3, నవంబర్ 2014, సోమవారం

నీ పక్కనే పొంచి ఉంటారు జాగ్రత్త నేస్తమా..!

ఎప్పుడైనా అధికారముంటేనే
చేరతారు నీ చుట్టూ హితులు..
నేడు ధనముంటేనే
పొగుడుతారు ప్రతి ఒక్కరూ..
ఆ రెండింటికీ నీ వెప్పుడు
దూరమైతే వారప్పుడే పారిపోతారు..
నీ బాధను పంచుకోవడానికి
ఎవరూ ఉండకపోవచ్చు..
నీ కన్నీళ్ళు తుడవడానికి
ఎవరూ రాకపోవచ్చు..
కానీ నీ తప్పులను ఎంచడానికి మాత్రం
నీ పక్కనే పొంచి ఉంటారు జాగ్రత్త నేస్తమా..!
@ రాజేష్ @

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి