుతున్నారు చంద్రన్నా..
విలాసాలకు ఇస్తున్నారు బంపర్ ఆఫర్లు
పథకాలకేమో పెడుతున్నారు కోతలు
ఇదేనా మీరు మారిన తీరు
ప్రతిపక్షాలతో ఉండదా మరి ఆ పోరు
వందరోజులు గడిచినా కాలేదు
మీ తొలిసంతకం అమలు
ఇది మీ పాలనకు
మచ్చుతునక కాదా చంద్రన్నా..
ఇదెక్కిడి రాజ్యమో..
ఇది ఎవరి రాజ్యమో.. చంద్రన్నా...
ఎప్పడొస్తుందో అందరు
మెచ్చేపాలన చంద్రన్నా.. @ రాజేష్ @
పాలన చేయలేరా చంద్రన్నా..
ప్రజలు మెచ్చే పాలన
చేయలేరా చంద్రన్నా..
నేను మారానని
చెప్పారు కదా చంద్రన్నా..
ఏది మీరు మారిన
విధం చంద్రన్నా..
సీమాంధ్ర రాజధానికేమో
చందాలంటారు చంద్రన్నా..
వదిలేసే దానికి పదికోట్లు ఖర్చు
ఎందుకు పెడుతున్నారు చంద్రన్నా..
విలాసాలకు ఇస్తున్నారు బంపర్ ఆఫర్లు
పథకాలకేమో పెడుతున్నారు కోతలు
ఇదేనా మీరు మారిన తీరు
ప్రతిపక్షాలతో ఉండదా మరి ఆ పోరు
వందరోజులు గడిచినా కాలేదు
మీ తొలిసంతకం అమలు
ఇది మీ పాలనకు
మచ్చుతునక కాదా చంద్రన్నా..
ఇదెక్కిడి రాజ్యమో..
ఇది ఎవరి రాజ్యమో.. చంద్రన్నా...
ఎప్పడొస్తుందో అందరు
మెచ్చేపాలన చంద్రన్నా.. @ రాజేష్ @
ఎప్పుడూ ఏదీ శాశ్వతం కాదు...
ఇంతలోనే ఎంత మార్పు
అందం.. అధికారం..దర్పం..
ఎప్పుడూ ఏదీ శాశ్వతం కాదు
ఇంతలోనే వస్తాయి..
అంతలోనే మాయమౌతాయి
దీనికి ఎవరూ అతీతులు కాదని..
మరోసారి రుజువయ్యింది
చట్టం ముందు అందరూ..
అందరూ సమానులే సుమీ
దేశానికి రాజైనా..
ప్రజలకు ఇష్టదైవమైనా
తప్పు చేస్తే శిక్ష తప్పదు మరి..
కోర్టు శిక్ష వేసిన తర్వాత
ఇది అన్యాయం..
అది న్యాయం
అంటూ చెప్పడం తగదు..
న్యాయాన్యాయాలు పరిశీలించిన
మీదట వచ్చేదే తీర్పు ..
ఆ తీర్పును శిరసా వహించాలే తప్ప
దానిపై చర్చోప చర్చలు తగదు నేస్తమా..!
అందం.. అధికారం..దర్పం..
ఎప్పుడూ ఏదీ శాశ్వతం కాదు
ఇంతలోనే వస్తాయి..
అంతలోనే మాయమౌతాయి
దీనికి ఎవరూ అతీతులు కాదని..
మరోసారి రుజువయ్యింది
చట్టం ముందు అందరూ..
అందరూ సమానులే సుమీ
దేశానికి రాజైనా..
ప్రజలకు ఇష్టదైవమైనా
తప్పు చేస్తే శిక్ష తప్పదు మరి..
కోర్టు శిక్ష వేసిన తర్వాత
ఇది అన్యాయం..
అది న్యాయం
అంటూ చెప్పడం తగదు..
న్యాయాన్యాయాలు పరిశీలించిన
మీదట వచ్చేదే తీర్పు ..
ఆ తీర్పును శిరసా వహించాలే తప్ప
దానిపై చర్చోప చర్చలు తగదు నేస్తమా..!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)