3, డిసెంబర్ 2014, బుధవారం

28, నవంబర్ 2014, శుక్రవారం

ఓ జాబిలమ్మ రేయిరేయంతా రెప్పవేయనేలేదు ఎందుచేత..! @ రాజేష్


ప్రశ్నించడానికే వచ్చా..

ప్రశ్నించడానికే వచ్చా..
ప్రశ్నించడం ద్వారా
పవర్ పీకేస్తా..
ప్రశ్నించడం వల్లే
న్యాయం చేస్తా..
ప్రశ్నించడం ద్వారానే
"పవర్" సాధిస్తా..
అంటూ ఎన్నికల
ముందు ఎంతో
పవర్ ఫూల్ గా
డప్పాలు కొట్టిన
నేత లేరండీ..?
పవర్ పంచ్ లు
పీకేసి లంచాల
మంచాల మీద
తొంగున్నారా ఏంది..?
రాష్ట్రంలో ఏం
జరుగుతుందో
కనీసం తొంగి చూస్తున్నారా..?
ఎవరైనా ఎన్నికల ముందే
ప్రశ్నిస్తారా..?
ఆ తర్వాత ప్రశ్నించరా..?
ఇదేనా ప్రశ్నించడం అంటే.. నేస్తమా..?
ఏంది..? హ.. హ... హ... @ రాజేష్ //

కాటుక కంటనీరు పెదవులకంటనీకు_చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు..! @ రాజేష్


చుకుబుకు పోరి చుకుబుకు పోరి_ అ దూకుడెందుకే నారీ..! @ రాజేష్


కమనీయం నీ నయనం_సుమధురం నీ అదరం..! @ రాజేష్ @


24, నవంబర్ 2014, సోమవారం

మీసారొస్తానన్నారా ఇక్కడికీ అందుకేనే హుషారుగా_ ఈ సైకిల్ పై ఆ సవారీ..! @ రాజేష్


చిట్టి గౌను వేసుకున్న పెద్దపాప_ఆ... చిలిపి చేష్టలెందుకో చెప్పరాదా..! @ రాజేష్ /


నా ఊహలకు ఊతమిచ్చే ఊహాసుందరివా-కలానికి బలాన్నిచ్చే అప్సరసవా..? @ రాజేష్ /


ఏందమ్మా మంచాల మీద తొంగున్నారా..?

ప్రశ్నించడానికే వచ్చా..
ప్రశ్నించడం ద్వారా
పవర్ పీకేస్తా..
ప్రశ్నించడం వల్లే
న్యాయం చేస్తా..
ప్రశ్నించడం ద్వారానే
"పవర్" సాధిస్తా..
అంటూ ఎన్నికల
ముందు ఎంతో
పవర్ ఫూల్ గా
డప్పాలు కొట్టిన
నేత లేరండీ..?
పవర్ పంచ్ లు
పీకేసి లంచాల
మంచాల మీద
తొంగున్నారా ఏంది..?
రాష్ట్రంలో ఏం
జరుగుతుందో
కనీసం తొంగి చూస్తున్నారా..?
ఎవరైనా ఎన్నికల ముందే
ప్రశ్నిస్తారా..?
ఆ తర్వాత ప్రశ్నించరా..?
ఇదేనా ప్రశ్నించడం అంటే.. నేస్తమా..?
ఏంది..? హ.. హ... హ... @ రాజేష్ //

19, నవంబర్ 2014, బుధవారం

అలా అవాక్కయ్యావేంటి_నా అందం ముందు నీ సౌందర్యం చిన్నబోయిందా ఏంటి బాలా..! @ రాజేష్ @/


ప్రేయసి చేసేద్రోహాన్ని మాత్రం ...

శత్రువు పగనైనా
అంచనా వేయవొచ్చేమోగాని
ప్రేయసి చేసేద్రోహాన్ని మాత్రం
అంచనా వేయడం
ఎవడి తరమూ కాదు... @ రాజేష్ @

అయ్యయ్యో...అందచందాలన్నీ అరకొరగా లయ తప్పాయేంటమ్మా అనుష్కా..! @ రాజేష్ /


మీ అందం మరింత..

