13, సెప్టెంబర్ 2014, శనివారం

వలువలు ఊడదీస్తేనే నేడు నటికి విలువనా..?

ఎటు పరుగెడుతోంది
ఎటు పయనిస్తోంది
నేటి సినీ ప్రపంచం..
చెడును చెడుగుడాడి
మంచిని ప్రోత్సహించాల్సిన
సినీ ప్రముఖులు ...
నేడు చేస్తున్నదేంటి
ప్రజానికానికి
చూపిస్తున్నదేంటి
ఎటు పోతుంది నేటి సమాజం
ఏమై పోతుంది నేటి సినీసామ్రాజ్యం
వలువలు ఊడదీస్తేనే
నేడు నటికి విలువనా
ఎంత ఎక్కుఫ వివస్త్రంగా మారితే
అంత పెద్దతారగా మలిచేయడేమేనా...
పబ్లిసిటీ పిచ్చిలో
మన సంస్కృతికి విఘాతం కల్పిస్తూ
విదేశీ సంస్కృతినే మన సంస్కృతిగా
మలిచేస్తూ తీస్తున్న ఈ సినిమాలలో
యువత ఎంత పతనైపోతున్నదో మీకు తెలుస్తుందా..?
మీకొచ్చే కలెక్షన్లే చెబుతున్నా
మీరెందుకు మారడం లేదు
ఇదేనా మీకు కావాల్సింది
ఇదేనా మన సంస్కృతి మనకు నేర్పింది...
గాఢమైన ప్రేమను సైతం
కనుసైగలతోనే చేయించి
చూపించిన దర్శక నిర్మాతలు
నేడు కరువయ్యారో... కనుమరుగయ్యరో
అర్ధంకాని దుస్థితిలో
సినీ ప్రపంచం కొట్టుమిట్టాదుతోంది
ఆనాటి లైలా ముజ్ఞు, ఓ దేవదాసు,
సువర్ణసుందరి,ప్రేమాభిషేకం
ఇంకే బోలుడన్ని చిత్రాలు
రికార్డులు బద్దలుకొట్టలేదా
హిట్లు కొట్టలేదా...
అంతెందుకు ఇటీవల
శేఖర్ కమ్ముల చేసిన
సినిమాలు హిట్లు కాలేదా..
ఇంటిల్లపాది సరదాగా కూర్చుని
చూసే సినిమాలు తీయడం రాదా మీకు
ఓ హీరోని ఆ తరహా చూపించడంలో
ఎందుకు మీరు విఫలమౌతున్నారు నేస్తమా..
దర్శక నిర్మాతలూ
ఒక్కసారి అలోచించంది ప్లీజ్... @ రాజేష్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి