10, నవంబర్ 2014, సోమవారం

అవును నేను వ్యభిచారినే.....

అవును నేను వ్యభిచారినే.....
కాలే కడుపుకోసం
కౌగిలింతలకు ఖరీదు కట్టేదాన్ని
కన్న బిడ్డలకోసం
అవమానాన్ని కళ్ళు ముసుకోనైన భరించేదాన్ని
అన్నం మెతుకులకోసం
అగంతకుల అలింగనాన్ని అప్యాయించేదాన్ని
జానెడు పొట్ట కోసం
వికృత బీభాస్తాది వివిధ రసాలని
విసుగు చెందక ఆహ్వానించే దాన్ని
కట్టు బట్ట కోసం
నగ్నత్వాన్ని నడిబజారులో పరిచేదాన్ని
తెగిపడని సమస్యల నిలువరింపు కోసం
రంగులు చిట్లిన రతి రోతను భరించేదాన్ని
పది పైసల నుండి , పదివేల వరకైనా
ప్రతి పైసను పరువంతో వెలకట్టేదాన్ని
నన్ను చూసి ముడిపడిన నీ నొసటి గీతాలను
నా పెదవి విరుపుతో విదిలించేదాన్ని..................
మాతాంగి,బోగిని,జోగిని, దేవదాసీ,వేశ్యా
అని నాకు నామకరణం చేసిన ఓ పాతివ్రత్యమా........
అసలు ఇక్కడ సంసారి ఎవరు........?!?!?!
మగడి కౌగిలింతలో పరపురుషుని స్పర్శను
ఊహిస్తూ మానసిక వ్యభిచారం చేసే నీవు
మాతాంగివి కావా....?
బోర్ కొట్టిన ప్రతిసారి బాయ్ ఫ్రెండ్ను మార్చే
నీవు బోగినివి కావా.....?
యజమాని మెప్పుగోలు కోసం
వాని కంపరం పుట్టే కామం చూపులను
నవ్వుతూ భరించే నువ్వు దేవదాసివి కావా......?
జానెడు బట్టే బరువైన రంగుల ప్రపంచంలో
వెన్నెల బొమ్మల వెలుగొందే నీవు
జోగినివి కావా......?
మీ బ్రతుకు కంటే హీనమైనదా నాది????????   ...............NithinGoud

1 కామెంట్‌:

  1. మగడి కౌగిలింతలో పరపురుషుని స్పర్శను
    ఊహిస్తూ మానసిక వ్యభిచారం చేసే నీవు
    మాతాంగివి కావా....?
    బోర్ కొట్టిన ప్రతిసారి బాయ్ ఫ్రెండ్ను మార్చే
    నీవు బోగినివి కావా.....?

    బాగా రాసారు

    రిప్లయితొలగించండి