మీ అందం మరింత
సౌందర్యంగా ఉండాలంటే
"మెరుగు" పరుచుకోవాలే
తప్ప తళుకు బెళుకులు
అంటించుకోకూడదు నేస్తమా..! @ రాజేష్

అడవిలాంటి అందాలనిలా ఆరబోస్తే ఎలా_ ఆక్రమించేస్తారు జాగ్రత్త..! @ రాజేష్


17, నవంబర్ 2014, సోమవారం

నీవలిగినప్పుడే ...

నీవలిగినప్పుడే ఆ చూపులు _ నన్నే వెతుకుతాయెందుకో చెప్పగలవా చెలీ
@ రాజేష్ @/

అలా అవాక్కయ్యావేంటి..

అలా అవాక్కయ్యావేంటి_నా అందం ముందు నీ సౌందర్యం చిన్నబోయిందా ఏంటి బాలా..!
@ రాజేష్ @/18-11-14/

14, నవంబర్ 2014, శుక్రవారం

నన్నేమో విందుభోజనానికి పిలిచితివి...

నన్నేమో విందుభోజనానికి పిలిచితివి_నీవేమో ఆరుబయట అందాలు ఆరబోస్తుంటివి ఎలా చెప్మా..! @ రాజేష్ @

ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు

ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు
ప్రేమను ప్రేమగా ప్రేమించడంలో
మనుషులు ఓడిపోతున్నారు తప్ప..! @ రాజేష్ @

11, నవంబర్ 2014, మంగళవారం

నీ సోకుమాడ.. కెవ్వు కేక.. @ raajesh @

కెవ్వు కేక.. నా సామిరంగా.. కెవ్వు కేక..
కెవ్వు కేక.. నీ సోకుమాడ.. కెవ్వు కేక..

ఫేస్ బుక్ లో ఇష్టమైందే చూడండి..!


అమ్మ ఎవరికైనా అమ్మేకదా

అమ్మ ఆలన తల్లిపాలన
అవసరం ఎవరికైనా..
అమ్మ అంటే కలిసిపోయే పెదాలు
అత్త అంటే దూరమౌతాయెందుకో మరి
అమ్మ ఎవరికైనా అమ్మేకదా
అందుకే అంటారు
అమ్మ ప్రేమ ఎంతో మధురమని
అవును కదా నేస్తమా..! @ రాజేశ్వరరావు కొండా @

10, నవంబర్ 2014, సోమవారం

డబ్బెవరికి చేదు..! @ రాజేష్ @

డబ్బెవరికి చేదు..!
డబ్బుంటే ఏదైనా చేయవచ్చు
డబ్బుంటే ఏదైనా సాధించవచ్చు
డబ్బుంటేనే మమకారం
డబ్బులేకుంటే చీత్కారం
డబ్బులేకుంటే ఎటకారం
డబ్బేగా అంతా నడిపించేది
డబ్బేగా మనసులను కలిపేది
డబ్బేగా మనుషులను నిలిపేది
డబ్బేగా దేశాన్ని నడిపించేది
డబ్బేగా ప్రపంచాన్ని శాసించేది
డబ్బులేని వారిని దరిద్రులంటారు
డబ్బున్న వారిని మహారాజులంటారు
డబ్బున్న వాడికే మరింత డబ్బు
డబ్బులేని వాడికి డబ్బే పెద్దజబ్బు కదా నేస్తమా..!

@ రాజేష్ @

అనుభూతే లేకపోతే...

అందమైన అనుభవాన్ని
కొందరితోనైనా పంచుకుంటే
ఆ తృప్తే వేరుగా ఉంటుంది..
అనుభవించే అనుభూతే లేకపోతే
ఆ హృదయాలను ఏ విధంగా
మలచగలం నేస్తమా..!  @ రాజేష్ @ 

అవును నేను వ్యభిచారినే.....

అవును నేను వ్యభిచారినే.....
కాలే కడుపుకోసం
కౌగిలింతలకు ఖరీదు కట్టేదాన్ని
కన్న బిడ్డలకోసం
అవమానాన్ని కళ్ళు ముసుకోనైన భరించేదాన్ని
అన్నం మెతుకులకోసం
అగంతకుల అలింగనాన్ని అప్యాయించేదాన్ని
జానెడు పొట్ట కోసం
వికృత బీభాస్తాది వివిధ రసాలని
విసుగు చెందక ఆహ్వానించే దాన్ని
కట్టు బట్ట కోసం
నగ్నత్వాన్ని నడిబజారులో పరిచేదాన్ని
తెగిపడని సమస్యల నిలువరింపు కోసం
రంగులు చిట్లిన రతి రోతను భరించేదాన్ని
పది పైసల నుండి , పదివేల వరకైనా
ప్రతి పైసను పరువంతో వెలకట్టేదాన్ని
నన్ను చూసి ముడిపడిన నీ నొసటి గీతాలను
నా పెదవి విరుపుతో విదిలించేదాన్ని..................
మాతాంగి,బోగిని,జోగిని, దేవదాసీ,వేశ్యా
అని నాకు నామకరణం చేసిన ఓ పాతివ్రత్యమా........
అసలు ఇక్కడ సంసారి ఎవరు........?!?!?!
మగడి కౌగిలింతలో పరపురుషుని స్పర్శను
ఊహిస్తూ మానసిక వ్యభిచారం చేసే నీవు
మాతాంగివి కావా....?
బోర్ కొట్టిన ప్రతిసారి బాయ్ ఫ్రెండ్ను మార్చే
నీవు బోగినివి కావా.....?
యజమాని మెప్పుగోలు కోసం
వాని కంపరం పుట్టే కామం చూపులను
నవ్వుతూ భరించే నువ్వు దేవదాసివి కావా......?
జానెడు బట్టే బరువైన రంగుల ప్రపంచంలో
వెన్నెల బొమ్మల వెలుగొందే నీవు
జోగినివి కావా......?
మీ బ్రతుకు కంటే హీనమైనదా నాది????????   ...............NithinGoud

చిత్ర విచిత్ర వేషాలెందుకే చిత్రాంగి- కన్ను గీటుతూ ఆ కొంటె చేష్టలెందుకే కోమలాంగి ..! @ రాజేష్ @


7, నవంబర్ 2014, శుక్రవారం

మన మంచి తనం @ రాజేష్ @

మన మంచి తనమే
మనల్ని ముందుకు నడిపిస్తుంది..
మన మంచి తనమే
ననకు జీఫనాధారం అవుతుంది
మన మంచి తనమే
మనల్ని నిర్ధేశిస్తుంది
మన మంచి తనమే
మనల్ని శాసిస్తుంది
మన మంచి తనమే
మనల్ని వేధిస్తుంది
మన మంచి తనమే
మనల్ని శోధిస్తుంది
మన మంచి తనమే
మనల్ని శత్రువు చేస్తుంది
మన మంచి తనమే
మనల్ని మిత్రునిగా మిగుల్చుతుంది
అలా అని మన మంచి తనాన్ని
ఎవరో పనికిమాలిన వాళ్ళ దగ్గర
నిరూపించుకోవాల్సిన అవసరం లేదని
మాత్రం గుర్తుంచుకో నేస్తమా..!  @ రాజేష్ @

పికాసో.. చిత్రానివా..ఎల్లోరా.. శిల్పానివా..? @రాజేష్


పాపం పిచ్చి మారాజు..@ రాజేష్


6, నవంబర్ 2014, గురువారం

రాజధాని నిర్మాణం..!

మంగళగిరి,తుళ్లూరు,అమరావతి పరిసర ప్రాంతాలను రైతులనుండి తక్కువ ధరకుకొనుగోలు చేసి పంటలు పండే పచ్చటి ప్రాంతాలలో రాజధాని నిర్మాణం చేస్తారట... ఇంత వరకూ బాగానే ఉంది. కాని నూజివీడు పరిసర ప్రాంతాలలోని అటవీభూములను ఆపార్టీలోని పారిశ్రామిక వేత్తలకు ఎక్కువ ధరకు విక్రయించి రాష్ట్రలోటుబడ్జెట్ ను పూడ్చేస్తారట .... ఇంకో విషయం తెలుసా.. అమరావతి పరిసరాలలో రాజధాని ఏర్పాటు విషయంలో దలైలామా నుంచి కూడా వత్తిడి బాగా ఉందని రాజకీయ నేతలు ప్రచారం చేస్తున్నారు వీటీలో ఏది వాస్తవమో మరి రానున్న కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది కదా నేస్తమా..!

ఆ నవ్వుతో ఎటో వెళ్ళిపోయింది_నావయస్సు... @ రాజేష్


5, నవంబర్ 2014, బుధవారం

ఇప్పటికైనా అమ్మలకు ఆలనగా ఉండు ... @ రాజేష్ @

అమ్మలందరికి పించన్లు ఇస్తామంటే నమ్మి
నడవలేని మేము క్లూలు కట్టి మరీ ఓట్లు వేశామే..
ఏ ఆధారం లేని మాకు
అండగా నిలుస్తానంటే నమ్మి...
ఏదోలా ఆదాయం వస్తుందిలేనని
ఆశపడ్డ మాకు "ఆధార్"ను
అడ్డుపెట్టి అసలుకే ఎసరు పెడుతుండ్రు మీరు
సల్లంగ నడిచి పోయి
బ్యాంకుల్లో మెల్లంగ తెచ్చుకునే
రోజులు పోయాయి మాకు...
గంటల తరబడి గెంటుకుంటేనే కాని
మాకు ఆ గడియ గడిచే దిక్కులేకపాయే
ఉన్న పించనైనా వచ్చేదాక ఉందోలేదో తెలియక...
ఇదేనా కొడుకుగా నీవు మాకు ఇచ్చే ఆలన
ఇదేనా మేము ఆశించిన పాలన...
ఇప్పటికైనా అమ్మలకు ఆలనగా ఉండు
రాష్టానికి మంచి పాలకుడిగా నుండు.... @ రాజేష్ @

దిక్కులు సూస్తున్నావేంటి.. దిగులుగున్నావేంటి.. నీవనుకున్న కబురందలేదా సక్కనైన సుక్కా..! @ రాజేష్


ముందుందులే మంచిరోజు..!

హీరోగా ఎదుగుతున్న రోజుల్లో
నన్ను నేను తెలుసుకోలేకపోయా
తెలుసుకుని అనుభవిద్దామనుకునే
సరికి జీరోనైపోయా..
అదృష్టం వెంటే దురదృష్టం
వెంటాడుతుందంటారు ఇదేనేమో
ఏదైనా జరిగింది మన మంచికే కదా నేస్తమా..!
@ రాజేష్ @

4, నవంబర్ 2014, మంగళవారం

నమ్ముతూ అనుమానించకు నేస్తమా..!


నేను తప్ప మరొకడెవరూ
ఎదగకూడదనుకునే స్వభావం
నీలో ఉంటే వెంటనే తొలగించుకో
లేకపోతే నీవు తాత్కాలికంగా
ఎదుగుతావేమోగాని భవిష్యత్ లో
నీకంటూ ఆ...నలుగురు మిత్రులు
కూడా కరువవుతారు నేస్తమా..!
నలుగురు పనివాళ్లను నాలుగు
కాసులిచ్చి కొనుక్కోవచ్చునేమో గాని
ఆ నలుగురు మిత్రులను
పైసలిచ్చి సంపాదించడం
చాలా దుర్లభమే కదా నేస్తమా..!
నీ కంటూ ఉన్న
ఆ నలుగురినీ నమ్ము కాని..
నమ్ముతూ అనుమానించకు
చివరికి నీ అనుమానమే
పెనుభూతం అవుతుంది జాగ్రత్త నేస్తమా..! @ రాజేష్ @

3, నవంబర్ 2014, సోమవారం

నా అంతరంగంలోని కవితాత్మను మేలుకొలుపుతోంది_ నీ సహజ సౌందర్యం..! @ రాజేష్


నీ పక్కనే పొంచి ఉంటారు జాగ్రత్త నేస్తమా..!

ఎప్పుడైనా అధికారముంటేనే
చేరతారు నీ చుట్టూ హితులు..
నేడు ధనముంటేనే
పొగుడుతారు ప్రతి ఒక్కరూ..
ఆ రెండింటికీ నీ వెప్పుడు
దూరమైతే వారప్పుడే పారిపోతారు..
నీ బాధను పంచుకోవడానికి
ఎవరూ ఉండకపోవచ్చు..
నీ కన్నీళ్ళు తుడవడానికి
ఎవరూ రాకపోవచ్చు..
కానీ నీ తప్పులను ఎంచడానికి మాత్రం
నీ పక్కనే పొంచి ఉంటారు జాగ్రత్త నేస్తమా..!
@ రాజేష్ @

2, నవంబర్ 2014, ఆదివారం

అంతా మాయే కదా...

అంతా మాయే కదా
నీవు నీవన్నది మాయే...
నేను నేన్నది కూడా మాయే
ఏదో ఉంది అన్నది మాయే...
ఏదీ లేదన్నదీ మాయే
ఔనన్నది మాయే...
నేడు లేదన్నదీ మాయే
రేపు రాదన్నదీ మాయే...
కాదు కాదన్నదీ మాయే
లేదన్నదీ మాయే...
లేనిది ఉందన్నదీ మాయే
స్వర్గం మాయ నరకం మాయా...
నేను మాయ నీవు మాయ
సర్వమూ మాయే కదా నేస్తమా..!
@ రాజేష్ @

కుబేరులు మరింత కుబేరులు

కుబేరులు మరింత కుబేరులు
అవుతునే ఉన్నారు..
పేదవాడు ఎప్పుడూ
ఇంకా పేదవాడిగానే మిగిలిపోతున్నాడు..
ఎందుకిలా జరుగుతుంది..నేస్తమా..! @ రాజేష్

సొగసైన నీ నయనాలు అందమైన నా ఆలోచనలకు ఊపిరిపోస్తున్నాయి..! @ రాజేష్


31, అక్టోబర్ 2014, శుక్రవారం

తప్పు తప్పే కదా...

తెలియక చేసినా
తెలిసి చేసినా
తప్పు తప్పే కదా...
అనుకోకుండా చేసినా
అనుకుని చేసినా
తప్పు తప్పే కదా...
కావాలని చేసినా
కాదనుకుని చేసినా
తప్పు తప్పే కదా...
అలా చేసిన తప్పుని
క్షమించమనే ఒక్కమాటతో
చేసిన ఆ తప్పు ఒప్పయిపోతుందా...
కాదు కదా
మరి అలాంటి తప్పు ఒప్పవ్వలంటే
ఏం చేయాలో సలహా ఇవ్వండి ప్లీజ్ నేస్తమా.. @ రాజేష్

30, అక్టోబర్ 2014, గురువారం

“మాంగల్య ధారణ ముహూర్తః సుముహూర్తః అస్తు”

