6, మే 2015, బుధవారం

మౌనం, నవ్వు రెండూ శక్తిమంతమైన ఆయుదాలట
నవ్వు ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ
మౌనం చాలా సమస్యలను నిరోధిస్తుందట తెలుసా నేస్తమా..!
సింగపూరు,చైనా తలదన్నే విధంగా
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి
కొత్త కొత్త హంగులు అద్దేస్తున్నారందరూ
మాస్టర్ ప్లాన్ తో బూస్టప్ చేసేస్తున్నారు కొందరు
రాష్ట్ర రాజధాని అమరావతి స్వరూపం
ఎలా ఉంటుందో తెలియదు ఎవరికీ కాని
రాజధాని హంగులనే ప్రతిఒక్కరూ ఎరగావేస్తూ
రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిపోయారు...
ఆకాశంలో చుక్కలేమోగాని
మబ్బుల్లో విహరించేలా చేసేస్తున్నారు
పట్టపగలు మనకు కనపడకపోయినా
కళ్ళముందే కనికట్టు చేసేస్తూ
భవంతుల మీద భవంతులు కట్టేస్తున్నారు
ఇందుకు పత్రికలూ ఏమీ తీసిపోలేదు
ప్రతిరోజూ ఒకరికొకరు పోటీ పడుతూ
ప్రజల్ని మాత్రం ఏమార్చేస్తున్నారు
ఇదేమి వింతో.. ఇదేమి మాయో..
కనుమరుగు కాబోతుంది విజయవాడ వైభోగం
రాజ్యమేలబోతోంది అందచందాల అమరావతి సుందరరూపం...!
@ రాజేష్ @
శ్వాస,ధ్యాస ఒకటైనప్పుడు_లక్ష్యసాధన సునాయాసమే కదా నేస్తమా..! @ రాజేష్ @
నటనే ధ్యేయంగా..
స్వార్ధమే పరమార్ధంగా..
అసూయే ఆస్తిగా..
కుతంత్రమే పెట్టుబడిగా..
వెటకారమే వినయంగా..
కొందరు మురిసిపోతూ
ఎదుటి వారిని ఏమార్చేస్తుంటారు..
జరబద్రం నేస్తమా..! @ రాజేష్ //07.05.15//
నన్ను ఎప్పుడూ ఓడిస్తావు_స్వచ్చమైన నీ ప్రేమతో..! @ రాజేష్ //07.05.15//

ఇంటర్ నెట్ ఇక ఆగిపోతుందా?

Sakshi | Updated: May 04, 2015 16:28 (IST)
ఇంటర్ నెట్ ఇక ఆగిపోతుందా?
లండన్ : ప్రతివారికీ ఇప్పుడు చేతిలో ఇంటర్ నెట్ లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి. సినిమా టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా, చివరకు క్రికెట్ స్కోరు ఎంతో తెలుసుకోవాలన్నా కూడా అరిచేతిలో ఇంటర్ నెట్ ఉండాల్సిందే. కానీ, అలాంటి ఇంటర్ నెట్ సామర్థ్యం కేవలం ఎనిమిదేళ్లలో నిండిపోయి, అది కుప్పకూలే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మన కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు.. అన్నింటికీ నెట్ ను అందించే కేబుళ్లు, ఆప్టికల్ ఫైబర్ల సామర్థ్యం ఎనిమిదేళ్లలో పూర్తిగా అయిపోతుందట. ఆ తర్వాత ఇక వాటినుంచి సమాచార ప్రసారం సాధ్యం కాదని చెబుతున్నారు.  ఈ విషయం మీద లండన్ లోని రాయల్ సొసైటీ ఈ నెలాఖరులో ప్రముఖ ఇంజనీర్లు, భౌతిక శాస్త్రవేత్తలు, టెలికం నిపుణులు, సంస్థలతో ఓ సమావేశం ఏర్పాటుచేసింది.

అందులో పాల్గొన్న ప్రొఫెసర్ ఆండ్రూ ఎలిస్ ఈ బాంబు పేల్చారు. రోజురోజుకూ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోందని, దాన్ని తట్టుకోవడం అస్సలు సాధ్యం ఆకవట్లేదని ఎలిస్ చెప్పారు. రోజురోజుకూ టెక్నాలజీ విస్తరించడం, ఎక్కువ మందికి, ఎక్కువ సామర్థ్యంతో నెట్ వాడుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు.