31, అక్టోబర్ 2014, శుక్రవారం

తప్పు తప్పే కదా...

తెలియక చేసినా
తెలిసి చేసినా
తప్పు తప్పే కదా...
అనుకోకుండా చేసినా
అనుకుని చేసినా
తప్పు తప్పే కదా...
కావాలని చేసినా
కాదనుకుని చేసినా
తప్పు తప్పే కదా...
అలా చేసిన తప్పుని
క్షమించమనే ఒక్కమాటతో
చేసిన ఆ తప్పు ఒప్పయిపోతుందా...
కాదు కదా
మరి అలాంటి తప్పు ఒప్పవ్వలంటే
ఏం చేయాలో సలహా ఇవ్వండి ప్లీజ్ నేస్తమా.. @ రాజేష్

30, అక్టోబర్ 2014, గురువారం

“మాంగల్య ధారణ ముహూర్తః సుముహూర్తః అస్తు”

“మాంగల్య ధారణ ముహూర్తః సుముహూర్తః అస్తు”
అని పురోహితులు పలికే శుభ ఘడియల కోసం,
మధురమైన ఊహలతో వేచిన యువతీ యువకుల,
మానసోల్లాసము ఉప్పొంగు మాంగళ సూత్రధారణ వేళ,
తొమ్మిది సూత్రముల పసుపుల కలయికల ప్రేమ చిహ్నం,
ధర్మ, అర్థ, కామ పురుషార్థముల సమయించు సంకేతమై,
గత, ప్రస్తుత, ముందు రాబోవు జన్మల అన్యోన్య బంధమై,
మనసా. వాచా, కర్మణా సౌమనస్యం కలిగి చరించుటకై,
శుభప్రదమగు మంత్రోచ్చారణ విధితో భజంత్రీలు మ్రోగ,
వివాహ మండపమున అక్షింతల జల్లు కురియుచుండగ,
‘కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం’ అనుచు వరుడు
శోభాయమానముగా వధువు మెడలో తాళి కట్టు వేడుక. .         @     Kanaka Sai Kumar Malladi

పాలల్లో అభ్యంగనం చేసిన పరువాలతో...

చందనాల నలుగు రాసిన మేనిచాయతో..
పాలల్లో అభ్యంగనం చేసిన పరువాలతో...
వెన్నెల విరిసిన తెల్లని చీరతో..
బిడియమనే నగతురుమిన నయనాలతో..
సిగ్గు పెదవులపై చిరునవ్వులా వికసించగా
వరుడు కట్టే పసుపు తాడుకై ఆనందంతో మెడను వంచీ..
తాళికట్టు వేళా తన మునివేళ్ళస్పర్శ తో మది పులకరించగా..
ముడి ముడికీ...మనసు మనసు..మమేకమౌతూ..
మూడు ముళ్ళ ఈ బంధం పదికాలాలు పదిలంగా ఉండాలని..
వధువు కోరుకునే సమయాన తన మదిలో మెదిలే కన్నీటి భాష్పాలు ఎందరికి తెల్సు??
ఒకరినొకరు చూసుకున్న తొలిక్షణాన ఇంత అందం నాదేనా అని వరుడి మదిలో...
ఇంత ఉన్నత వ్యక్తి సాన్నిత్యం కలకాలం నాదే కదా అని వధువు మదిలో...!     ...   @   Subha Mantrala



మల్లెల పూతోట = మన మంచి పాట


గుండు మల్లెలు
బొగడ మల్లెలు
జడ మల్లెలు
ఝుంటు మల్లెలు
అందమైన మల్లెలు
అద్భుతమైన మల్లెలు
ఆనందాన్నిచ్చే మల్లెలు
ఆకర్షణీయమైన మల్లెలు
ప్రేమను పెంచే మల్లెలు
ప్రేమకు ప్రతిరూపం మల్లెలు
యవ్వన్నాన్ని కవ్వించే మల్లెలు
హృదయాన్ని రంజింపచేసే మల్లెలు
మదిని పులకింపచేసేవి మల్లెలు
హృధిని రంజింపచేసేవి మల్లెలు
పడతులజడలోచేరేవి మల్లెలు
పడక గదిలో హాయిని గొలిపేవి మల్లెలు
తొలి రాత్రిని రంజింపచేసే మల్లెలు
మనసున్న మనసైన మరు మల్లెలు!......@ రాజేష్ @

ఎందుకలా..చెలీ..? పిలవకనే పిలుస్తున్నాయ్ నీకనులు.. నవ్వకనే నవ్వుతున్నాయ్ నీ పెదవులు... @ రాజేష్ @