“మాంగల్య ధారణ ముహూర్తః సుముహూర్తః అస్తు”
అని పురోహితులు పలికే శుభ ఘడియల కోసం,
మధురమైన ఊహలతో వేచిన యువతీ యువకుల,
మానసోల్లాసము ఉప్పొంగు మాంగళ సూత్రధారణ వేళ,
తొమ్మిది సూత్రముల పసుపుల కలయికల ప్రేమ చిహ్నం,
ధర్మ, అర్థ, కామ పురుషార్థముల సమయించు సంకేతమై,
గత, ప్రస్తుత, ముందు రాబోవు జన్మల అన్యోన్య బంధమై,
మనసా. వాచా, కర్మణా సౌమనస్యం కలిగి చరించుటకై,
శుభప్రదమగు మంత్రోచ్చారణ విధితో భజంత్రీలు మ్రోగ,
వివాహ మండపమున అక్షింతల జల్లు కురియుచుండగ,
‘కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం’ అనుచు వరుడు
శోభాయమానముగా వధువు మెడలో తాళి కట్టు వేడుక. .         @     Kanaka Sai Kumar Malladi

పాలల్లో అభ్యంగనం చేసిన పరువాలతో...

చందనాల నలుగు రాసిన మేనిచాయతో..
పాలల్లో అభ్యంగనం చేసిన పరువాలతో...
వెన్నెల విరిసిన తెల్లని చీరతో..
బిడియమనే నగతురుమిన నయనాలతో..
సిగ్గు పెదవులపై చిరునవ్వులా వికసించగా
వరుడు కట్టే పసుపు తాడుకై ఆనందంతో మెడను వంచీ..
తాళికట్టు వేళా తన మునివేళ్ళస్పర్శ తో మది పులకరించగా..
ముడి ముడికీ...మనసు మనసు..మమేకమౌతూ..
మూడు ముళ్ళ ఈ బంధం పదికాలాలు పదిలంగా ఉండాలని..
వధువు కోరుకునే సమయాన తన మదిలో మెదిలే కన్నీటి భాష్పాలు ఎందరికి తెల్సు??
ఒకరినొకరు చూసుకున్న తొలిక్షణాన ఇంత అందం నాదేనా అని వరుడి మదిలో...
ఇంత ఉన్నత వ్యక్తి సాన్నిత్యం కలకాలం నాదే కదా అని వధువు మదిలో...!     ...   @   Subha Mantrala



మల్లెల పూతోట = మన మంచి పాట


గుండు మల్లెలు
బొగడ మల్లెలు
జడ మల్లెలు
ఝుంటు మల్లెలు
అందమైన మల్లెలు
అద్భుతమైన మల్లెలు
ఆనందాన్నిచ్చే మల్లెలు
ఆకర్షణీయమైన మల్లెలు
ప్రేమను పెంచే మల్లెలు
ప్రేమకు ప్రతిరూపం మల్లెలు
యవ్వన్నాన్ని కవ్వించే మల్లెలు
హృదయాన్ని రంజింపచేసే మల్లెలు
మదిని పులకింపచేసేవి మల్లెలు
హృధిని రంజింపచేసేవి మల్లెలు
పడతులజడలోచేరేవి మల్లెలు
పడక గదిలో హాయిని గొలిపేవి మల్లెలు
తొలి రాత్రిని రంజింపచేసే మల్లెలు
మనసున్న మనసైన మరు మల్లెలు!......@ రాజేష్ @

ఎందుకలా..చెలీ..? పిలవకనే పిలుస్తున్నాయ్ నీకనులు.. నవ్వకనే నవ్వుతున్నాయ్ నీ పెదవులు... @ రాజేష్ @


29, అక్టోబర్ 2014, బుధవారం

ఇప్పుడు ఇసుకే బంగారం...


నల్లదనంపై ఆంధ్రజ్యోతి,ఈనాడు,సాక్షి,పత్రికల అభిప్రాయం...




అట్లా చూడొద్దన్నానా..నాతో మాట్లాడొద్దన్నానా.. మరెందుకలా ఇంకా నన్నే చూస్తున్నావమ్మా... @ రాజేష్ @


విజయవాడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ

 విజయవాడ ప్రెస్ క్లబ్ కు నన్ను కూడా జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంతో ఎన్నుకున్న సందర్భంగా సభ్యులందరికీ అభివాదం చేస్తున్న నేను.. ప్రెస్ క్లబ్ నూతన కమిటీ గ్రూప్ ఫొటో... మీకోసం...