అయ్యవార్లూ... అయ్యవార్లూ...
మీరు ఎంతో గొప్పవాళ్లూ..
అధికారం కోసం మీరేదైనా చేసేస్తారూ..
అందలం ఎక్కిన తర్వాత అంతా మరచిపోతారు...
అయ్యవార్లూ... మీరు ఎంతో గొప్పవాళ్లూ..
ఆ పీఠం ఎక్కే వరకే అందరినీ ఆదరిస్తారు
దళితులు నా రక్తసంబందీకులంటారు
వృద్దులు మా తాతముత్తాతలంటారు
మహిళలు మా తోబుట్టువులంటారు
అయ్యవార్లూ... మీరు ఎంతో గొప్పవాళ్లూ..
పథకాలు పెడతాం ..అవన్నీ మీవేనంటారు
గద్దెక్కిన తర్వాత పిడికెడు పథకం కూడా దరిచేరనీయరు మీరు
పథకం కోసం ప్రయాసపడి వచ్చిన వారికి అర్హత లేదంటారు
అదేమంటే ఆధార్ కార్డ్ అంటున్నారు లేదంటే అర్హతే లేదంటున్నారు
అయ్యవార్లూ... మీరు ఎంతో గొప్పవాళ్లూ..
గద్దెనెక్కించేందుకు మమ్మల్ని ఏమారుస్తారు మీరు
అదెక్కిన తర్వాత మమ్మల్ని మర్చిపోతారు మీరు
ఆ అందలం ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు మీరు
అందుకు మీకు అన్ని చట్టాలు చుట్టాలేనంటారు
వృద్దులైన మేము పించనడిగితే మాత్రం షరతులు వర్తిస్తాయంటారు
అయ్యవార్లూ... మీరు ఎంతో గొప్పవాళ్లూ.. //@ రాజేష్//

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి